breaking news
GowliGuda
-
అలనాటి సీబీఎస్ ఆపన్న హస్తం!
సాక్షి, హైదరాబాద్: గౌలిగూడ బస్టాండ్‌గా పేరొందిన సెంట్రల్ బస్ స్టేషన్ ఒకప్పటి హైదరాబాద్ తొలి ప్రధాన బస్టాండ్. ఎంజీబీఎస్‌కు ముందు దశాబ్దాల పాటు ఇక్కడి నుంచే ఉమ్మడి ఏపీలోని అనేక నగరాలు, పట్టణాలకు సర్విసులు నడిచేవి. భాగ్యనగర చారిత్రక కట్టడాల్లో ఇదీ ఒకటి. తదనంతర కాలంలో మిసిసిపీ హ్యాంగర్‌గా పిలిచే ఈ భారీ ఐరన్ ఫ్రాబ్రికేటెడ్ నిర్మాణం శిథిలమై, కుప్పకూలి కనుమరుగైంది. కానీ ఆ బస్టాండ్ స్థలం ఆర్టీసీకి ఇప్పటికీ సేవలందిస్తూనే ఉంది. ప్రస్తుతం సిటీ సర్విసులు నిలిపే స్థలంగా వినియోగంలో ఉంది. దీని పక్కనే హైదరాబాద్–1 డిపో ఉంటుంది.ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అయితే తాజా గా ఈ స్థలాన్ని కొలెటరల్ సెక్యూరిటీగా ఉంచిన ఆర్టీసీ హడ్కో నుంచి రూ.400 కోట్ల రుణాన్ని సమకూర్చుకున్నట్టు తెలిసింది. సంస్థలో పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ఈ నిధులు సేకరించినట్టు సమాచారం. ముఖ్యంగా.. ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక పరమైన సెటిల్మెంట్లు పూర్తి చేయడం, 2017 వేతన సవరణ ప్రయోజనాన్ని కల్పించటం, ఆర్జిత సెలవుల మొత్తాన్ని అందించటం, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)కు చెందిన వాడేసుకున్న నిధులను తిరిగి జమ చేయటం, పీఎఫ్ బకాయిలు చెల్లించటం లాంటి వాటి కోసం ఈ రుణాన్ని తీసుకున్నట్టు తెలిసింది. సర్కారు ఆదేశంతో.. : రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో వారు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఇక సీసీఎస్, పీఎఫ్‌లకు సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కార కేసులు నమోదు కావటం, పీఎఫ్ నుంచి షోకాజ్ నోటీసులు రావటం లాంటి వాటి నేపథ్యంలో.. వీటన్నింటినీ చెల్లించటం ఆర్టీసీకి అత్యవసరమైంది. గతంలో ఆర్టీసీకి బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని గ్రాంట్లు కూడా ఉండేవి. అలాగే మరికొన్ని పూచీకత్తు రుణాలుండేవి. కానీ, ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించటం ద్వారా సంస్థకు ఏర్పడే లోటును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి వస్తోంది. దీంతో బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా దానికే పరిమితం చేసి గ్రాంట్లు, లోన్లను అనధికారికంగా రద్దు చేసింది.దీంతో సంస్థ అవసరాలకు నిధులు లేకుండా పోయాయి. గతంలో ఏవైనా అవసరాలకు ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు పొందే విధానం ఉండగా, కొంతకాలంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని దృష్టిలో ఉంచుకుని పూచీకత్తు ఇవ్వటానికి వెనకాడుతోంది. దీంతో ఆర్టీసీనే సొంతంగా రుణాలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఆస్తులను తాకట్టు పెడుతోంది. ఈ క్రమంలోనే గౌలిగూడ పాత బస్టాండు స్థలం ఆర్టీసీకి కీలక మేలు చేసి పెట్టింది. -
హైదరాబాద్: అప్జల్‌గంజ్ పరిదిలోని గౌలిగూడలో కెమికల్ పేలుడు
-
హైదరాబాద్: గౌలిగూడలో కెమికల్ పేలుడు, ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటర్‌తో కెమికల్ రియాక్ట్ అవ్వడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్గా (తండ్రి)గా గుర్తించారు. -
కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రాత్మక గౌలిగూడ బస్టాండ్(సీబీఎస్) గురువారం నిలువునా కుప్పకూలింది. ఈ సమయంలో బస్టాండ్‌లో బస్సులు, ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోనే మొట్టమొదటి బస్సు డిపో గౌలిగూడ. బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఇంజినీర్ల సూచన మేరకు జూన్ 30 నుంచి బస్ స్టేషన్‌ను మూసివేశారు. నాటి నుంచి బస్సులను, ప్రయాణికులను బస్ స్టేషన్లోకి అనుమతించడం లేదు. బస్సులు, ప్రయాణికులు లేని సమయంలో బస్ స్టేషన్ కుప్పకూలడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 88 ఏళ్ల క్రితం ఈ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. మూసీ నదీ తీరాన అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించి ఈ షెడ్డును నిజాం బస్టాండ్‌గా మార్చారు. 1932 జూన్‌లో గౌలిగూడ బస్టాండ్ ప్రారంభమైంది. 30 ప్లాట్ ఫారాలతో 27 బస్సులతో గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల రాకపోకలు కొనసాగాయి. 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులతో సేవలు ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత కేవలం లోకల్ బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. సందర్శించిన మంత్రి మహేందర్ రెడ్డి కుప్పకూలిన సిటీ బస్టాండ్‌ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సందర్శించారు. బస్టాండ్ కూలడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కట్టడం కూలినా ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదం జరలేదని చెప్పారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన విమాన స్థావరం కోసం దీన్ని ఏర్పాటు చేయించారని వెల్లడించారు. 1930లో అమెరికాకు చెందిన బట్లర్ కంపెనీ దీన్ని తయారు చేసిందని తెలిపారు. దీనికి మిసిసిపి ఏయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్‌గా నామకరణం చేశారని చెప్పారు. కొద్దికాలం తర్వాత నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ కింద తొలి డిపోగా ఏర్పాటు చేయించారని వివరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాల్లో గౌలిగూడ బస్టాండ్ కూడా ఒకటని అన్నారు. కూలిన కట్టడం స్థానంలో ఆర్టీసీ అదనపు ఆదాయం సాధించడం కోసం వినియోగిస్తామని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
గౌలిగూడ బస్టాండ్‌లో కుప్పకూలిన షెడ్