breaking news
golden Lizard
-
తిరుమలలో అరుదైన బంగారు బల్లి ప్రత్యేక్షం..
-
బంగారు బల్లి.. మళ్లీ దర్శనమిచ్చింది
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో మాత్రమే కలుగుతుంది. అంతరించే జాతుల్లో చేరిన ఈ బంగారు బల్లి కొన్నేళ్లుగా కనిపించడం లేదు. అయితే శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వెనుకనున్న శిలాతోరణంపై దర్శనమిచ్చింది. కాగా, మునుపు ఒకసారి మహాశివరాత్రి నాడే (2016లో) ఈ బంగారు బల్లి తిరుమల చక్రతీర్థం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభ సమయంలో భక్తుల కంటపడటం విశేషం. (రాయంచపై సోమస్కంధుడి రాజసం ) -
ఏడుకొండల్లో బంగారు బల్లి!
సాక్షి, తిరుమల : ఇప్పటివరకూ తిరుమల కొండల్లో అందరూ అంతరించిపోయినట్లుగా భావిస్తున్న బంగారు బల్లి జాడ ఎట్టకేలకు వెలుగుచూసింది. శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో.. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మోకాళ్ల పర్వతం వద్ద 3150 మెట్టు కొండల్లో ఆదివారం రాత్రి కనిపించి భక్తులు, పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. గత కొన్నేళ్లుగా ఇవి కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిపై సమగ్ర సర్వేకు పూనుకుంది. -
చక్రతీర్థంలో బంగారు బల్లి
సాక్షి, తిరుమల: బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో మాత్రమే కలుగుతుంది. అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బల్లి అంతరించే జాతుల్లో చేరింది. ఇలాంటివి కొన్నేళ్లుగా కనిపించడం లేదు. అయితే సోమవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి ఆదివారం శేషాచలం ఏడుకొండల్లో దర్శనమిచ్చింది. తిరుమల చక్రతీర్థం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభ సమయంలో బంగారు బల్లి కనిపించింది. భారీ కొండల మధ్య వచ్చిన చీలికల నుంచి ఏటవాలుగా ధగధగ మెరిసే బంగారు వర్ణంతో భక్తులకు దర్శనమిచ్చింది. రాతి గుహలే ఆవాసం బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది. ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి. శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు.