breaking news
form-16
-
ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా?
ఒక అసెస్సీకి ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు ఉండవచ్చు. ఎవరి దాకానో ఎందుకు మన రాంబాబు గారి సంగతే తీసుకోండి. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆఫీసు నిబంధనల ప్రకారం వారు నిర్దేశించిన బ్యాంకులో అకౌంటు తెరిచారు. ఇందులో కేవలం జీతం మాత్రమే క్రెడిట్ అవుతుంది. పెళ్లయ్యాక, మావగారి ప్రోద్బలంతో, కట్టుకున్న భార్యతో మరో అకౌంటు.. ఇది జాయింట్ అకౌంటు. మామగారు, బావమరుదులు ఇచ్చిన మొత్తాలను ఇందులో డిపాజిట్ చేస్తున్నారు. ఇంటి లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే, వాళ్లు లోన్ ఇచ్చారు కానీ, మరో అకౌంటును ఆ బ్యాంకులో తెరవమన్నారు.ఆ తర్వాత ఎదిగిన పిల్లలు, వారి చదువులు, విద్యా రుణం నిమిత్తం బ్యాంకులో అకౌంటు, పిల్లల అవసరాలరీత్యా పంపే నెలసరి మొత్తానికి అబ్బాయికి అనువైన బ్యాంకు అకౌంటు, విదేశీ చదువుల కోసం అప్పు.. ఫలితంగా ఒక బ్యాంకు అకౌంటులు, షేర్లలో పెట్టుబడుల కోసం మొదటి నుంచి ప్రత్యేకంగా షేర్ల క్రయవిక్రయాల కోసం ఒక అకౌంటు.. ఇంట్లో అద్దెకు ఉన్నాయన బ్యాంకరు కావడంతో మొహమాటానికి ఆ బ్యాంకులో ఓ అకౌంటు.. ఈలోపల రిటైర్మెంటుతో ఇంటి పక్కనే ఉన్న బ్యాంకులో అకౌంటు.. ఇలా ఒక రాంబాబుకే పది బ్యాంకు అకౌంట్లు ఏర్పడ్డాయి. అన్నట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఓపెన్ చేసిన అకౌంటు.. ఈ జాబితాలో కలపలేదండోయ్.ఇలా ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు.. ప్రతి అకౌంటులో ఎంతో కొంత మొత్తం ఉండటం, దాని మీద వడ్డీ ఆయా బ్యాంకుల్లోనే జమ కావడం.. అయితే ఒకటి రెండు అకౌంట్లు మినహా మిగతా అన్నింటిలోనూ చిన్న చిన్న మొత్తాలే.రెండు, మూడు ఖాతాలకే పరిమితం..అవగాహన లోపమే అనుకోండి.. ఆచరణాత్మక విషయమే అనుకోండి. అశ్రద్ధ..బద్ధకం.. అవసరం లేకపోవడం.. ఇలా ఏదైనా అనుకోండి.. కానీ రెండు మూడు అకౌంట్లలో వ్యవహారాలకు మాత్రమే రాంబాబు పరిమితమైపోయాడు. మిగతా అకౌంట్లను పట్టించుకోలేదు. ఫారం 15 కొన్నింటికి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్లు .. ఇచ్చిన వాళ్లు టీడీఎస్ చేశారు. కొందరితో ఎటువంటి టచ్ లేకపోవడం వల్ల ఏం జరిగిందో తెలియదు.‘‘టీడీఎస్ ఉంటేనే ఆదాయం చెప్పు .. లేదంటే గప్‌చుప్,’’ అని ‘‘ఫారం 16ఏ ఇచ్చిన వాడే కరెక్టు వాడు,’’ అని ఇలాంటి ఎన్నెన్నో పిచ్చి సలహాలు వచ్చాయి రాంబాబుకి. అవి తప్పు. గుర్తు పెట్టుకోండి. టీడీఎస్ చేయడం, రికవర్ చేసిన మొత్తాన్ని గవర్నమెంటు ఖజానాలో జమ చేయడం ఇవన్నీ బ్యాంకు వారి డ్యూటీలు. చేయకపోతే వాటి మీద పెనాల్టీ విధిస్తారు. కానీ వడ్డీ మనదే. అది ట్యాక్సబుల్. టీడీఎస్ ఉన్నా లేకపోయినా వడ్డీని ఆదాయంగా గుర్తించాలి. మీ మొత్తం ఆదాయం ట్యాక్సబుల్ ఇన్‌కం దాటితే మీరు పన్ను చెల్లించాలి. పన్ను చెల్లించేటప్పుడు టీడీఎస్ వరకు సర్దుబాటు చేస్తారు.ఫారం 15 జీ/హెచ్ ఇవ్వడం, సీనియర్ సిటిజన్లకు కొంత వడ్డీ ఆదాయం దాటితేనే టీడీఎస్ అమలుపరచడం, ఇవన్నీ టీడీఎస్‌కి సంబంధించిన అంశాలు. మీ ఆదాయం ‘మినహాయింపు కాదు’. ప్రతి వడ్డీని, అది ఎంత చిన్న మొత్తమైనా, ఆదాయంలో లెక్క వేసుకోవాల్సిందే. అలా అన్నీ కలిపినా ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధికి లోపే ఉంటే, పన్ను కట్టక్కర్లేదు.ఫారం 16ఎ మీద ఆధారపడొద్దు..ఫారం 16ని యజమాని ఇస్తాడు. మిగతా అందరూ 16ఎ ఇస్తారు. 16లో జీతం ఒకటే ఉంటుంది. 16ఎలో ఇతర ఆదాయాలూ వస్తాయి. అయితే, అన్ని వడ్డీలు రాకపోవచ్చు కాబట్టి 16, 16ఎ మీద ఆధారపడొద్దు.డిడక్షన్లు – డిస్క్లోజర్లు.. 80 టీటీఏ, 80– టీటీబీ ప్రకారం వచ్చిన డిడక్షన్ క్లెయిమ్ చెయ్యాలంటే, ముందుగా వాటి గురించి డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకుండా డిడక్షన్ చెయ్యకూడదు. డిడక్షన్లు వస్తాయని డిస్క్లోజ్ మానకూడదు. అది లాజిక్. ఈ లాజిక్ మిస్సయి చాలా మంది వితండ వాదాలు చేస్తారు.మీరేం తెలుసుకోవాలి..‘నో టీడీఎస్’ అంటే ‘నో ట్యాక్స్’ కాదు ఫారం 16/16 ఎ అనేది ఫూల్ ప్రూఫ్ కాదు. డిస్క్లోజ్ చేసిన తర్వాత డిడక్షన్ చేయాలి ఫారం ఏఐఎస్, 26ఏఎస్‌లలో పడకపోయినా అన్ని ఎంట్రీలు తీసుకోండి.మీరేం చేయాలి.. ఎస్బీ, ఎఫ్డీ, ఆర్డీ, అన్ని రకాల బ్యాంకు అకౌంట్లు, జాయింట్ అకౌంట్లు, ఖాతాలు మూసినవి, ఇలా అన్నింటి పద్దులు వేసుకోండి. అన్నీ అప్డేట్ చేయండి. జ్ఞాపకం తెచ్చుకోండి. మీ రికార్డులు అప్డేట్ చేసుకున్న తర్వాత ఫారం 26ఏఎస్, ఏఐఎస్‌లో తప్పులుంటే సర్దుబాటు చేయొచ్చు. స్థూలంగా చెప్పాలంటే, అన్ని బ్యాంకు అకౌంట్లలోనూ వచ్చిన/ఉన్న వడ్డీలు ఆదాయమే! - డా. కందాళ సత్యనారాయణ మూర్తి, ట్యాక్సేషన్ నిపుణులు- కె.వి.ఎన్. లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్‌తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు. -
ఓటరు నమోదుకు నేడు ఆఖరిరోజు...
సాక్షి, గుంటూరు: ఓటరుగా నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం సాయంత్రం వరకూ కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గడువు పొడిగించిన తరువాత ఎక్కువ మంది స్పందించి దరఖాస్తులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కేంద్రాల్లో శనివారం సాయంత్రం వరకు 2.17 లక్షల దరఖాస్తుల అందాయి. ఆదివారం కూడా పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఫారం-6ను స్వీకరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్తగా ఓటు కోసం ఫారం-6ను పూర్తి చేసి అందజేశారు. గుంటూరు నగర కార్పొరేషన్లో ఈ నెల 17వ తేదీ నాటికి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన 42 వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేయగా, గడువు పొడిగించాక ఆదివారం సాయంత్రానికి మరో మూడు వేల దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించి ఎంక్వైరీకి పంపే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.ఆన్లైన్లోనే ఎక్కువ.. ఈ సారి ఎక్కువ మంది యువకులు ఈ సారి ఆన్లైన్లోనే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరంలోని సుమారు 20 వేల మందికి పైగా యువత బీఎల్వో దగ్గరకు వెళ్లే పనిలేకుండా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ అధికారులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలోని పలు శివారు కాలనీల్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని నివశించే ప్రజలు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకుంటే, వాటన్నింటి పైనా బీఎల్వోలు అభ్యంతరాలు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని హుసేన్నగర్లోని 70 మంది దరఖాస్తులు ఈ విధంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయి. సరైన నివాస ధ్రువపత్రాలు జత చేయలేదంటూ సిబ్బంది ఫారం-6 దరఖాస్తుల్ని స్వీకరించడం లేద ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళ్‌దాస్‌నగర్, కొండా వెంకటప్పయ్యకాలనీ, నందమూరినగర్, తుపాన్‌నగర్, ఎన్జీవో కాలనీ, రామిరెడ్డినగర్ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు.


