breaking news
food oil sales
-
భారీగా తగ్గిన ఫుడ్ డెలివరీలు
సాక్షి,హైదరాబాద్: పెట్రో కటకట గిగ్వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వివిధ ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్, ఆన్లైన్ సర్వీసు సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భోజన ప్రియులు, వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులను నిర్ణీత సమయంలో డెలివరీ చేసే పరిస్థితి కనిపించలేదు. పెట్రోలు బంకులు చాలావరకు మూతపడగా.. ఉన్నవాటిలో వాహనదారులు బారులు తీరడంతో క్యాబ్ సరీ్వసులను కూడా ప్రభావితం చేసింది. అధికశాతం క్యాబ్‌లు సేవలను నిలిపివేయగా.. నడిచిన కొన్ని కూడా రద్దు కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు క్యాబ్‌లు, గిగ్‌వర్కర్ల సేవలు నిలిచిపోవడం..వారి వాహనాలు దాదాపుగా నిలిచిపోవడంతో నగర రోడ్లపై కొంత ట్రాఫిక్ తగ్గినట్టు కనిపించింది. -
ఆరోగ్యాన్నలా.. డీప్ ఫ్రై చేయొద్దు!
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు, గారెలు, పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు, వడియాలు.. మనం ఇష్టంగా తినే ఇటువంటివి వండేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఆహారమే విషతుల్యంగా మారి అనారోగ్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక జబ్బులకూ కారణం కావొచ్చు. వేపుళ్లకు లేదా డీప్ ఫ్రైలకు నూనెలు, కొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వేపుళ్లకు ఏయే నూనెలు విడిగా వాడొచ్చు? ఏయే నూనెలను కలిపి వాడొచ్చు? అనే విషయాలూ ముఖ్యమే.. అవేమిటో చూద్దాం.. గుండె జబ్బులు, కేన్సర్ ముప్పు?నూనెలు, కొవ్వుల్లో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (పీయూఎఫ్ఏ– ‘పూఫా’లు) ఉంటాయి. ఒకసారి వేపుడుకు వాడితే ప్రమాదం లేదు. ఒక్కసారి వేపుడు లేదా డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మళ్లీ వేపుళ్ల కోసం వాడితే అవి హానికరంగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కొవ్వుల్లోని ‘పూఫా’లు వేపుడు కోసం రెండు అంతకన్నా ఎక్కువసార్లు అధికంగా వేడి చేసినప్పుడు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెందిన పూఫాలతో కూడిన ఆహారం తీసుకున్న వారు గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ మాజీ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు.వేపుళ్లకు ఏయే నూనెలు మేలు?కరకరలాడే వంటకాల తయారీ కోసం వంట నూనెలను ఎక్కువ మంటపై పొగలు కక్కేలా వేడి చేయాల్సి ఉంటుంది. స్మోక్ పాయింట్‌ను మాత్రమే చూడకుండా రసాయన స్థిరత్వాన్ని బట్టి వేపుళ్లకు నూనెను ఎంచుకోవాలి. ఇందుకు ఉపయోగపడే నూనెలు ఏవంటే.. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి లేదా వేరుశనగ నూనె, శుద్ధి చేసిన వరి తవుడు నూనె, అధిక ఓలిక్ పొద్దుతిరుగుడు (మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లం కలిగిన) నూనెలు ఆహారాన్ని వేయించడానికి మంచివని డాక్టర్ ప్రసాద్ వివరించారు.కలిపి వాడుకోదగినవిఇంట్లో రోజువారీ కూరల్లో లేదా డీప్ ఫ్రైలకు కూడా కనీసం రెండు రకాల వంట నూనెలు కలిపి వాడుకుంటే మేలని, నిలువ పచ్చళ్లకు నువ్వుల నూనె మంచిదని డా. ప్రసాద్ చెప్పారు. వాటిలో ఉండే పోషకాలను బట్టి కలిపి వాడుకోదగిన నూనెలు ఇవీ.. పామాయిల్ + సోయా నూనెపామాయిల్ + పొద్దుతిరుగుడు నూనె వరి తవుడు నూనె + నువ్వుల నూనెఆలివ్ నూనె + పొద్దుతిరుగుడు లేదా సోయా ఆయిల్మళ్లీ ఫ్రైలకు వాడొద్దు..మన ఇంట్లో వేపుళ్లకు ఒకసారి వాడిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ఆ నూనెను వడగట్టి కూరల తాలింపుల్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 3–4 రోజుల్లోనే (వేపుళ్లకు కాకుండా) కూరల్లో వాడుకోవాలి. నిల్వ ఉంచితే ఆ నూనె చెడిపోయే అవకాశం ఉంది. అయితే, డీప్ ఫ్రైలకు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేపుళ్లకు వాడితే ప్రమాదం. అవి తిన్న వారు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బుల పాలయ్యే ముప్పు ఉంది. –డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్, మాజీ చీఫ్ సైంటిస్ట్ -
వంట నూనె విక్రయాలపై కేసులు
అనంతపురం అర్బన్ : నాణ్యత లేని వంట నూనె విక్రయాలపై కేసులు నమోదు చేసినట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ సమావేశంలో మాట్లాడుతూ ఆహార పరిరక్షణ అధికారులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 14 ఆహార నమూనాలను పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారన్నారు. గతంలో వచ్చిన నివేదికల మేరకు శబరి పామెలిన్ (అనంతపురం), జీఎన్ఎస్ గోల్డ్ పామోలిన్ (అనంతపురం) నమూనాలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షలు విధించామన్నారు. మరో మూడు నమూనాలు సురక్షితం కాదని తేలడంతో కదిరి, హిందూపురం కోర్టుల్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ ముగిసన తర్వాత జరిమానా, శిక్ష ఉంటుందన్నారు. ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించి 68 తనిఖీలు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 18 దుకాణాలపై కేసులు నమోదు చేశారని, 12 దుకాణాల లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేశారని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి 55 కేసులు నమోదు చేశారని, రూ.7.75 లక్షలు అపరాధ రుసుం విధించారని చెప్పారు.


