భారీగా తగ్గిన ఫుడ్‌ డెలివరీలు | food deliveries drop sharply | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన ఫుడ్‌ డెలివరీలు

Mar 26 2026 7:29 AM | Updated on Mar 26 2026 11:19 AM

food deliveries drop sharply

సాక్షి,హైదరాబాద్‌: పెట్రో కటకట గిగ్‌వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వివిధ ఫుడ్‌ డెలివరీ, ఈ కామర్స్, ఆన్‌లైన్‌ సర్వీసు సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భోజన ప్రియులు, వినియోగదారులు ఆర్డర్‌ చేసిన వస్తువులను నిర్ణీత సమయంలో డెలివరీ చేసే పరిస్థితి కనిపించలేదు. పెట్రోలు బంకులు చాలావరకు మూతపడగా.. ఉన్నవాటిలో వాహనదారులు బారులు తీరడంతో క్యాబ్‌ సరీ్వసులను కూడా ప్రభావితం చేసింది.  అధికశాతం క్యాబ్‌లు సేవలను నిలిపివేయగా.. నడిచిన కొన్ని కూడా రద్దు కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు క్యాబ్‌లు, గిగ్‌వర్కర్ల సేవలు నిలిచిపోవడం..వారి వాహనాలు దాదాపుగా నిలిచిపోవడంతో నగర రోడ్లపై కొంత ట్రాఫిక్‌ తగ్గినట్టు కనిపించింది.  

Advertisement
 
Advertisement
Advertisement