breaking news
Faisal Khan
-
ఖాన్ సర్‌పై కేసు.. పోలీసుల గాలింపు
బిహార్ రాజధాని పట్నాలో కోచింగ్ సెంటర్ల ఆధిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఖాన్ సర్, రోషన్ ఆనంద్ మధ్య జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ కోచింగ్ సెంటర్‌పై రోషన్ ఆనంద్ దాడి చేయించాడని ఖాన్ సర్ ఆరోపించగా, ఇదంతా ఖాన్ సర్ ఆడిస్తున్న నాటకమని రోషన్ ఆనంద్ ప్రత్యారోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఖాన్ సర్ వెంట పడ్డారు.పట్నా: ఖాన్ సర్గా ప్రసిద్ధి చెందిన ఫైసల్ ఖాన్ ఆచూకీ కోసం బిహార్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఫైసల్ ఖాన్‌పై హత్యాయత్నం, ఆయుధాల చట్టం (ఆర్మ్స్ యాక్ట్) కింద నమోదైన కేసు నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఖాన్ సర్ శుక్రవారం పట్నాలోని కోర్టులో లొంగిపోయే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆయన కోర్టులో హాజరవుతారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.ఖాన్ సర్‌ను అప్రతిష్టపాలు చేయడానికే కేసులో ఇరికించారని ఆయన తరపు న్యాయవాది అరవింద్ కుమార్ మవ్వార్ ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. జూన్ 2న పట్నాలోని ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన విధ్వంస ఘటన నేపథ్యంలో ఫైసల్ ఖాన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 15 నుంచి 20 మంది వ్యక్తులు కోచింగ్ సెంటర్‌పై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లు రువ్వారు.అల్లర్ల సమయంలో ఖాన్ సర్ విద్యాసంస్థకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పట్నాలోని కదమ్కువాన్ పోలీస్ స్టేషన్లో ఖాన్ సర్‌తో సహా ముగ్గురు వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్ 109, ఆయుధ చట్టంలోని సెక్షన్లు 25(9), 27, 35 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు గార్డులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఖాన్ సర్‌ను కూడా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ఆరోపణలుఇదిలా ఉండగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ప్రతినిధులు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. విధ్వంస ఘటనను ఖాన్ సర్ స్వయంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు వెల్లడించారు. కాగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థకు చెందిన వ్యక్తులే తమ కోచింగ్ సెంటర్‌పై దాడులకు పాల్పడ్డారని మొదట ఖాన్ సర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఖాన్ సర్.. గొడవలొద్దు -
ఖాన్ సర్.. గొడవలొద్దు
పట్నా: ఉపాధ్యాయులు విద్వేషాలకు దూరంగా ఉండాలని జన అధికార్ పార్టీ అధినేత, పూర్నియ పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్ వేడుకున్నారు. బిహార్‌లోని పట్నాలో కాదంఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాన్ గ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై దాడి నేపథ్యంలో ఆయన స్పందించారు. పెద్ద మనసు చేసుకుని ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఖాన్ సర్‌ను (Khan Sir) కోరారు. ఎవరి విషయంలోనైనా తన వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కాళ్లు పట్టుకుని తాను క్షమాపణ చెబుతానని అన్నారు. ఖాన్ సర్, రోషన్ సర్ ఇద్దరూ తనకు సోదర సమానులేనని.. వీరిద్దరికీ తన హృదయంలో స్థానముందని పేర్కొన్నారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, వివాదానికి ముగింపు పలకాలని పప్పు యాదవ్ విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంలో ఉన్నవారు ద్వేషాన్ని కాకుండా సంభాషణను, సామరస్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇద్దరు విద్యావేత్తల మద్దతుదారుల మధ్య కొనసాగుతున్న వాగ్వివాదం, ఆరోపణలు బిహార్ విద్యా సంస్కృతికి మంచి సంకేతం కాదని అభిప్రాయపడ్డారు. ఇదంతా వద్దు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయవద్దు, విద్వేషాలు రెచ్చగొట్టవద్దు.. ఒక వ్యక్తి తప్పు చేయవచ్చు కానీ మొత్తం సమాజాన్ని, భావజాలాన్ని నిందించడం సరికాదని ఎంపీ పప్పు యాదవ్ ఉద్వేగభరితంగా చెప్పారు.బిహార్ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్య అనేది సమాజాన్ని ఏకం చేసే సాధనమని.. ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులు సమాజంలో విభజన లేదా విద్వేషాన్ని సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బిహార్ బలం ప్రతిభ, విద్య, సామాజిక ఐక్యతలో ఉందని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలని ఆయన అన్నారు.బాధ్యులపై చర్యలు తీసుకోండిగ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు పప్పు యాదవ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన విద్యార్థిని మృతి కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కోచింగ్ సెంటర్‌పై దాడిని పెద్దదిగా చూపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి కేసులో దోషులు తప్పించుకోకుండా చూడాలని, చట్టప్రకారం శిక్ష పడాల్సిందే అన్నారు. విద్యార్థిని మృతి కేసుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.చదవండి: అది సరిపోదు.. మంత్రి రాజీనామా చేయాల్సిందేకోచింగ్ సెంటర్‌పై దాడి అందుకేగ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై మరో కోచింగ్ సెంటర్‌పై మంగళవారం రాత్రి 10.10 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. కోచింగ్ సెంటర్ వద్ద కాపలాగా ఉన్న గార్డ్‌ను చితకొట్టి భవనం మీదకు పలువురు రాళ్ల వర్షం కురిపించారు. డైరెక్టర్ సహా పలువురు దాడికి దిగి విధ్వసం సృష్టించారు. కాల్పులు సైతం జరిపారని ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, విద్యావేత్త ఫైసల్ ఖాన్ ఆరోపించారు. తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తున్నామనే అక్కసుతో వేరే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు దాడిచేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటలో వేరే కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రోషన్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. దాదాపు 20 మంది ఈ దాడి ఘటనలో పాల్గొన్నారని, ఆర్థిక కోణంలోనూ దర్యాప్తు ఆరంభించామని పట్టణ డీఎస్పీ రాజేశ్ రంజన్ తెలిపారు. -
గృహ నిర్బంధం చేసి.. అమీర్ ఖాన్ డగ్స్ ఇస్తున్నారా?
మానసిక వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడిని గృహ నిర్బంధంలో ఉంచి బలవంతంగా మాత్రలు మింగిస్తున్నారని వచ్చిన ఆరోపణలను మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఖండించారు. తన తమ్ముడు ఫైజల్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది. తన చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేయడంలో ఫైజల్ సహకరిస్తున్నారు అని అమీర్ తెలిపారు. తన తమ్ముడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు రూమర్లు మాత్రమే అని అన్నారు. ధూమ్-3 చిత్ర స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఫైజల్ దే కీలక పాత్ర అని అన్నారు. ఫైజల్ సూచన మేరకే తాను ధూమ్-3 చిత్రాన్ని అంగీకరించాను అని అమీర్ తెలిపారు. రానున్న రోజుల్లో సినిమాల్లో నటించే విషయంపై ఫైజల్ ను అడిగి తెలుసుకోవాల్సిందే అని అన్నారు. ధూమ్-3 చిత్ర విజయంతో తనలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అని అమీర్ తెలిపారు.


