breaking news
emirate flight
-
యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్ దాడి
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న దాడులు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఇరాక్ పరిధిలోని కుర్దిస్థాన్ రీజియన్‌లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూఏఈకి ఆస్ట్రేలియా అండగా నిలిచింది. అత్యాధునిక గగనతల క్షిపణులను సరఫరా చేయడంతో పాటు నిఘా విమానాలను రంగంలోకి దించుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న యూఏఈ కాన్సులేట్ జనరల్ భవనంపై మంగళవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ దాడిని యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తూ, సాగుతున్న ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులెవరో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు యూఏఈకి ఆస్ట్రేలియా సైనిక సాయాన్ని ప్రకటించింది. అత్యాధునిక ‘అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్’ క్షిపణులను యూఏఈకి పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి గగనతలం సురక్షితంగా ఉండటం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు యూఏఈ సుమారు 1,500కు పైగా క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని, పౌర భద్రత దృష్ట్యా ఈ సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.మరోవైపు ఇరాన్ తన దాడులను ఇంధన కేంద్రాల వైపు మళ్లించింది. బహ్రెయిన్‌లోని అల్ మామీర్ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడితో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వ ఇంధన సంస్థ ‘బాప్కో’ ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో భారత్ నుంచి వెళ్లే బియ్యం, ఇండోనేషియా కాఫీ రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ ఇరాన్‌తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాయి. యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు.. తామే నిర్ణయిస్తామని సవాల్ విసిరాయి. కాగా నిత్యావసరాల ధరలు పెరగకుండా దుబాయ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వచ్చే కొన్ని నెలల వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొంది. -
తమిళనాడు: ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఫ్లైట్ వింగ్స్ భాగం నుంచి పొగ రావడం కనిపించింది. దీంతో, అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.ఈ క్రమంలో అలర్ట్ అయిన విమాన సిబ్బంది, టెక్నికల్ టీమ్ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, పొగ రావడానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించలేదు. దీంతో, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్ అయినట్టు సమాచారం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణీకులు ఉన్నారు.ఇది కూడా చదవండి: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం -
ప్రాణం నిలిచి.. ఆరు కోట్ల బంపర్ లాటరీ
కేరళ: ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడమే అరుదు.. అలాంటిది రెండు పెద్ద అదృష్టాలు వారం రోజులలోపే వస్తే.. ఒక అదృష్టం ప్రాణాన్ని ఇచ్చి మరొకటి ఏకంగా బంపర్ లాటరీని అందిస్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి ఏకంగా ఆరు కోట్లకు(రూ.6,66,70,000)పైగా కళ్లు చెదిరే లాటరీ తగిలింది. ఈ నెల(ఆగస్టు) 3న కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ కు బయల్దేరిన ఎమిరేట్స్‌కు చెందిన విమానం (బోయింగ్ 777-300) రన్ వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో క్రాష్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 300 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. ఇలా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో బషీర్ కూడా ఉన్నాడు. గత 30ఏళ్లకు పైగా దుబాయ్ లో పనిచేస్తున్న అతడు ఓ దుబాయ్ లాటరీ టికెట్ కొన్నాడు. దానికి సంబంధించిన డ్రాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తీయగా దాదాపు ఒక మిలియన్ డాలర్ల బంపర్ లాటరీ తగిలింది. దీనిపై బషీర్ పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. విధుల నుంచి విశ్రాంతి తీసుకునే సమయంలో తనకు అదృష్టం లాటరీ రూపంలో తగలడం చెప్పలేని ఆనందంగా ఉందని వర్ణించాడు.


