ప్రాణం నిలిచి.. ఆరు కోట్ల బంపర్ లాటరీ | Indian survives Dubai plane crash, wins $1 million lottery 6 days later | Sakshi
Sakshi News home page

ప్రాణం నిలిచి.. ఆరు కోట్ల బంపర్ లాటరీ

Aug 10 2016 8:33 PM | Updated on Sep 4 2017 8:43 AM

ప్రాణం నిలిచి.. ఆరు కోట్ల బంపర్ లాటరీ

ప్రాణం నిలిచి.. ఆరు కోట్ల బంపర్ లాటరీ

ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడమే అరుదు.. అలాంటిది రెండు పెద్ద అదృష్టాలు వారం రోజులలోపే వస్తే..

కేరళ: ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడమే అరుదు.. అలాంటిది రెండు పెద్ద అదృష్టాలు వారం రోజులలోపే వస్తే.. ఒక అదృష్టం ప్రాణాన్ని ఇచ్చి మరొకటి ఏకంగా బంపర్ లాటరీని అందిస్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి ఏకంగా ఆరు కోట్లకు(రూ.6,66,70,000)పైగా కళ్లు చెదిరే లాటరీ తగిలింది. ఈ నెల(ఆగస్టు) 3న కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ కు బయల్దేరిన ఎమిరేట్స్‌కు చెందిన విమానం (బోయింగ్ 777-300) రన్ వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో క్రాష్ అయిన విషయం తెలిసిందే.

దాదాపు 300 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. ఇలా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో బషీర్ కూడా ఉన్నాడు. గత 30ఏళ్లకు పైగా దుబాయ్ లో పనిచేస్తున్న అతడు ఓ దుబాయ్ లాటరీ టికెట్ కొన్నాడు. దానికి సంబంధించిన డ్రాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తీయగా దాదాపు ఒక మిలియన్ డాలర్ల బంపర్ లాటరీ తగిలింది. దీనిపై బషీర్ పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. విధుల నుంచి విశ్రాంతి తీసుకునే సమయంలో తనకు అదృష్టం లాటరీ రూపంలో తగలడం చెప్పలేని ఆనందంగా ఉందని వర్ణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement