breaking news
early hours
-
మద్యం ఏరులై.. సూర్యుడు ఉదయయించక మునుపే..
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. నెల్లూరు నగరంలో వేకువజాము నుండే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. సూర్యుడు ఉదయయించక మునుపే బార్ తెరుచుకుంది. ఉదయాన్నే హరినాధపురం సమీపంలోని పికాక్ బార్ అండ్ రెస్టారెంట్లో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. షెటర్ పూర్తీగా తెరిచి మరీ విక్రయాలు జరుపుతున్నారు. సిట్టింగ్‌కు సైతం అనుమతి ఇచ్చేశారు. బార్ ముందు మద్యం మత్తులో ఓ వ్యక్తి తూలుతూ హల్చల్ చేశాడు. ఎక్సైజ్, పోలీస్ శాఖ అటువైపు కన్నెత్తి అయినా చూడటం లేదు.కాగా, రాష్ట్రంలో ఊరూరా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏనీటైమ్ మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు స్థానిక కూటమి నేతలతో కలిసి బడ్డీ దుకాణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. -
పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మన పిల్లలు ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళ్తుంటే అప్పుడు మనం 9 గంటలకే కోర్టుకు రాలేమా?’’అని సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పేర్కొన్నారు. శుక్రవారం జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రొసీడింగ్స్ 9.30 గంటలకే ప్రారంభం కావడాన్ని సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి ప్రశంసించగా జస్టిస్ లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్‌కి వెళ్లగలిగినప్పుడు, 9 గంటలకు మనం ఎందుకు రాలేమని నేనెప్పుడూ అంటుంటాను. కోర్టుల్లో కార్యకలాపాలు ఉదయం 9.30 గంటలకు మొదలైతే మరీ మంచిది‘ అని ఆయన అన్నారు. ‘కోర్టులు ముందుగా మొదలైతే, విధులను కూడా తొందరగానే ముగించొచ్చు. తర్వాతి రోజు కేసుల అధ్యయనానికి సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది’ అన్నారు. ఆగస్ట్ చివరికి ఈ ఏర్పాట్లు మొదలవుతాయని భావిస్తున్నానని రొహత్గి పేర్కొనగా, ఇవి కొన్ని మాత్రమేనని జస్టిస్ లలిత్ చెప్పారు. సుప్రీంకోర్టుల్లో విచారణలు సాధారణంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంటాయి. ఆగస్ట్ 26వ తేదీన రిటైర్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. -
భార్యను చంపిన కసాయి భర్త
బ్రహ్మసముద్రం(అనంతపురం): బ్రహ్మసముద్రం మండలం పిల్లెలపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి భార్యను హతమార్చాడు. వేకువజామున కోప్రోదిక్తుడైన రాజన్న భార్య మంజమ్మ(19)ను గొంతునులిమి చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇరువురికి వివాహం జరిగి ఒక సంవత్సరం కావొస్తుండగా మనస్పర్ధలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


