breaking news
Dharmedra Pradhan
-
మారిన సీన్.. ధర్మేంద్ర ప్రధాన్‌కు బిగ్ చాన్స్?
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు.. మరో చాన్స్ దక్కనుందా?. స్వరాష్ట్రంలో లభించిన ఘన స్వాగతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు బిగ్చాన్స్ దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బలానికి 2024 సంబల్పూర్ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఒడిశాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 1,19,836 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితేశ్ గంగా దేవ్ కేవలం 9,162 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారు. ఐదేళ్ల వ్యవధిలో సంబల్పూర్లో బీజేపీ బలం ఎంతగా పెరిగిందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సంస్థాగత కృషి కీలకమని పార్టీ వర్గాలు భావిస్తాయి. చాలా కాలం ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు.మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఒడిశాకు తిరిగి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ పరిణామమే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. ఇది కేవలం ఓ నేతకు ఇచ్చిన స్వాగతమేనా? లేదంటే భవిష్యత్‌లో కీలక బాధ్యతలకు సంకేతమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయనకు జాతీయ రాజకీయాల్లో మరో అవకాశం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.రాజీనామా.. అవకాశంగా మారిందా?NEET వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయనకు మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని.. అటు ఆందోళనకారులు, ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఆయనకు మరో అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. సాధారణంగా ఒక మంత్రి పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ప్రతికూల పరిణామంగానే భావిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.రాజీనామా తర్వాత ఆయనకు లభించిన స్వాగతం, పార్టీ నేతల బహిరంగ మద్దతు.. ఆయన రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గలేదనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రజల్లో “ఒడిశాకు చెందిన కీలక నేత కేంద్రంలో బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు” అనే భావన కూడా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అయితే మరోవైపు.. NEET వివాదం ప్రభావం పూర్తిగా తగ్గిందా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనపై ఉన్న అభిప్రాయం ఎలా ఉందన్నది భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది.ఒడిశాలో అసలు బలం ఎంత?జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒడిశా రాజకీయాలపై పట్టు లేదనే వాదనకు ఆయన రాజకీయ ప్రయాణమే సమాధానంగా నిలుస్తుంది. విద్యార్థి దశలో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఒడిశాలో బీజేపీ ఒక చిన్న శక్తిగా ఉన్న సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతాయి.ప్రత్యేకంగా పశ్చిమ ఒడిశాలో పార్టీ విస్తరణ, కార్యకర్తల నెట్వర్క్ పెంచడం, ఎన్నికల వ్యూహాల్లో ఆయన పాత్ర ఉందనే గుర్తింపు ఉంది. 2024లో సంబల్పూర్లో వచ్చిన భారీ విజయం కూడా ఆయనకు ఉన్న క్షేత్రస్థాయి అనుబంధానికి నిదర్శనంగా బీజేపీ నేతలు చెబుతున్నారు.అయితే ఆయన బలం ఎక్కువగా సంస్థాగత రాజకీయాలు, వ్యూహ రచన, పార్టీ నాయకులతో సమన్వయం చేయడంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో ఉండే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఇమేజ్ను మాత్రం మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.సీఎం రేసులో మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్?2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఒడిశాలో అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీని వెనుక గిరిజన ఓటు బ్యాంక్, సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు భావించారు.ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే.. ఆయనకు ఉన్న అనుభవం, ఢిల్లీ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వెంటనే సీఎం మార్పు చేయడం మాత్రం పార్టీకి అంత సులభమైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.ఎందుకంటే మోహన్ చరణ్ మాఝీ ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి కావడంతో ఆయనను మార్చడం మరో రాజకీయ సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.బీజేపీలో కొత్త సమీకరణాలు?ధర్మేంద్ర ప్రధాన్ పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఒడిశా బీజేపీలో అంతర్గత సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. రాష్ట్ర బీజేపీలో అపరాజిత సారంగి, బైజయంత్ పాండా, మన్మోహన్ సామల్ వంటి నేతలు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ప్రధాన్ పాత్రను పెంచే విషయంలో పార్టీ అధిష్ఠానం సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీలో ఉన్న అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు ఆయనకు ప్రత్యేక బలంగా మారుతున్నాయి.ముందున్న దారులు ఏంటి?ధర్మేంద్ర ప్రధాన్ ముందు ప్రధానంగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. బీజేపీలో జాతీయ స్థాయిలో మరింత కీలకమైన సంస్థాగత బాధ్యతలు చేపట్టడం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ విస్తరణలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం. రెండోది.. ఒడిశా రాజకీయాల్లోకి మరింత చురుగ్గా ప్రవేశించి రాష్ట్రంలో పార్టీకి మార్గనిర్దేశం చేయడం.వెంటనే ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా.. భవిష్యత్‌లో ఆయనకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకవైపు ఆయనపై వచ్చిన విమర్శలకు కారణమైనప్పటికీ.. మరోవైపు ఒడిశాలో ఆయన రాజకీయ బలాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి పాత్ర ఇస్తుంది? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. -
మీరు మీరు ఒకటేగా... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నువ్వు కూడా
-
కాక్రోచ్ గెలిచింది... పదవి నుంచి తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్
-
అంబేద్కర్ ఫోటో ఫ్రేమ్ తో CP లీడర్స్ సంబరాలు
-
Big Breaking : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
ధర్మేంద్ర రాజీనామా చేయిస్తే తర్వాత జరిగేది ఇదే..
-
సీజేపీ ఆందోళనకారులకు పోలీసులు బిగ్ షాక్.. ఆ పని చేస్తే పాస్‌పోర్ట్‌లు రద్దు!
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో.. హింసకు పాల్పడిన వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. నీట్ పేపర్ల లీకేజీలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలో సంసద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారి నిరసనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తోడవ్వడంతో ఉద్యమం ఊపందుకుంది.పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, పోలీసులపై ఆందోళన కారులు తిరగబడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యితే, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు శాంతియుతంగా కాకుండా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా దాడులకు తెగబడిన వారి పాస్‌పోర్టులు రద్దు చేసే దిశగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఆందోళనకు నిబంధనలు ఉల్లంఘించి పార్లమెంట్ వీధుల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 118మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం కాగా.. 60మంది ఆందోళనకారులు గాయపడ్డారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65మందికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం.. జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు జాతీయ భద్రతా చట్టం, 1980 కింద ముందస్తు నిర్బంధ అధికారాలను కల్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని విచారణ లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించవచ్చు.అయితే, ఈ ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకొకసారి జారీ చేసే సాధారణ ప్రక్రియేనని, జూలై 7నే దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలకు, ఈ ఆర్డర్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వివరించారు.శాంతిభద్రతలను కాపాడేందుకు నిరసనకారులు సహకరించాలని, సమస్యపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాగా, ఈ పోలీసుల కఠిన చర్యలకు నిరసనగా జూలై 24, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. -
కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: యూజీసీ నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగానే తాము కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసినట్టు కేటీఆర్ తెలిపారు. ఇదే సమయంలో వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు వెల్లడించారు.కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈరోజు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిశారు. భేటీ అనంతరం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశాం. యూజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెర్చ్ కమిటీలను రాష్ట్ర గవర్నర్‌కి బాధ్యతలు ఇవ్వడం సరికాదని చెప్పాము. వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు తెలిపారు.గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ నిబంధన రాజ్యంగ విరుద్ధంగా ఉంది. ఫ్యాకల్టీ ఎంపికలో సీనియారిటీ ప్రకారమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారికి సరైన విధానాలు పాటించాలని కేంద్రమంత్రిని కోరాం. NH-365బీ సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు పొడిగించాలని, టూరిజం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కోరడం జరిగిందన్నారు.ఇదే సమయలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10వ తేదీన విచారణ జరగబోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారు. అనర్హత వేటు పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పుకొచ్చారు. -
పార్లమెంట్లో నీట్ మంటలు.. ధరేంద్ర ప్రధాన్‌పై రాహుల్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాడీవేడీ చర్చ జరిగింది.సభలో నీట్ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉంది. మంత్రి(ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారు. డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారు. పేపర్ లీక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. #WATCH | Congress MP and LoP in Rajya Sabha Rahul Gandhi says "It is obvious to the whole country that there is a very serious problem in our examination system, not just in NEET but in all the major examinations. The minister (Dharmendra Pradhan) has blamed everybody except… pic.twitter.com/GO76I0sLZt— ANI (@ANI) July 22, 2024 ఈ క్రమంలో రాహుల్‌కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..‘నీట్ పరీక్ష పేపర్‌లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. విద్యావ్యవస్థను రాహుల్ అపహస్యం చేయడం దారుణం’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | On NEET exam issue, Samajwadi Party MP Akhilesh Yadav says, "This government will make a record of paper leaks... There are some centres where more than 2,000 students have passed. As long as this minister (Education Minister Dharmendra Pradhan) is there, the students… pic.twitter.com/Sa95rPYZki— ANI (@ANI) July 22, 2024మరోవైపు.. నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు నిరసనలకు దిగాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. అలాగే, ధర్మేంద ప్రధాన్ ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోని కొన్ని సెంటర్లలో రెండు వేల మందికిపైగా విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. -
బీజేపీ కొత్త సారథి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాలతో ఘన విజయం సాధించిన బీజేపీ.. కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్దమవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త అధ్యక్షడు ఎవరని ఆ పార్టీలో తీవ్ర చర్చజరుగుతోంది. రెండు సార్లు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా స్థానాన్ని అందుకోవడం అంత సామాన్యమైన,సులువైన విషయం కాదు. పార్టీలో అంతటి శక్తీ, సామర్థ్యాలు ఉన్న సమర్థవంతమైన నేత కోసం కమళ దళం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ముందు వరుసలో.. ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రథాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకుంది. అలాగే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నడ్డా బాధ్యతలు చేపట్టి.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రథాన్‌పై కూడా బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణంలో అంత ప్రభావం లేకపోయినా 2014, 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రథాన్. 2014కు ముందు ఆ పార్టీకి కేవలం 21 శాతం ఓట్ బ్యాంకు ఉంటే దానిని 2019 వరకు 39శాతం వరకు తీసుకురాగలిగారు. దీంతో వీరిద్దరిలో ఒకరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీలోని సీనియర్ల పేర్లను కూడా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుడంగా.. కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై నాలుగు గంటల పాటు సుధీర్ఘంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. దానిలో భాగంగానే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
డబ్బు గుట్టగా పోసుక్కుర్చున్నామా: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్ : పెట్రోల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తీసుకురావాలని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం కోరారు. వినియోగదారులు పెట్రోల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశమంతటా కూడా ఒకే రకమైన పన్ను వేయాలని కోరారు. ప్రస్తుతం జీఎస్టీ కింద సెంట్రల్ జీఎస్టీ, వ్యాట్ అని రెండు రకాలుగా పన్ను వసూలు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి ఒకే రకమైన పన్ను వేయాలని ఆర్థిక శాఖకు పంపిన ప్రపోజల్లో ప్రధాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లలో తగ్గుదల, పెరుగుదలలు అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రానికి పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు 42 శాతం రాష్ట్రాలకే పంచుతున్నామని వెల్లడించారు. అంతేకాక రాష్ట్రాలు అదనంగా విధించుకుంటున్న పన్ను వల్ల కూడా వాటికి ఆదాయం సమకూరుతోందని చెప్పారు. కేంద్రానికి వచ్చే నిధులను ప్రజల సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నామని అన్నారు. 'మేం రోడ్లు నిర్మించాలని, ఇళ్లు కట్టించాలని మీరు(ప్రజలను ఉద్దేశించి) అనుకోవడం లేదా?' అని ప్రశ్నించారు. 'మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?. మేమేమైనా డబ్బులు గుట్టగా పోశామనుకుంటున్నారా?' అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక ఇంటికి రూ. 75 వేలు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.


