breaking news
Delhi woman raped
-
‘నిర్భయ’ను మించిన దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి రెండ్రోజులుగా..!
గాజియాబాద్: బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న ఓ మహిళ(40)ను కిడ్నాప్ చేసిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఇనుప రాడ్డుతో చిత్రహింసలకు గురిచేశారు. రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసినవారే కావటం గమనార్హం. నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్ ఇంకా మహిళ మర్మాంగాల్లోనే ఉందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లో బంధువుల ఇంటిలో బర్త్‌డే పార్టీకి హాజరై ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది బాధితురాలు. ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపి వెళ్లాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఐదుగురు కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉందని గాజియాబాద్ ఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బాధితురాలిని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గాజియాబాద్ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మలివాల్ ఎస్పీని కోరారు. ‘ ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డుతో మహిళ రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గాజియాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆమెపై ఐదుగురు అత్యాచారం చేశారు. ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న సమయంలోనూ ఇనుప రాడ్డు అలాగే ఉంది. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. గాజియాబాద్ ఎస్ఎస్పీకి నోటీసులు పంపించాం’అని ట్వీట్ చేశారు శ్వాతి. ఇదీ చదవండి: స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం -
స్వామీజీ దర్శనానికి వెళ్లిన మహిళపై దారుణం
మథుర: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఆధ్యాత్మిక గురువు దర్శనం కోసం ఆయన ఆశ్రమానికి వెళ్లిన వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. జూలై 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు.. విపిన్ మహారాజ్ గురు దర్శనం కోసం బృందావనంలోని రాస్ బెహరి ట్రస్ట్ ఛారిటబుల్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఆశ్రమ బాధ్యతలు చూసే నిర్వాహకుడు సామాగ్రి తీసుకురావాల్సిందిగా ఢిల్లీకి చెందిన వ్యక్తి చెప్పాడు. ఆయన మార్కెట్‌కు వెళ్లగా ఒంటరిగా ఉన్న వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. బాధితురాలు భర్తతో కలసి వెళ్లి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని, కేసును యూపీలోని బృందావనం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నారు.