స్వామీజీ దర్శనానికి వెళ్లిన మహిళపై దారుణం | Delhi woman raped by head of ashram in Vrindavan | Sakshi
Sakshi News home page

స్వామీజీ దర్శనానికి వెళ్లిన మహిళపై దారుణం

Nov 5 2016 10:59 AM | Updated on Sep 4 2017 7:17 PM

స్వామీజీ దర్శనానికి వెళ్లిన మహిళపై దారుణం

స్వామీజీ దర్శనానికి వెళ్లిన మహిళపై దారుణం

ఓ ఆధ్యాత్మిక గురువు దర్శనం కోసం ఆయన ఆశ్రమానికి వెళ్లిన వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

మథుర: ఉత్తరప‍్రదేశ్లో దారుణం జరిగింది. ఓ ఆధ్యాత్మిక గురువు దర్శనం కోసం ఆయన ఆశ్రమానికి  వెళ్లిన వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. జూలై 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు.. విపిన్ మహారాజ్ గురు దర్శనం కోసం బృందావనంలోని రాస్ బెహరి ట్రస్ట్ ఛారిటబుల్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఆశ్రమ బాధ్యతలు చూసే నిర్వాహకుడు సామాగ్రి తీసుకురావాల్సిందిగా ఢిల్లీకి చెందిన వ్యక్తి చెప్పాడు. ఆయన మార్కెట్కు వెళ్లగా ఒంటరిగా ఉన్న వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. బాధితురాలు భర‍్తతో కలసి వెళ్లి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని, కేసును యూపీలోని బృందావనం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement