breaking news
Crompton Greaves
-
తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వ్యాపారం
కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఎనిమిదిన్నర దశాబ్దాలుగా సర్వీసులందిస్తున్న ప్రముఖ సంస్థ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తమ నూతన బ్రాండ్ లోగో, కలర్ ప్యాలెట్, బ్రాండ్ ఐడెంటిటీ (Crompton 2.0)ను ఆవిష్కరించింది. వినియోగదారుల ఆధునిక గృహ అవసరాలను, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ నూతన లోగో రూపుదిద్దుకుందని ముంబయిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) కాళీశ్వరన్ అరుణాచలంతో ‘సాక్షి వెబ్’ ప్రత్యేక ఇంటర్వ్యూ..క్రాంప్టన్ గ్రీవ్స్ నూతన బ్రాండ్ లోగో, వినియోగదారుల సేవల్లో వస్తున్న కీలక మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి?వినియోగదారుల ఆధునిక జీవనశైలికి తగినట్లుగా సరికొత్త అనుభూతిని అందిస్తూ అత్యుత్తమ ఉత్పత్తులను పరిచయం చేయడమే మా నూతన లోగో ప్రధాన ఉద్దేశం. కస్టమర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కల్పించడంతో పాటు వేగవంతమైన, కస్టమర్-సెంటిమెంట్ ఆధారిత సర్వీస్ ఓరియెంటెడ్ అప్రోచ్‌తో ముందడుగు వేస్తున్నాం. మా సాంప్రదాయ ఉత్పత్తులైన ఫ్యాన్లు, లైటింగ్ వ్యాపారాన్ని డిజైన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగాల్లో మరింత వేగవంతంగా నవీకరిస్తున్నాం. అధిక సంఖ్యలో ఉండే గృహోపకరణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇది మార్కెట్లో మా పట్టును మరింత బలోపేతం చేస్తుంది. క్రాంప్టన్ అంటే కేవలం లైట్లు, ఫ్యాన్లు మాత్రమే కాదు.. ఇదొక సమగ్ర గృహ పరిష్కారాల బ్రాండ్.తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయి?దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక మార్కెట్లు. ఈ రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం వల్ల వైర్లు, రెసిడెన్షియల్ ఎలక్ట్రికల్ వైరింగ్ విభాగంలో మెరుగైన వ్యాపార వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ ప్యాకేజింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల నుంచి భారీ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్ విస్తరణ ద్వారా మా కంపెనీకి నిలకడైన రాబడులు వస్తున్నాయి. స్థానికంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు, స్థానిక పంపిణీ నెట్వర్క్ పటిష్టతకు పెద్దపీట వేస్తున్నాం.గ్రీన్ ఎనర్జీ, పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా వస్తున్న అవకాశాలను ఎలా అందుకోబోతున్నారు?కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్య ఘర్ యోజన దేశీయ పునరుత్పాదక ఇంధన రంగానికి గొప్ప అవకాశంగా మారింది. సోలార్ ప్లాంట్లు, సోలార్ పంప్‌లు, అనుబంధ గ్రీన్ సొల్యూషన్స్ విభాగంలో విస్తరించడం ద్వారా గ్రీన్ ఎనర్జీని గృహ వినియోగదారులకు చేరువ చేస్తున్నాం. ఈ వ్యాపారం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా గ్రీన్ ఫీల్డ్ క్రియేషన్, ఉపాధి కల్పన సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాలు కంపెనీ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా నిలుస్తాయి. దీనిపై మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ పని చేస్తోంది.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితులు, పెరిగిన ఉత్పత్తి వ్యయాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆర్థిక వ్యూహాలను అనుసరిస్తున్నారు?ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మార్కెట్లో పెరిగిన ముడిసరుకుల వ్యయాలను సమతుల్యం చేయడానికి ప్రణాళికబద్ధంగా దాదాపు 6 శాతం ధరల పెంపు చేపట్టాల్సి వచ్చింది. అయితే, కేవలం ధరలు పెంచడం మాత్రమే కాకుండా మా ఉత్పత్తుల నాణ్యతను పెంచే ప్రీమియమైజేషన్ వ్యూహాన్ని వేగవంతం చేశాం. ప్రీమియం నాణ్యత గల ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మాది మార్కెట్లోనే బెస్ట్ క్యాష్ జనరేషన్ బిజినెస్. దీనివల్ల ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకుని నిలబడే స్థిరత్వం మాకుంది.భవిష్యత్తు నూతన ఆవిష్కరణలు, నిలకడైన ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానం పెంపుపై మీ వ్యూహం ఏమిటి?భవిష్యత్తు వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని సరికొత్త సాంకేతికత కలిగిన స్టార్టప్‌లతో కలసి పనిచేస్తున్నాం. కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ సాంకేతికతలను మా తయారీ, సర్వీసు విభాగాల్లో సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. ఇక్కడ ఒక ముఖ్య విషయమేమిటంటే.. ఏఐ, ఆటోమేషన్ ద్వారా మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించడం మా ఉద్దేశం కాదు. మా మ్యాన్‌పవర్‌ను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసి వారి నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా లేఆఫ్స్ నివారిస్తున్నాం. ఈ ఆధునిక సాంకేతిక కలయిక ద్వారా డిజైన్, లైటింగ్, ఫ్యాన్లు.. వంటి అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నాం.ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర.. -
క్రాంప్టన్ బ్రాండ్ లోగో న్యూ లుక్
భారతీయ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ రంగంలో 85 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ‘క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్’ (సీజీసీఈఎల్) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం సాంప్రదాయ ఫ్యాన్లు, మోటార్ పంపుల తయారీ సంస్థగానే కాకుండా సమగ్ర గృహ పరిష్కారాలను అందించే సాంకేతిక దిగ్గజంగా అవతరించేందుకు ‘క్రాంప్టన్ 2.0’ వ్యూహంతో సమగ్ర మార్పులకు పూనుకుంది.ముంబైలోని విఖ్రోలిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రమీత్ ఘోష్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తన్మయ్ ప్రుష్టి, సీఎఫ్ఓ కాళీశ్వరన్ అరుణాచలం, అనుబంధ సంస్థ బటర్‌ఫ్లై చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్వేత సాగర్లతో కలిసి తమ నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించారు. కొత్త ఉత్పత్తుల విడుదలలో భాగంగా కంపెనీ అనుబంధ విభాగం ‘రియాన్’ను ఆవిష్కరించారు. ఈ విభాగంలో భారత్‌లోనే మొదటిసారి వాటర్ బయోఫ్యూరిఫైర్ ‘బయోఫైర్’ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మారుతున్న భారతీయుల జీవనశైలి, ఆధునిక అభిరుచులకు అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో (FY31 నాటికి) వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం సుమారు రూ.8,000 కోట్ల నుంచి రెండింతలు పెంచి రూ.15,000 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. రూ.1.6 లక్షల కోట్లకు..కంపెనీ సీఈఓ ప్రమీత్ ఘోష్ చెప్పిన వివరాల ప్రకారం.. గత మూడేళ్ల కాలంలో క్రాంప్టన్ తన వ్యాపార పరిధిని గణనీయంగా విస్తరించింది. మూడేళ్ల క్రితం కంపెనీకి ఉన్న మొత్తం అడ్రసబుల్ మార్కెట్ (టీఏఎం) పరిమాణం రూ.80,000 కోట్లు కాగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.1,60,000 కోట్లకు చేరింది. కొత్తగా సోలార్ రూఫ్‌టాప్స్, సోలార్ వాటర్ పంప్‌లు, ఎలక్ట్రికల్ వైర్లు, రూ.5,500 కోట్లకు పైగా విలువైన వాటర్ ప్యూరిఫికేషన్ (నీటి శుద్ధి) విభాగాలు ఈ మార్కెట్ విస్తరణకు ప్రధాన చోదకాలుగా నిలిచాయి.ప్రీమియమైజేషన్ వైపు అడుగులు.. క్రాంప్టన్ రియాన్సాధారణ వినియోగదారులతోపాటు కంపెనీ ఇప్పుడు సూపర్ ప్రీమియం కేటగిరీ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘క్రాంప్టన్ రియాన్’ అనే ప్రీమియం సబ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. రియాన్ పోర్ట్‌ఫోలియో కింద దేశంలోనే మొదటిసారిగా ‘వాటర్ బయోఫైయర్’ అనే సుమారు రూ.42,000 విలువైన వాటర్ ప్యూరిఫైయర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. శక్తివంతమైన బ్రష్‌లు లేని డైరెక్ట్ కరెంట్ మోటారు(బీఎప్డీసీ) ఫ్యాన్లలో ‘ఎనర్జియాన్’ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేస్తూ మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది.నూతన బ్రాండ్ ఐడెంటిటీమారుతున్న వినియోగదారుల ట్రెండ్స్‌కు అనుగుణంగా క్రాంప్టన్ తన విజువల్, సోనిక్ ఐడెంటిటీని పునర్నిర్మిస్తున్నట్లు కంపెనీ సీఈఓ చెప్పారు. ఇందులో భాగంగానే సరికొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. ‘అమేజింగ్, ఎవ్రీ డే’ అనే దీని ట్యాగ్‌లైన్‌ను ప్రకటించారు. ఈ బ్రాండ్ మార్పుల కోసం 18,000 మందికి పైగా వినియోగదారులు, 30 మిలియన్ల డేటా పాయింట్లతో దాదాపు 18 నెలల పాటు విస్తృతమైన పరిశోధన చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది.ఆవిష్కరణలే కీలకంపరిశోధన, ఆవిష్కరణల కోసం గత మూడేళ్లలో రూ.312 కోట్లు వెచ్చించగా, గతేడాదే రూ.112 కోట్లను కేటాయించినట్లు సీఈఓ చెప్పారు. ‘సుస్థిర ఇంధన విభాగంలో సోలార్ రూఫ్‌టాప్స్, పంపుల్లో స్థిరమైన వృద్ధి సాధిస్తోంది. ఇటీవలే మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి రూ.101 కోట్ల భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను కనబరిచింది’ అన్నారు.ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర.. -
క్రాంప్టన్ కొత్త లోగో ఆవిష్కరణ ఈవెంట్లో కొన్ని (ఫొటోలు)
-
క్రాంప్టన్‌లో బటర్‌ఫ్లై విలీనం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్‌లో కిచెన్, స్మాల్ అప్లయెన్సెస్ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి విలీనం కానుంది. ఏకీకృతం కావడం ద్వారా సంయుక్త సంస్థ పలు అంశాలలో వ్యాపార లబ్దిని పొందనుంది. దీంతో రెండు కంపెనీల కార్పొరేట్, పాలన తదితర అంశాలు సైతం సరళతరంకానున్నాయి. షేర్ల మార్పిడి ద్వారా విలీనంకానున్నట్లు రెండు సంస్థలూ విడిగా తెలియజేశాయి. ఇందుకు 22:5 నిష్పత్తిలో షేర్ల మార్పిడికి తెరతీయనున్నాయి. అంటే బటర్‌ఫ్లై వాటాదారులకు తమవద్దగల ప్రతీ 5 షేర్లకుగాను 22 క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేర్లను జారీ చేస్తారు. కాగా.. విలీనానికి సెబీ, స్టాక్ ఎక్సే్ఛంజీలుసహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని పొందవలసి ఉంది. రుణదాతలు, ఎన్సీఎల్ టీ, వాటాదారులు సైతం ఆమోదముద్ర వేయవలసి ఉంది. కొత్త ప్రొడక్టులపై దృష్టి బటర్‌ఫ్లైతో విలీనం ద్వారా కొత్త ప్రొడక్టుల తయారీపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుచిక్కనున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎండీ శంతను ఖోస్లా పేర్కొన్నారు. విలీనం వాటాదారులకు మరింత విలువను చేకూర్చుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్తో విలీనం ద్వారా కంపెనీ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించగలదని బటర్‌ఫ్లై ఎండీ రంగరాజన్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఇది వృద్ధికి, ప్రొడక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. బటర్‌ఫ్లై గంధిమతిలో 81 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,076 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
క్రాంప్టన్ గ్రీవ్స్ చేతికి బటర్‌ఫ్లై
న్యూఢిల్లీ: బటర్‌ఫ్లై బ్రాండ్‌తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్‌ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్‌ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది. టాప్–3లో ఒకటి..: బటర్‌ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్పీజీ స్టవ్‌లు, నాన్‌స్టిక్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్‌లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది. డీల్ వార్తల నేపథ్యంలో బటర్‌ఫ్లై షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 409 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్- సీజీ కన్జూమర్ జోరు
ఒక రోజు వెనకడుగు తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షేరుకి రూ. 205 ధరలో 7.8 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకే అంచనాలున్నట్లు తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం తదుపరి ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏబీ ఫ్యాషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 163ను అధిగమించింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ నికర లాభం 28 శాతం ఎగసి రూ. 142 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 13 శాతం పెరిగి రూ. 1,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభ మార్జిన్లు 3.8 శాతం మెరుగుపడి 15.8 శాతానికి చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 307 వద్ద ట్రేడవుతోంది. తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 329 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
వెలుగులో చిన్న షేర్లు
మూడు రోజులుగా బలపడ్డ సెంటిమెంట్ చిన్న షేర్లకు టానిక్‌లా పనిచేస్తోంది. గత రెండు రోజుల్లో మార్కెట్లకు మించి పరుగు తీసిన బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మరోసారి 1.4% ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 1,746 లాభపడితే, 1,188 మాత్రమే నష్టపోయాయి. ఇక మరోవైపు మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకులోనై చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 25,561 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 16 పాయింట్లు పుంజుకుని 7,640 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 554 పాయింట్లు జమ చేసుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,912 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 1,316 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా మెటల్స్, పవర్, వినియోగవస్తు రంగాలు 2%పైగా పురోగమించాయి. మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పుంజుకోగా, పవర్ షేర్లు సీఈఎస్సీ, టాటా పవర్, అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ 4-2% మధ్య ఎగశాయి. సెన్సెక్స్‌లో ఎంఅండ్ఎం 3%, బజాజ్ ఆటో 2% చొప్పున క్షీణించాయి. రెండు సంస్థలుగా క్రాంప్టన్ గ్రీవ్స్ వినియోగ వస్తువుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి లిస్ట్ చేయనుండటంతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 13% జంప్‌చేసింది. రూ. 211 వద్ద ముగిసింది. 2.3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వినియోగ వస్తు విభాగాన్ని (బీటూసీ) ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బెల్జియం మాతృసంస్థ నిర్ణయించినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ బీఎస్ఈకి తెలిపింది. ప్రధాన కంపెనీ చేతిలో విద్యుత్, పారిశ్రామిక, ఆటోమేషన్ ఉత్పత్తుల బిజినెస్ ఉంటుందని తెలియజేసింది.


