breaking news
Coordination meeting
-
మాదక ద్రవ్యాలపై కన్నెర్ర
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం మరిన్ని కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 26న ఢిల్లీలో నార్కో–కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) 10వ అత్యున్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 44 మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మాదకద్రవ్య నియంత్రణ సంస్థలకు చెందిన 108 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో పాల్గొంటారు. విజన్ డాక్యుమెంట్ విడుదలఎన్సీఓఆర్డీ సమావేశ సందర్భంగా అమిత్ షా ‘నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026–2029’ను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, మాదకద్రవ్య నిరోధక సంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పత్రాన్ని రూపొందించారు. మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు, సరఫరా నియంత్రణ, వ్యసన బాధితులకు పునరావాసం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యా చరణ ప్రణాళికను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ద్వారా జరిగే అక్రమ రవాణా, యువతను మాదకద్ర వ్యాలకు దూరంగా ఉంచడం, చికిత్సా, పునరా వాస కేంద్రాల విస్తరణ వంటి అంశాలపై వచ్చే మూడు సంవత్సరాలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. దేశవ్యాప్తంగా విధాన రూపకల్పన, అమలు, సంస్థాగత బలోపేతానికి ఈ విజన్ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా అమిత్ షా ‘ఎన్సీబీ వార్షిక నివేదిక–2025’ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే జమ్మూ, గౌహతిలో నూతనంగా నిర్మించిన ఎన్సీబీ జోనల్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. రూ.6 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసందేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టిన ప్రత్యే క ‘ఆన్లైన్ డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ను కూడా కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2,09,500 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్నాయి. వీటి అంచనా విలువ 6 వేల కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. దేశంలో మాద కద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఎన్సీఓఆర్డీ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు, డ్రగ్స్ నియంత్రణ అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే మూడు సంవత్సరాల కార్యాచరణపై చర్చ జరగనుంది. -
అంతా సాదాసీదా..
వేములవాడ : అదే ప్రతిపాదిత అజెండా.. అదే మూసాలో చర్చ.. గందరగోళ స్థితిలో ఆమోదాలు.. ఏమాత్రం స్పష్టతలేని నిర్ణయాలు.. అన్నట్లు కొనసాగింది మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం. జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో సోమవారం ఆలయ కళామంటపంలో సమావేశం నిర్వహించారు. ప్రారంభంలోనే ఏటా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జరిగే సమావే శాన్ని ఈ సారి జేసీ నేతృత్వంలో నిర్వహించి దులుపేసుకోవటం బాధగా ఉందని ప్రజాప్రతినిధులు పేర్కొనడం అక్కడి వాతావరణాన్ని గంభీరంగా మార్చేసింది. అధికారులు మొక్కుబడిగా తమతమ శాఖలవారీగా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపారు. మరోపక్క ప్రజాప్రతినిధులు సమస్యలను వివరించారు. మొత్తం ఎవరికివారే యమనాతీరే అన్నట్లుగా సాగింది సమావేశమంతా.. భక్తుల అవసరాలకు అనుగుణంగా నూతన సంగతులు సమీక్షకు నోచుకోలేదు. ఏ శాఖల అధికారులు ఏబాధ్యతలు నిర్వహించాలన్నది మొక్కుబడిగా చర్చించి మమ అనిపించారు. పోలీసు బందోబస్తు, ఆరోగ్యశాఖ కేంద్రాలు, పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్ స్థలాల ఎంపిక, రవాణా సదుపాయాలు తదితర అంశాలు నివేదికలో భాగమయ్యాయి. ఇవన్నీ ఏటా జరిగేవేనని. అయినా ఇక్కట్లు తప్పడంలేదని స్థానిక నాయకులు ఎత్తిచూపారు. తాగునీటికోసం నిలదీత... ఎల్ఎండీ-వేములవాడ శ్రీరాజరాజేశ్వర తాగునీటి పథకం పూర్తిచేయడంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ నాయకుడు చిలుక రమేశ్ నిలదీశారు. ఆయనకు మాజీ సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మాట్లాడుతూ త్వరలోనే నీళ్లు సరఫరా అవుతాయని చెప్పారు. పలుమార్లు హామీలిచ్చి నెరవేర్చలేదంటూ రమేశ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కలగజేసుకుని గత ప్రభుత్వం మీదేకదా.. అప్పుడు ఏంచేశారంటూ నిలదీశారు. దీంతో పదినిమిషాలపాటు వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే జోక్యంతో సద్దుమణిగింది. నాయకులు రేగుల మల్లికార్జున్, నందిపేట సుదర్శన్, వాసం మల్లేశం, రాపెల్లి శ్రీధర్ పలు అంశాలను లేవనెత్తారు. వీరు సమస్యలు వివరించే ప్రతీసారీ వేదికపైనున్న అధికారులు తమలోతాము మాట్లాడుకోవడం.. లేదంటే సెల్ఫోన్లో తలమునకలవడమే కనిపించింది. ప్రధానంగా అధికారులు మాట్లాడినప్పుడు మినహా ప్రజాప్రతినిధులు మాట్లాడిన ప్రతీసారీ జేసీ అసహనంగానే ఫీలయ్యారు. ఇవీ పరిశీలనకు స్వీకరించినవి... భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు వసతి గదుల విచారణ కార్యాలయ మార్పుఅంశాన్ని స్థానిక నాయకులు ఎత్తిచూపారు. టీటీడీ ధర్మశాలలవద్దకు తరలించేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. స్పందించిన ఈవో కమిషనర్ అనుమతులకోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించేందుకు మూలవాగులో తాత్కాలిక కాజ్వే నిర్మాణాన్ని చేపట్టాలని నాయకులు సూచించారు. పట్టణాన్ని బారికేడ్లతో మూసేయడం సరికాదని నగరపంచాయతీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ సూచించారు. ప్రైవేటు లాడ్జీలు, అద్దె గదుల నిర్వహణ, ధరల నియంత్రణ తదితర అంశాలను ప్రస్తావించారు. మూడు వాహనాలతో కూడిన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈవో రాజేశ్వర్, జెడ్పీ సీఈవో అంబ య్య, ఆర్డీవో భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, సీఐ రమేశ్‌బాబు, నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ వినోద్ గౌడ్, జెడ్పీటీసీశ్రీకాంత్ పాల్గొన్నారు.


