breaking news
central bank federal
-
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
అమెరికా సహాయ ప్యాకేజీలో మరింత కోత
ట్యాపరింగ్ స్పీడ్ పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరో 10 బిలియన్ డాలర్లు కట్; ఫిబ్రవరి నుంచే అమలు బాండ్ల కొనుగోళ్లు ఇక నెలకు 65 బిలియన్ డాలర్లకే పరిమితం వాషింగ్టన్: అమెరికాలో ఆర్థిక సహాయ ప్యాకేజీకి కోత(ట్యాపరింగ్)ను అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) వేగవంతం చేసింది. ఫెడ్ చైర్మన్‌గా తన ఆఖరి సమీక్షను నిర్వహించిన బెన్ బెర్నాంకీ ప్యాకేజీకి మరింత కోత పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం నెలకు 75 బిలియన్ డాలర్లుగా ఉన్న బాండ్ల కొనుగోళ్ల పథకంలో ఫిబ్రవరి నుంచి మరో 10 బిలియన్ డాలర్లు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్యాకేజీ 65 బిలియన్ డాలర్లకే పరిమితం కానుంది. డిసెంబర్లో కొత్త ఉద్యోగాల వృద్ధి మందగించడం, వర్ధమాన దేశాల మార్కెట్లలో భారీ పతనం వంటివి చోటుచేసుకున్నా... బెర్నాంకీ మాత్రం వరుసగా రెండో నెలలోనూ ట్యాపరింగ్‌ను ప్రకటించడం గమనార్హం. నెలకు 85 బిలియన్ డాలర్లుగా ఉన్న బాండ్ల కొనుగోళ్ల ప్యాకేజీలో తొలిసారిగా డిసెంబర్ సమీక్షలోనే ఫెడ్ 10 బిలియన్ డాలర్లను కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇది 75 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2012 సెప్టెంబర్‌లో ఈ ప్యాకేజీ ఆరంభమైంది. నెలనెలా 10 బిలియన్ డాలర్ల చొప్పున కోతపెడతామని గతనెలలోనే బెర్నాంకీ చెప్పారు. ఈ ఏడాది ఆఖరికల్లా బాండ్ల కొనుగోళ్లను నిలిపేయొచ్చని కూడా సంకేతాలిచ్చారు. వడ్డీరేట్లు యథాతథం... పాలసీ వడ్డీరేట్లను ఇప్పుడున్న జీరో స్థాయిలోనే కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం పాలసీ రేటు పావు శాతంగా ఉంది. వచ్చే ఏడాది మధ్యవరకూ ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా. ‘గత సమావేశం తర్వాత ఉద్యోగ గణాంకాల్లో మిశ్రమ సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వ్యాపార పరిస్థితులు, ప్రజల వినియోగ వ్యయం ఇటీవల మరింత పుంజుకుంది. దీంతో ఫిబ్రవరి నుంచి 75 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లు, మార్ట్గేజ్ సెక్యూరిటీలను మాత్రమే కొనాలని నిర్ణయించాం’ ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే సమీక్ష కొత్త చైర్మన్ యెలెన్ నేతృత్వంలో... దాదాపు ఎనిమిదేళ్లు ఫెడ్ చైర్మన్‌గా కొనసాగిన బెర్నాంకీ పదవీ కాలం నేటితో(జనవరి 31)ముగుస్తోం ది. బెర్నాంకీ స్థానంలో ప్రస్తుత వైస్ చైర్మన్ జానెట్ యెలెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి సమీక్ష ఆమె నేతృత్వంలోనే జరగనుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు తొలి మహిళా చైర్మన్‌గా ఆమె ఎన్నికవడం తెలిసిందే. ట్యాపరింగ్‌పై భయాలొద్దు: చిదంబరం న్యూఢిల్లీ: అమెరికాలో ట్యాపరింగ్ విషయంలో భారత్‌లో భయపడాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి చిదంబరం భరోసా ఇచ్చా రు. భారత్ మార్కెట్లపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపబోదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అప్రమత్తంగా ఉన్నట్లు ఆర్థికశాఖ మరో ప్రకటనలో పేర్కొంది.


