ccs meating
-
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్,హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లు పాల్గొన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాలు, ఎరువుల లభ్యత, భారతీయుల భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్లో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మూడోసారి సీసీఎస్ సమావేశం నిర్వహించింది. గత సమావేశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం దేశానికి ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. ఎల్పీజీ ధరలు కూడా పెంచలేదు.ఈ ఏడాది ఖరీఫ్ కోసం తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్‌లో ఎటువంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చారు. ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరం అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా యుద్ధ ప్రభావం దేశంపై నేరుగా పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇంధన నిల్వలు, ఎరువుల లభ్యత, విద్యార్థుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తోంది. -
సరిహద్దుల్లో బాహాబాహీ : మళ్లీ రెచ్చిపోయిన డ్రాగన్
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్-చైనాల మధ్య చర్చలు జరుగుతుండగానే దుందుడుకుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ మరోసారి రెచ్చిపోయింది. సోమవారం రాత్రి కాల్పులకు తెగబడిన చైనా సైనికులు మంగళవారం రెజాంగ్ లా హైట్స్ వద్ద భారత దళాలతో తలపడ్డారు. పర్వత ప్రాంతంపై ఉన్న భారత దళాలను తరిమికొట్టి అక్కడ పాగావేయాలనే దుర్నీతితో చైనా సైనికులు భారత జవాన్లతో తలపడ్డారు. ఇక భారత్-చైనా సరిహద్దుల వద్ద తుపాకులు వాడరాదన్న ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ సోమవారం రాత్రి లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత స్ధావరాలపై చైనా సైనికులు కాల్పులు జరిపారు. భారత దళాలు డ్రాగన్ దాడిని తిప్పికొట్టేందుకు కాల్పులు చేపట్టాయి. ఇరు దళాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగిన అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. కాల్పులతో కవ్వించిన చైనా మంగళవారం మరోసారి భారత దళాలతో ఘర్షణకు తెగబడటాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. చదవండి : భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. అర్ధరాత్రి కాల్పులు సీసీఎస్ భేటీ రెజాంగ్ లా ప్రాంతంలో భారత దళాలతో చైనా సైన్యం ఘర్షణలకు దిగినా ఇరు దళాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చైనా దూకుడు నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరగనుంది. సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
-
క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సర్జికల్ అనంతరం పాకిస్థాన్, భారత్ బార్డర్‌లోని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ(సీసీఎస్) శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌తో అనుసరించాల్సిన విధానం, ఉగ్రవాదుల నియంత్రణకు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో రక్షణ మంత్రి మనోహర్ పరికర్,ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ,హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జై శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


