breaking news
cadre posts
-
ఉద్యోగుల స్థానిక కేడర్‌పై ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు, 72 డివిజిన్ల వారీగా కేడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. ప్రస్తుత ఉద్యోగుల స్థానిక కేడర్‌ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థానిక కేడర్ల మధ్య కేడర్ బలాన్ని నిర్ధారించడంతో పాటు పంపిణీ చేయనున్నారు. స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని శాఖలలో పోస్టుల సృష్టి, పోస్టులు ఉన్నతీకరణ, కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపై నిషేధం విధించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానిక కేడర్ పంపిణీ వర్తించదు. ఈ జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలిక కేటాయింపులు చేస్తారు.⇒ ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ తదితర సారూప్య కేటగిరీల పోస్టులు మల్టీ జోన్ కేడర్లుగా ఏర్పాటయ్యాయి. అందుకనుగుణంగా అటువంటి కేటగిరీల పోస్టులు మంజూరైన బలం, రాష్ట్రపతి ఉత్తర్వులు 2025, మార్గదర్శకాల నిబంధనలకు అనుగుణంగా మల్టీజోన్–1, మల్టీజోన్–2 మధ్య పంపిణీ చేయాలి.⇒ సచివాలయ శాఖలు, శాఖాధిపతుల ఆధ్వర్యంలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న కార్యాలయాలలో, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు /సంస్థలు /స్థాపనలలో మంజూరైన అన్ని వర్గాల పోస్టులకు (శాశ్వత, తాత్కాలిక, సూపర్ న్యూమరరీ పోస్టులతో సహా) ఉత్తర్వులు వర్తిస్తాయి.⇒ రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులు, గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ అధికారులుగా నిర్వహిస్తున్న పోస్టులు, న్యాయాధికారులుగా నిర్వహిస్తున్న పోస్టులు, శాసనసభ సచివాలయం, గవర్నర్ సచివాలయంలోని పోస్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా, ఇతర న్యాయస్థానాలలోని పోస్టులు, ప్రభుత్వ రంగ సంస్థలలోని పోస్టులు, సిబ్బందికి ఈ మార్గదర్శకాలు వర్తించవు. సచివాలయ విభాగాలు, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలు, వ్యవస్థలు కేడర్ బలాన్ని నిర్ణయించడం నుంచి మినహాయిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వు 2025లోని నిబంధనలు ఈ కార్యాలయాలకు వర్తించవు.⇒ కేడర్ బలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను తీసివేయడం ద్వారా నిర్ధారించాలి. డిప్యుటేషన్, సెలవు, శిక్షణ లేదా సస్పెన్షన్‌లో ఉన్న వ్యక్తుల పోస్టులను భర్తీ చేయబడిన పోస్టులుగా పరిగణించాలి. వాటిని ఖాళీలుగా లెక్కించరాదు.⇒ కేడర్ బలం, పని బలం పంపిణీ కోసం పోస్టుల కేటాయింపు నిష్పత్తులు ఉదాహరణకు ఇలా ఉంటాయి. పూర్వపు కృష్ణా జిల్లా హెచ్ఒడీలో పోస్టుల కేటాయింపు నిష్పత్తులు ‘‘కృష్ణా : ఎన్టీఆర్ : ఏలూరు :: 40 : 50 : 10గా నిర్ధారించవచ్చు. 40 శాతం పోస్టులు పునర్వ్యవస్థీకరించబడిన కృష్ణాకు, 50 శాతం పునర్వ్యవస్థీకరించబడిన ఎన్టీఆర్‌కు, 10 శాతం పునర్వ్యవస్థీకరించబడిన ఏలూరుకు కేటాయించాలి.⇒ విభాగాధిపతి మార్గదర్శకాల మేరకు పునర్వ్యవస్థీకరించబడిన స్థానిక ప్రాంతాలలో కేటాయించదగిన కేడర్ బలాన్ని పంపిణీ చేయాలి. ఆ తరువాత విభాగాధిపతి ఆదేశాలకు అనుగుణంగా సిబ్బందిని పునర్వ్యవస్థీకరించబడిన స్థానిక ప్రాంతాలలో పంపిణీ చేయాలి. ఈ కార్యకలాపాలు నిర్దేశిత ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించాలి. దీని కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేస్తుంది.⇒ విభాగాధిపతి కేడర్ బలం, పని చేసే సిబ్బంది తుది కేటాయింపు ప్రతిపాదనను రూపొందించి సంబంధిత సచివాలయ విభాగానికి సమర్పించాలి. సంబంధిత కార్యదర్శి ఆ ప్రతిపాదనను పరిశీలించి రాష్ట్రపతి ఉత్తర్వు 2025కు అనుగుణంగా ఉందని నిర్ధారించుకుని ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపాలి.⇒ సచివాలయ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ప్రాంతీయ, జిల్లా అధిపతులు ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
యువ ఐఏఎస్‌లకు కేడర్ల కేటాయింపు
ఢిల్లీ: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)కు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం కేడర్ కేటాయించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్లో ఐఏఎస్ సాధించిన వారి కేడర్ కేటాయింపు జాబితా (IAS cadre allocation list) విడుదలైంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈమేరకు జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ ర్యాంకర్ శక్తి దూబే (Shakti Dubey) తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను తన కేడర్‌గా పొందారు. హరియాణాకు చెందిన రెండో ర్యాంకర్ హర్షిత గోయల్.. గుజరాత్ కేడర్‌కు ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంకర్ డోంగ్రే అర్చిత్ పరాగ్.. కర్ణాటక కేడర్ దక్కించుకున్నారు. నాలుగో ర్యాంకర్ షా మార్గి చిరాగ్(గుజరాత్), ఐదో ర్యాంకర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ) సొంత రాష్ట్రాల్లో కేడర్ పొందారు. టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు తమ సొంత రాష్ట్ర కేడర్ దక్కించుకున్నారు. టాప్ 25లో 11 మంది మహిళలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 22న సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. 1,009 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్ఈ 2024 ఫలితాల్లో యూపీకి చెందిన శక్తి దూబే మొదటి స్థానం సాధించారు. టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. టాప్ 25లో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. దేశంలో అత్యంత పోటీ ఉన్న పరీక్షల్లో ఒకటైన సివిల్స్‌లో ప్రతిఏటా లక్షలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్‌లతో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ A, B ఉద్యోగాలు పొందేందుకు సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి. టాప్ 10 ర్యాంకర్ల కేడర్ కేటాయింపలు ఇలా ఉన్నాయి..ర్యాంక్పేరుకేటగిరీసొంత రాష్ట్రంకేడర్1శక్తి దూబేజనరల్ఉత్తరప్రదేశ్ఉత్తరప్రదేశ్2 హర్షిత గోయల్జనరల్హరియాణాగుజరాత్3డోంగ్రే అర్చిత్ పరాగ్జనరల్మహారాష్ట్రకర్ణాటక4షా మార్గి చిరాగ్జనరల్గుజరాత్గుజరాత్5ఆకాష్ గార్గ్జనరల్ ఢిల్లీAGMUT6కోమల్ పునియాజనరల్ఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్7ఆయుషి బన్సల్జనరల్మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్8రాజ్ కృష్ణజనరల్బిహార్ బిహార్ 9ఆదిత్య విక్రమ్ అగర్వాల్జనరల్హరియాణాఉత్తరప్రదేశ్10మయాంక్ త్రిపాఠిజనరల్ఉత్తరప్రదేశ్ఉత్తరప్రదేశ్చదవండి: 'ప్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు' -
జోనల్ వ్యవస్థను రద్దు చేయండి
ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. యూటీఎఫ్, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాలు మినహా మిగతా సంఘాలన్నీ జోనల్ వ్యవస్థ రద్దుకే మొగ్గు చూపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. కేడర్ పోస్టులు కొనసాగించాలి అసమానతలకు గురి చేస్తున్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి. కొత్త నియామకాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులే ఉంచాలి. జిల్లా స్థాయి పోస్టులను ఆయా విభాగాలతో సంప్రదించి నిర్ణయించాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రస్తుత జోనల్ స్థాయి అధికారుల సీనియారిటీ దెబ్బ తినకుండా చూడాలని కోరాం. ప్రస్తుత కేడర్ పోస్టులను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశాం. కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులు కుదించొద్దని స్పష్టం చేశాం. ఉద్యోగుల పంపకాలు, సమస్యల పరిష్కారానికి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను కొద్దిగా మార్చి రాష్ట్రంలోనూ ఒక ఐఏఎస్ నేతృత్వంలో కమిటీ వేయాలని, సీనియారిటీ, మల్టీ జోనల్ సమస్యలను పరిష్కరించాలని సూచించాం. జోనల్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారకుండా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలన్నాం. స్థానికత కోసం ఏపీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించాలన్నారు. కొత్త జిల్లాలొస్తున్నందున హెచ్ఆర్ఏ అందరికీ సమానంగా ఇవ్వాలని కోరాం. - దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మమత (టీఎన్జీవో) సమానావకాశాలు కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులకు రక్షణ కల్పించాలని కోరాం. ఎవరూ ఆందోళన చెందే పని లేకుండా ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అలాగే కొనసాగుతాయి. - పాతూరి సుధాకర్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లు పాలన ఇబ్బందులు రాకుండా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలన్నాం. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్-2 ఎంఈవో, డైట్ సీనియర్ లెక్చరర్లు, బీఎడ్, డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ పోస్టులను రాష్ట్ర కేడర్‌లో ఉంచాలి. డీఈవోలను అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించాలి. - పూల రవీందర్, పి.సరోత్తమ్‌రెడ్డి, నరహరి లకా్ష్మరెడ్డి (పీఆర్టీయూ-టీఎస్) పాలకుల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు కేవలం పాలకుల సౌలభ్యానికే చేస్తున్నట్టుగా ఉంది. ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేస్తే పాలనసౌలభ్యమెలా అవుతుంది? జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలి. లేదంటే వెనకబడిన జిల్లాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీఈవో, ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలి. - భుజంగరావు, సదానందగౌడ్ (ఎస్టీయూ) ఆరు జోన్లుండాలి సామాజికంగా, ఆర్థికంగా ఒకే స్థాయిలో ఉన్న ప్రాంతాలతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి. జోనల్ వ్యవస్థను కొనసాగించి వాటి సంఖ్యను ఆరుకు పెంచాలి. - నర్సిరెడ్డి, చావ రవి (టీఎస్-యూటీఎఫ్) -
జనాభానే ప్రాతిపదిక
రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ రాష్ట్ర స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న స్థానిక కేడర్ ఉద్యోగులు వారి స్వస్థలాలకు ఈ నెల 10వ తేదీ కల్లా నమూనా పత్రాల్లో వివరాలు ఇవ్వాలి అన్ని శాఖలకు రెండు రాష్ట్రాల సీఎస్లసర్క్యులర్ మెమో జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ (41.68 శాతం), ఆంధ్రప్రదేశ్ (58.32 శాతం) రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్. కృష్ణారావులు సంయుక్త సంతకాలతో జారీ చేసిన సర్క్యులర్ మెమోలో స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు, ఖాళీల విభాగాలు, కేటగిరీల వారీగా నిర్ధారించిన నమూనా పత్రాల్లో ఈ నెల 10వ తేదీలోగా ఇవ్వాల్సిందిగా ఆ మెమోలో ఇద్దరు సీఎస్‌లు అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు, ఉద్యోగుల పంపిణీని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన విభాగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చలతో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న స్థానిక కేడర్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు వెనక్కు పంపించనున్నట్లు స్పష్టం చేశారు. పోస్టుల వివరాలు రాగానే ఏ రాష్ట్రానికి ఏ శాఖలో, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులో కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పోస్టుల పంపిణీ వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూల్స్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను కూడా ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేస్తారు. సచివాలయంతో పాటు రాష్ట్ర స్థాయిలోని పలు శాఖల్లోని పోస్టులను సమాన నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు సంయుక్తంగా పంపిణీ చేస్తారు. రాష్ట్ర స్థాయి కేటగిరీ పోస్టు అయినప్పటికీ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికే చెందిన పోస్టు అయితే అది ఏ రాష్ట్రానికి చెందితే ఆ రాష్ట్రానికే కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలు, ప్రాజెక్టుల్లోని క్షేత్రస్థాయి పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగానే పరిగణనలోకి తీసుకుని ఆ పోస్టులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తారు. రాష్ట్రాల సరిహద్దులోని మల్టీ జోనల్ పోస్టులను, నాన్ గెజిటెడ్ పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగానే పరిగణించి ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఏదైనా శాఖల్లోని క్షేత్రస్థాయి యూనిట్లు లేకపోతే ఆయా శాఖల్లోని అన్ని రకాల పోస్టులను రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగానే భావించి ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ సివిల్ సర్వీస్ అండ్ సివిల్ పోస్టుల్లో ఉంటే తప్పనిసరిగా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఏదైనా శాఖలకు క్షేత్రస్థాయి యూనిట్లు ఉండి రాష్ట్రపతి ఉత్తర్వుల కిందకు వస్తే స్థానిక కేడర్, రాష్ట్ర కేడర్ కింద పరిగణిస్తారు. స్థానిక కేడర్‌లో ఉన్నవారు అక్కడే ఉంటారు. అయితే స్థానిక కేడర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగులు శాఖాధిపతి, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, ఇనిస్టిట్యూషన్స్, ప్రత్యేక కార్యాలయాలు, ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తుంటే సమాన నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవడం గానీ లేదా వారి స్థానిక కేడర్‌కు తిరిగి పంపించవచ్చు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకుంటారు.


