breaking news
busiest airport
-
10 అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. భారత్‌కు మకుటాయమానం!
భారతదేశ ఆకాశ రవాణా మార్గాలు నేడు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, విమానయాన రంగం కూడా అదే స్థాయిలో ముందుకు సాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో నిత్యం కళకళలాడే అనేక విమానాశ్రయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) చేరింది. వైజాగ్ (విశాఖపట్నం) నగరానికి సమీపంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా దీనిని అభివృద్ధి చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, భారీ కార్గో హ్యాండ్లింగ్, సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్.. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ పురోగతికి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదపడనుంది. కాగా ప్రయాణికుల రద్దీ పరంగా దేశంలో టాప్ టెన్గా నిలుస్తున్న ఆ ప్రధాన విమానాశ్రయాల వివరాలు..1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీదేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం.. ప్రయాణికులు, కార్గో రవాణా రెండింటిలోనూ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ప్రథమ స్థానంలో ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా ఉన్న ఈ ఎయిర్పోర్ట్ 5,106 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.2. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం , ముంబైప్రయాణికుల రద్దీ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పరంగా భారతదేశంలో రెండవ అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం ఇది. ముంబై నగరానికి ఉత్తరంగా 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది.3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరుకర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో మూడవ అత్యంత రద్దీ అయినది. బెంగళూరు నగర స్థాపకుడు కెంపేగౌడ I పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. 2008 మేలో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ 2023లో 37.2 మిలియన్ల ప్రయాణికులను చేరవేసింది. ఇది 4,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు, 2016లో కర్ణాటకలోనే తొలిసారిగా పూర్తిగా సౌరశక్తితో నడిచే విమానాశ్రయంగా ఇది రికార్డు సృష్టించింది.4. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం.. బేగంపేట విమానాశ్రయ స్థానంలో 2008 మార్చి 23న ప్రారంభమైంది. 5,500 ఎకరాల విశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న ఇది దేశంలో నాల్గవ అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. భారతదేశంలోనే తొలిసారిగా దేశీయ ఈ-బోర్డింగ్‌ను (2015) ప్రవేశపెట్టిన ఘనత దీని సొంతం.5. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నైతమిళనాడు రాజధాని చెన్నైలో సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం దేశంలో ఐదవ అత్యంత రద్దీ అయినదిగా, అంతర్జాతీయ ప్రయాణాల పరంగా మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ పాత మీనంబాక్కం టెర్మినల్ (కార్గో కోసం), తిరుశూలం వద్ద దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం టెర్మినల్స్ ఉన్నాయి.6. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్కతాతూర్పు భారతదేశంలోనే అతి పెద్దదైన ఈ విమానాశ్రయం కోల్‌కతాలో ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా ఇది ప్రారంభమయ్యింది. పలు దేశీయ విమాన సంస్థలకు ఇది ప్రధాన హబ్‌గా ఉంది. గతంలో వేర్వేరుగా ఉన్న టెర్మినల్స్‌ను 2018లో ఒకే సమీకృత టెర్మినల్‌గా మార్చారు.7. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్ జంట నగరాల నుంచి సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం రాష్ట్రంలోనే అతిపెద్దది. దేశంలో ఏడవ స్థానంలో అత్యంత రద్దీ అయినది. ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ, కార్గో సేవల కోసం వేర్వేరు టెర్మినల్స్ ఉన్నాయి.8. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కొచ్చికేరళలోని కొచ్చిలో ఉన్న ఈ విమానాశ్రయం కేరళలోనే అతిపెద్దది. రద్దీ అయినది. దేశీయ, అంతర్జాతీయ రాకపోకల కోసం దీనిలో ప్రత్యేకమైన టెర్మినల్స్ అందుబాటులో ఉన్నాయి.9. గోవా అంతర్జాతీయ విమానాశ్రయాలు గోవాలో ప్రస్తుతం రెండు విమానాశ్రయాలు ఉన్నాయి.దోబోలిమ్ విమానాశ్రయం: దక్షిణ గోవాలో నేవీ ఎయిర్‌బేస్ పరిధిలో సివిల్ ఎన్‌క్లేవ్‌గా నడుస్తోంది. ఇది 2023లో 8.5 మిలియన్లకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసింది.మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం: ఉత్తర గోవాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 2023 జనవరి 5న ప్రారంభించిన విమానాశ్రయం ఇది. ప్రారంభ సంవత్సరంలోనే ఇది 4.4 మిలియన్ల ప్రయాణికులను ఆకర్షించింది.10. పూణే అంతర్జాతీయ విమానాశ్రయం మహారాష్ట్రలోని పూణేలో గల లోహెగావ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలో సివిల్ ఎన్‌క్లేవ్‌గా ఈ విమానాశ్రయం పనిచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 9.5 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అత్యాధునిక నూతన టెర్మినల్ భవనం ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.ఇది కూడా చదవండి: స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు -
రికార్డు బ్రేక్ చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల టాప్ 20 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఆరు స్థానాలు పైకి ఎగిసిన ఈ ఎయిర్‌పోర్టు, 2017 జాబితాలో టాప్ 20లోకి చేరింది. జీఎంఆర్ గ్రూప్ నడిపే ఈ ఢిల్లీ విమానాశ్రయం 2016లో 22వ ర్యాంకును సాధించగా.. 2017లో 16వ ర్యాంకును సాధించినట్టు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) ప్రకటించింది. ప్రయాణికుల రద్దీలో ఈ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా ఉందని పేర్కొంది. ఈ ర్యాంకింగ్‌లను 2017లో అత్యంత ఎక్కువగా ప్రయాణించిన ఎయిర్‌పోర్ట్‌ల ప్రిలిమినరీ ప్యాసెంజర్ ట్రాఫిక్ ఫలితాలను బట్టి ఏసీఐ విడుదల చేసింది. ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో ఏడాది ఏడాదికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ 14.1 శాతం వృద్ధిని నమోదుచేసిందని తెలిపింది. ప్రస్తుతం 63.45 మిలియన్ల ప్యాసెంజర్ ట్రాఫిక్‌ను(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) ఈ ఎయిర్‌పోర్టు కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఢిల్లీ మాత్రమే కాక కోల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు కూడా ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టులుగా ఉన్నాయని ఏసీఐ తెలిపింది. కాగ, ఏసీఐ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్‌లో తొలి స్థానంలో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 103 మిలియన్ ప్యాసెంజర్లతో(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) అగ్ర స్థానంలో ఉంది. 2016 కంటే 0.3 శాతం ట్రాఫిక్ వాల్యుమ్ తగ్గినప్పటికీ, ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో ఇదే ముందంజలో ఉండటం విశేషం. ప్రపంచంలోని ఎయిర్‌పోర్టులకు ఏసీఐ ట్రేడ్ అసోసియేషన్. ప్రస్తుతం 176 దేశాల్లో 1953 ఎయిర్‌పోర్టుల నుంచి 641 మెంబర్లను ఇది కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఎయిర్‌పోర్టుల ర్యాంకులతో పాటు, అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఏయే దేశాలు ఉండబోతున్నాయో ఏసీఐ అంచనాలు వెలువరిచింది. 2020 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఉండబోతుందని ఏసీఐ అంచనావేస్తోంది. -
ముంబై ఎయిర్‌పోర్టు చాలా రద్దీ గురూ..
► ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం ► ప్రతి 65 సెకండ్లకో విమానం ముంబై: ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుగా ముంబై పేరు పొందింది. ప్రపంచంలో రద్దీ విమానాశ్రయాల్లో లండన్, గట్విక్లను దాటి మొదటి స్థానానికి వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ఒకే ఒక రన్‌వే ఉంది. ఇక్కడ ప్రతి 65 సెకండ్లకు ఓ విమానం ఎగరడమో, దిగటమో జరుగుతోంది. కార్గో విమానాలకు, ప్రయాణ విమానాలకు ఒకే రన్‌వే ఉండటంతో అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరుపొందింది. ప్రపంచంలోని పెద్ద విమానాశ్రయాలు ఢిల్లీ, దుబాయి, సింగపూర్, సిడ్నీ, లండన్, న్యూయార్క్‌ల్లో టేకాఫ్ ఒక రన్‌వే, లాండింగ్‌కు మరో రన్వేలు ఉన్నాయి. కానీ ముంబైలో ఒకే రన్‌వే గుండా టేకాఫ్, లాండింగ్ చేయాల్సి ఉంది. అందులో ఒకటి 927 మీటర్లు ఉన్న ప్రధాన రన్‌వే.. ఎప్పుడైన ఇది మరమ్మత్తులకు గురైతే రెండో 1432 మీటర్లు పొడవున్న రన్‌వేను ఉపయోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగింపు 2017 మార్చి 31 నాటికి ముంబై ఎయిర్పోర్టుగుండా 45.2 మిలియన్ల మంది ప్రయాణించారు. రోజుకు సుమారు 837 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున అత్యంత రద్దీ విమానాశ్రయం గట్విక్ (757) తో పోలిస్తే సుమారు 80విమానాలు ఎక్కువగా ఉన్నాయని సీనియర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతి రెండు అరైవల్స్(ఆగమనం)కి 130 సెకండ్ల టైంను కేటాయిస్తున్నారు. వీటి మధ్యలో ఒక డిపార్చర్ ను ఇస్తున్నామని ఆయన అన్నారు.


