breaking news
	
		
	
  Brazilian President
- 
      
                   
                                                       బొల్సొనారోకు 27 ఏళ్ల జైలుబ్రెసీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. 2022లో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్వహించిన జాతీయ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, దేశంలో సైనిక తిరుగుబాటుకు కుట్ర చేశారని, ఎన్నికల్లో తనపై గెలిచిన అధ్యక్ష అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారని బొల్సొనారోపై మోపిన అభియోగాల్లో ఆయనను సుప్రీంకోర్టు శుక్రవారం దోషిగా తేలి్చంది. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు బొల్సొనారోను దోషిగా తీర్పు చెప్పగా, ఒకరు ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. జైలు శిక్షతోపాటు బొల్సొనారో 2060 సంవత్సరం వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయరాదని కోర్టు నిషేధం విధించింది. అంటే ఆయన శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా మరో 8 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేయటానికి అవకాశం ఉండదు. 2022 నాటి ఎన్నికల్లో బొల్సొనారోపై వామపక్ష కూటమి అభ్యరి్థ, ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా విజయం సాధించారు. ఆ ఎన్నికల ఫలితాలను ఒప్పుకునేందుకు బొల్సొనారో తిరస్కరించటంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2023 జనవరి 8న బొల్సొనారో మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసాత్మక దాడులకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బొల్సొనారోపై దర్యాప్తు చేపట్టింది. కొద్దిరోజుల క్రితమే ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై మోపిన అభియోగాలను బొల్సొనారో తిరస్కరించారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని ప్రకటించారు. తన తండ్రిపై మోపిన కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగమని బొల్సొనారో చిన్నకుమారుడు, బ్రెజిల్ సెనేటర్ ఫ్లావియో బొల్సొనారో ఆరోపించారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని బొల్సొనారో తరఫు న్యాయవాదులు తెలిపారు. కాగా, బొల్సొనారోకు జైలు శిక్ష విధించటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. కోర్టు తీర్పు అన్యాయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. దీనిపై అమెరికా తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు. బ్రెజిల్‌పై అమెరికా ఇప్పటికే 50 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
- 
      
                   
                                 భారత్‌లో బ్రెజిల్ అధ్యక్షుడున్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి.
- 
      
                   
                                 దేశాధ్యక్షుడికి దెయ్యాల భయం!
 రియో డి జెనిరో :
 బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్‌కు దెయ్యాల భయం పట్టుకుంది. దీంతో వెంటనే తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశ ఉపాధ్యక్షుడి అధికార నివాసంలోకి మారారు. అధ్యక్ష భవనంలో అడుగు పెట్టినప్పటి నుంచి కంటి నిండా నిద్రలేకుండా పోయిందని, ఆ భవంతి ఎంత విలాసవంతంగా ఉన్నా అందులో అసాధారణమైనవి ఏమో ఉన్నట్టు మైఖేల్ టెమర్ పేర్కొన్నారు. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
 
 బ్రెజిల్ అధ్యక్షుడి అధికార నివాసమైన అల్వొరాడా ప్యాలెస్ భయానకంగా ఉండటంతో అక్కడి నుంచి దేశ ఉపాధ్యక్షుడి భవనమైన జబురు ప్యాలెస్‌కు మకాం మార్చారు. తన భార్య మార్సెలా కూడా అధ్యక్షభవంతి వింతగా అనిపిస్తోందని తెలిపినట్టు టెమర్ పేర్కొన్నారు. దిల్మారౌసెఫ్ రోసెఫ్ సస్పెండ్ అయిన తర్వాత మైఖేల్ టెమర్ బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
- 
  
      గోవాకు చేరిన బ్రెజిల్ ప్రెసిడెంట్ మైకెల్


