
బ్రెజిలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సో నారోకి జైలు శిక్ష పడింది. బ్రెజిల్ కోర్టు.. 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక కుట్ర కేసులో బోల్సో నారోకి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల ప్యానెల్ ఈ శిక్షను ఖరారు చేసింది. 2022 ఎన్నికలలో తన ప్రత్యర్థి, వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్ర పన్నినట్లు తేలడంతో కోర్టు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అశ్చర్యం వ్యక్తం చేశారు. బోల్సో నారోకు ట్రంప్ మద్దతు ప్రకటించారు.
2022లో బ్రెజిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన బోల్సోనారోపై.. ఆ సమయంలో దేశంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దురాక్రమణకు దిగిన బోల్సోనారో మద్దతుదారులు రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఈయనతో పాటు పాటు మరో 33 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్‌లో విచారణ జరిపింది. కుట్ర నిజమని తేలడంతో బ్రెజిల్ శిక్ష ఖరారు చేసింది.
