breaking news
Bommala koluvu
-
అకేషన్ ఏదైనా సరే.. బొమ్మలతో కళ
బొమ్మలు మాట్లాడవు.తమ గురించి మాట్లాడేలా చేస్తాయి.అలా మాట్లాడాలంటే ఆర్టిస్ట్‌లో అద్భుత సృజన ఉండాలి. అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆమదాలవలసకు చెందిన ప్రియాంక.శుభకార్యాలకు తగ్గట్టు రకరకాల థీమ్స్‌తో బొమ్మల సిరీస్ రూపొందిస్తూ పాతకళకు కొత్త కళ తీసుకువస్తోంది ప్రియాంక...‘చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో బొమ్మలే నా బతుకు బండిని నడిపిస్తాయని నేను అసలు ఊహించనే లేదు’ అంటుంది ప్రియాంక. బొమ్మల ద్వారా నేటి తరానికి సంప్రదాయ విలువలను వివరించడంలో ఆనందం ఉందంటారు ఆమె. తన మనసులో మెదిలిన ఊహకు సృజనాత్మకంగా ప్రాణం పోస్తూ, బొమ్మలను థీమ్‌కు తగ్గట్టు రూపొందిస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది ప్రియాంక. ఆ బొమ్మలు సనాతన సంప్రదాయాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. కనుమరుగ వుతున్న కళలు కళ్లముందు కనబడతాయి.అనుబంధాల రైలుబండికాంక్రీట్ జంగిల్లో న్యూక్లియిర్ ఫ్యామిలీల నడుమ దూరమవుతున్న అనుబంధాలు ప్రియాంక తయారుచేసే బొమ్మలతో గుర్తుకు వస్తాయి. ఆమదాలవలసకు చెందిన ఒక పెద్దాయన 60వ పుట్టిన రోజు వేడుకను భిన్నంగా చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచించారు. ప్రియాంకకు విషయాన్ని వివరించారు. అరవై ఏళ్లలో జరిగిన ఘట్టాలను అద్భుతమైన రీతిలో బొమ్మల రూపంలో కళ్లకు కట్టేలా తీర్చిదిద్దింది ప్రియాంక. అన్నప్రాసన వేడుక నుంచి పదవీ విరమణ వేడుక వరకు... ఆ పెద్దాయన జీవితంలోని వివిద దశలను చిన్న రైలుబండి మాదిరిగా బొమ్మల్లో తయారు చేసి శభాష్ అనిపించుకుందిజచదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్తాళికట్టు శుభవేళపలాసకు చెందిన ఒక వ్యాపారి నూతన గృహ ప్రవేశ వేడుకను భిన్నంగా చేయాలనుకున్నాడు. కాన్సెప్ట్‌ను వివరించాడు. బిల్డింగ్ నమూనా నుంచి సత్యనారాయణ వ్రతం, గో మాత ప్రవేశంతో సహా అన్నింటిని చక్కని బొమ్మలతో కళ్లకు కట్టింది ప్రియాంక. శుభకార్యానికి వచ్చిన అతిథులంతా ఈ థీమ్‌ను చూసి భలే ముచ్చట పడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఒక కార్పొరేట్ బ్యాంక్‌లో నవరాత్రి పూజలు నిర్వహించాలని బ్యాంక్ సిబ్బంది భావించారు. రెండు రోజులు కష్టపడి నవరాత్రి వేడుకల థీమ్‌ను తయారు చేసి బ్యాంక్‌ను లక్ష్మీనిలయంగా మార్చింది ప్రియాంక. వివాహ వేడుకకు ప్రారంభ ఘట్టమైన గోధుమరాయి కార్యక్రమం నుంచి తాళికట్టు శుభవేళ వరకు తయారు చేసిన వెడ్డింగ్ సెట్ ప్రియాంక స్పెషల్. ఆ సెట్ చూస్తే మన కళ్లముందే పెళ్లి జరిగినంత సంబరం మన సొంతం అవుతుంది.చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఇదే నా ప్రపంచంచిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా బొమ్మలను వదల్లేదు. అమ్మ సాయంతో వాటిని చక్కగా అలంకరించడం చిన్నప్పటి నుంచి నా అలవాటు. డిగ్రీ పూర్తయింది. ఉపాధి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. బొమ్మలతోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆలోచనలను నాన్నతో పంచుకున్నాను. ఆయన ప్రోత్సహించారు. వర్క్‌షాపులో కొంత భాగం నన్ను వినియోగించుకోమన్నారు. ఆర్టిస్టిక్‌గా షోరూమ్‌ను సిద్ధం చేశారు. విభిన్న రకాల థీమ్‌లను సిద్ధం చేశాను. సోషల్ మీడియా వేదికగా నేను తయారుచేసిన బొమ్మలను, ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టాను. ఆర్డర్లు పెరిగాయి. బొమ్మల ద్వారా సంప్రదాయాల్ని వివరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – ప్రియాంక– దువ్వూరి గోపాలరావు,సాక్షి, శ్రీకాకుళంఫొటోలు: జయశంకర్ కుప్పిల -
దసరా బొమ్మల కొలువు (ఫోటోలు)
-
శ్రీవారి బొమ్మల కొలువు
దేవీశరన్నవరాత్రి, దసరా ఉత్సవాల్లో భాగంగా.. కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు గురువారం తమ ఇళ్లల్లో తమిళ సంస్కృతిలో శ్రీవారి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని శ్రీరంగం, తిరుచురాపల్లికి చెందిన కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. తమ ఇళ్లల్లో వివిధ రూపాల్లో విష్ణుమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అని వారు తెలిపారు. – కేసముద్రం -
‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల
‘రఘువరన్ బి.టెక్’తో సినీ రంగ ప్రవేశం చేసిన మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ తమ్ముడు రిషికేశ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మల కొలువు’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్‌గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో రుద్ర అనే పాత్రను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెషల్ థాంక్స్. సినిమాలంటే ఉండే ప్యాషన్‌తో సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. -
దీపావళి లోగిలిలో అందమైన బొమ్మల కొలువు
చీకట్లను చీల్చి వెలుగునిచ్చే పండుగగా దీపావళిని జరుపుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే. దీపావళి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో బొమ్మలకొలువును ఆనవాయితీగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ బొమ్మల కొలువు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఈతరం పిల్లలకు భారతీయ ధర్మం పట్ల అవగాహన, అభిరుచిని పెంపొందింస్తారు. అలాగే పురాణ, ఇతిహాసాలను కథల రూపంలో పిల్లలకు తెలియజేస్తూ భారతీయ సంప్రదాయంపై గౌరవం కలిగేలా చూస్తారు. బొమ్మల కొలువును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. నరక చతుర్దశి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేసి దీపావళి మరుసటి రోజు సాయంత్రం వరకు దీనిని నిర్వహిస్తారు. బొమ్మలు కొలువు పెట్టే విధానం : బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది. బొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. గౌరమ్మ పూజ అనంతరం కలశం ఏర్పాటు చేసి తమ వద్ద ఉన్న వివిధ బొమ్మలను వరుస క్రమంలో అలంకరిస్తారు. అనంతరం చక్కెర పొంగలి, పేనీలు, పసుసు, కుంకుమ నైవేద్యంగా సమర్పిస్తారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ పండులను బొమ్మలకొలువు రూపంలో ఏర్పాటు చేసి వాటి విశిష్టతను తమ పిల్లలకు కథల రూపంలో వివరిస్తారు. తమ చుట్టపక్కల ఉండే మహిళలను, పిల్లలను పిలిచి తమ బొమ్మల కొలువును చూపి వారికి వాయినాన్ని అందజేస్తారు. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవి పూజను నిర్వహించి బొమ్మల కొలువు చుట్టూ దొంతులనూ ఏర్పాటు చేసి నువ్వులనూనెతో మాత్రమే దీపాలను వెలిగిస్తారు. ఇక మూడో రోజున ఐదుగురు ముల్తైదలను పిలిచి వారికి పసుపు, కుంకుమలను వాయినంగా సమర్పించి , అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడంతో కార్యక్రమం ముగుస్తుంది. -
విశాఖలో బొమ్మల కొలువు
-
అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు
సాక్షి, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, ఆశీర్వచన మండపంలో బొమ్మల కొలువు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల సందడి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో బొమ్మల కొలువు
సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో దసరా బొమ్మల కొలువు సందడి చేస్తోంది. గత రెండేళ్లుగా ఎయిర్‌పోర్టు అధికారులు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల నుండి అనూహ్య స్పందన రావడంతో ఈ సంవత్సరం కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భారతదేశపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. విదేశీయులు బొమ్మల కొలువు గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇక సెల్ఫీలకైతే కొదువేలేదు. సాయంత్రం నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. దసరా ముగిసే వరకూ ఈ బొమ్మల కొలువు ఉంటుందని ఎయిర్‌పోర్టు ముఖ్య అధికారి సజీత్ తెలిపారు. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె: శేషాచలం ప్రాంతమైన కడప, చిత్తూరు జిల్లా సరిహద్దు సరిహద్దు మండలాలయిన సుండుపల్లె మండలం పింఛా ప్రదేశం బొమ్మల కనుమ ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి రాజంపేట, పీలేరు, సానీపాయి ఫారెస్టు అధికారులు నిఘా పెట్టగా 40 ఎర్రచందనం దుంగలు, ఈచర్ వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని రాజంపేట ఫారెస్టు కార్యాలయానికి (ఠానా) తరలించినట్లు విశ్వసనీయ సమాచరం. అదే విధంగా ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
విశాఖలో సందడి చేస్తున్న బొమ్మల కొలవు


