breaking news
bharathi cements
-
DSC స్కామ్ నుంచి డైవర్ట్ చేసేందుకు.. భారతి సిమెంట్స్ పై బాబు కుట్ర
-
నోరు తెరిస్తే అబద్దాలు!
సాక్షి, అమరావతి: తప్పు అంటూ సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా మందలించింది.. మంచి పద్ధతి కాదంటూ మొట్టికాయలేసింది. కరువు సీమలో ఉపాధి కల్పిస్తూ..చట్టబద్ధంగా అన్ని అనుమతులతో కార్యకలాపాలు నడుపుతూ ప్రభుత్వానికి వేల కోట్ల పన్నులు చెల్లిస్తున్న ప్రతిష్టాత్మక సిమెంట్ కంపెనీ భారతి సిమెంట్స్‌ను అడ్డుకోవడం తగదని హైకోర్టు హితవు పలికింది. అయినా చంద్రబాబు అండ్ కో తీరు మారలేదు. కోర్టు తీర్పుతో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ తప్పు సరిదిద్దుకోవాలన్న తలంపు లేదు. కళ్లార్పకుండా కమిట్మెంట్తో తాను అబద్దాలు ఆడినట్లే తమ పార్టీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డితో కూడా చంద్రబాబు అబద్ధా్దలు చెప్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కేసుపై రాద్ధాంతం చేయిస్తున్నారు.. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి లేబర్ కోర్టులో ఓడిపోయిన ఆ కేసుపై ఇప్పుడు నాటకాలేమిటని కార్మికులే ఆశ్చర్యపోతున్నారు.. మైనింగ్ ఇబ్బందికరంగా మారిందని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టీడీపీ నేతలు కట్టుకథలు అల్లుతున్నారు. ఇవన్నీ డ్రామాలేనని ప్రజలకు అర్థమవుతూనే ఉంది...ప్రజలు గుండెల్లో పెట్టుకున్న కంపెనీ..భారతి సిమెంట్స్ సంస్థ 18 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. అక్కడి ప్రజల సహకారం, అభిమానం లేకపోతే ఒక కంపెనీ ఇంతకాలం ఇంత విజయవంతంగా నడవడం సాధ్యమయ్యే పనేనా? హైకోర్టు చెప్పినట్లు.. కరువు ప్రాంతంలో వచ్చిన ఈ కంపెనీ అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 15 వేల కుటుంబాలలో వెలుగులు నింపింది. అందుకే ప్రజలు ఈ కంపెనీని గుండెల్లో పెట్టుకున్నారు. భారతి సిమెంట్స్ కంపెనీ పట్ల ప్రజల అవ్యాజమైన అభిమానానికి మరో కారణం కూడా ఉంది.సాధారణంగా పరిశ్రమల కోసం భూమి సేకరిస్తే పరిహారం ఇవ్వడంతోనే.. రైతులకు, పారిశ్రామికవేత్తలకు అక్కడితో సంబంధం ముగిసిపోతుంది. కానీ పేదల కష్టాల గురించి తెలిసిన.. అందరికీ చేతనైనంత సాయం చేయాలని అహరహం తపించే వైఎస్ జగన్మోహన్రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. భారతి సిమెంట్స్ కోసం భూములిచ్చిన రైతులందరికీ మరలా ఎకరానికింత అని లెక్కగట్టి అదనంగా డబ్బులిచ్చారు. ఒక రేటు కట్టి భూమికి డబ్బు ఇచ్చేసిన తర్వాత మరలా డబ్బు ఇచ్చిన పారిశ్రామికవేత్త బహుశా ఎవరూ ఉండరేమో.. ప్రజలంటే జగన్‌కు ఎంత అభిమానమో..జగన్ పట్ల ఆ ప్రాంత ప్రజల్లో కూడా అంత గుడ్‌విల్ ఉంది. అందుకే జగన్‌ను, భారతి సిమెంట్స్ సంస్థను అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి సంస్థపై అభాండాలు వేస్తే ఎవరైనా నమ్ముతారా....వీగిపోయిన అబద్ధపు కేసుతో ఏం సాధిస్తారు? ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పచ్చ ముఠాల ప్రోద్బలంతో 10మంది వర్కర్లు అప్పటి సీఈవోపై దాడి చేశారు. ఆ కేసులో సీసీటీవీ ఫుటేజి సహా అన్ని సాక్ష్యాధారాలూ స్పష్టంగా ఉన్నాయి. దానిపైన లేబర్ కోర్టులో వేసిన కేసులో ఓడిపోయారు కూడా.. కొందరు కార్మికులను ఉసిగొల్పి దాడిచేయించి ఆ తర్వాత కేసుపెట్టి ఏదో సాధించాలనుకున్న వారు అలా దెబ్బతిన్నారు.. మరలా ఇప్పుడు ఆ కేసునే పట్టుకుని అదే కార్మికులను ముందుపెట్టి వాళ్లను రెచ్చగొడుతూ గొడవ నడిపిస్తున్నారు. ఇది చాలదన్నట్లు మైనింగ్ చేస్తుంటే శబ్దాలు వస్తున్నాయంటూ కొత్త కట్టుకథలు మొదలుపెట్టారు. 18 ఏళ్లుగా లేని సమస్యలు ఇపుడు కొత్తగా వచ్చాయా? మీరెన్ని అబద్ధాలు ప్రచారం చేయాలనుకున్నా స్థానికులకు వాస్తవాలు తెలియవా..? ఇవన్నీ డ్రామాలేనని అర్ధం కావడం లేదూ..?పెట్టుబడిదారులకు స్వర్గధామమా..?భారతి సిమెంట్స్, భారత్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ సంస్థ వికాట్ గ్రూప్‌పై చంద్రబాబు సర్కార్ పగబట్టినట్లు వ్యవహరిస్తుండడంపై పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలోని బెస్ట్ సిమెంట్ కంపెనీలలో ఒకటైన వికాట్ గ్రూప్‌తో అనుబంధమున్న భారతి సిమెంట్స్ వంటి సంస్థ కార్యకలాపాలనే ఇలా కక్షసాధింపుతో అడ్డుకుంటుంటే... రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. చట్టబద్దమైన వ్యాపార సంస్థలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇలా కక్షసాధించడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాక్స్ రూపంలో రూ.7,300 కోట్లు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్, వికాట్ వంటి సంస్థలను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేమిటి అని పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైజాగ్‌లో గ్రైండింగ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించుకున్నా వికాట్ సంస్థ ఇదే కారణంతో ఆ ఆలోచనను ఉపసంహరించుకుందని వారు గుర్తుచేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత ప్రభుత్వ హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెబుతున్న చంద్రబాబు చేస్తున్నదేమిటి? ఎమ్మెల్యేలను ముందుపెట్టి వారిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు అండ్ కో తీరు వల్లే రాష్ట్రం నుంచి పలు కంపెనీలు పలాయనం చిత్తగిస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ కంపెనీ బైబై చెప్పేసింది.. హిందుస్థాన్ కోకోకోలా, ఆజాద్ మొబిలిటీ, జూపిటర్, జిన్ఫ్రా, ఐస్పేస్ లాంటి సంస్థలు కూడా వెళ్లిపోయాయి. -
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకులా?
‘భారతి సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారు రూ. 7,300 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడం, రాకపోకలను నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాలి. భారతి సిమెంట్స్ ప్రాంగణం సమీపంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు చూడాలి’.– హైకోర్టుసాక్షి,అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక, విచ్ఛిన్నకర శక్తులను అడ్డంపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతి సిమెంట్స్‌ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి భారతి సిమెంట్స్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసేందుకు అడుగడుగునా సహకరించిన పోలీసులకు సైతం హైకోర్టు తలంటింది. వైఎస్సార్ కడప జిల్లా, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలోని నల్లలింగాయపల్లె గ్రామంలో ఉన్న ‘భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్’కు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ఉద్యోగులు, ముడిసరుకుతో పాటు ఇతర సరుకులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసులకు తేల్చి చెప్పింది. అంతేకాక కంపెనీ చట్టబద్ధమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగేలా చూడాలని కూడా స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ పరిశ్రమ ఆవరణ సమీపంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, తమ చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని భారతి సిమెంట్స్‌ను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి పిటిషనర్ కంపెనీ సాధ్యమైనంత వరకు తన విచక్షణను ఉపయోగించవచ్చునని తెలిపారు.పోలీసుల ఉదాసీనతపై హైకోర్టులో భారతి సిమెంట్స్ పిటిషన్...వైఎస్సార్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాŠంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.భారతి సిమెంట్స్ కరువు పీడిత ప్రాంతంలో ఉపాధి కల్పిస్తోంది...‘భారతి సిమెంట్స్ ప్రాథమికంగా 2007 నుండి చట్టబద్ధ, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని ముందస్తు అనుమతులను పొంది తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా, ఇది కరువు పీడిత ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో దాదాపు రూ. 7,300,00,00,000 చెల్లిస్తూ రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు తోడ్పడుతోంది.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.దేశ సమగ్ర అభివృద్ధికి పారిశ్రామిక శాంతి చాలా అవసరం...‘పారిశ్రామిక శాంతి అనేది దేశ సమగ్ర అభివృద్ధికి, భారతి సిమెంట్స్‌కి, అలాగే దాని వాటాదారులు (శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు) అందరికీ చాలా అవసరం. ఎటువంటి చట్టపరమైన కారణం లేకుండా భారతి సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అకస్మాత్తుగా, బలవంతంగా అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం సరికాదు. ఇలాంటి చర్యలను ఆదిలోనే అరికట్టాలి. ఎందుకంటే ఇది యజమాని, ఉద్యోగులు, వారి కుటుంబాలు, రాష్ట్ర ఖజానాపై వినాశకరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చట్ట ప్రకారం తమ అధికార పరిధిలో శాంతి భద్రతలను కాపాడవలసిన చట్టబద్ధమైన బాధ్యత పోలీసులపై ఉంది. ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు.’ అని జస్టిస్ మహేశ్వరరావు తెలిపారు.అన్ని అనుమతులతో భారతి సిమెంట్స్ నడుస్తోంది...‘భారతి సిమెంట్స్ మైనింగ్ శాఖతో సహా అన్ని శాఖల ముందస్తు అనుమతులతో నడుస్తున్న కంపెనీ. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదు. కంపెనీ రాకపోకలకు, ఉత్పత్తికి, ఇతర చట్టబద్ధమైన కార్యకలాపాలకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు లేవనేది కూడా స్పష్టం. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి అనుచరులు కంపెనీ కార్యకలాపాలను, వాహనాలు, ఉద్యోగులు, అధికారులు, మెటీరియల్స్ రాకపోకలను అడ్డుకోకుండా భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.’ అని ఆయన తెలిపారు.చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత...‘నేరాలను అరికట్టడం, శాంతిభద్రతల విఘాతానికి దారితీసే పరిస్థితులను అదుపు చేయడం, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, హింస, బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. ప్రజా శాంతికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి చట్టవిరుద్ధమైన పనులను నిరోధించడం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ప్రజలు తమ చట్టబద్ధమైన కార్యకలాపాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకునేలా చూడడమే పోలీసుల ప్రధాన విధి.’ అని తేల్చి చెప్పారు.ప్రజా సంక్షేమమే సర్వోత్కృష్ట చట్టం..‘ప్రజా సంక్షేమమే అన్నింటి కన్నా గొప్ప చట్టం. న్యాయస్థానాలు తమ న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు సమాజ విస్తృత ప్రజా ప్రయోజనాలను, సంక్షేమాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత హక్కులు, సమాజ చట్టబద్ధ ప్రయోజనాలు రెండింటినీ కూడా కోర్టు విస్మరించరాదు. వాటి మధ్య తగిన సమతుల్యతను పాటించాలి. భారతి సిమెంట్స్ కంపెనీ స్పష్టమైన ఫిర్యాదులు చేసినప్పటికీ, శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి సంబంధిత పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనేది ఈ కేసులోని కీలక అంశం. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా వేగంగా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.కంపెనీకి రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నష్టం....సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనను క్లుప్తంగా చెప్పాలంటే, పోలీసులు, కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నివసిస్తున్న శాశ్వత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీ రోజుకు రూ. 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు నష్టపోతోందని, ఇది రాష్ట్ర ఖజానాకు, శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు.యజమానులు పోలీసు రక్షణ కోరవచ్చు.. కేరళ హైకోర్టు తీర్పు‘పారిశ్రామిక శాంతిని కాపాడేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు తన అధికారాన్ని ఉపయోగించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వవచ్చా లేదా అనే కోణంలో కోర్టులు వెల్లడించిన చట్టపరమైన తీర్పులను పరిశీలించడం ఎంతైనా అవసరం. రాఘవన్ వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసులో కేరళ హైకోర్టు విస్తృత తీర్పునిస్తూ... యజమానులకు, కార్మికులకు నడుమ వివాదాల పరిష్కారానికి లేబర్ చట్టాలు ఉన్నప్పటికీ, శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు యజమానులు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించి పోలీసు రక్షణ కోరవచ్చునని తెలిపింది. సమ్మె చేస్తున్న కార్మికులు యజమానిని లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులను అడ్డుకున్నప్పుడు, పూడ్చుకోలేని నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు కూడా యజమానులు హైకోర్టుకు రావొచ్చునని కేరళ హైకోర్టు చెప్పింది.’ అని జస్టిస్ మహేశ్వరరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పోలీసు రక్షణకు ఆదేశాలివ్వవచ్చు.. మద్రాసు హైకోర్టు‘అదే విధంగా, తమిళనాడు హైకోర్టు కూడా ఎస్ఎన్వై ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసులో ఫ్యాక్టరీ నిర్వహణపై శాంతిభద్రతల ప్రభావం పడినప్పుడు ఆర్టికల్ 226 కింద హైకోర్టు పోలీసు రక్షణకు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేయవచ్చని, అయితే ఫ్యాక్టరీపై, తోటి కార్మికులపై లేదా మెటీరియల్ తరలింపు విషయంలో హింసకు, బెదిరింపులకు పాల్పడటం, రాకపోకలకు ఆటంకాలు సృష్టించడం వంటివి చేయరాదని ఆ హైకోర్టు స్పష్టం చెప్పింది. పోలీసు రక్షణ అనేది కేవలం శాంతిని కాపాడటానికి, చట్టబద్ధమైన రాకపోకలకు మాత్రమేనని, వారి మధ్య ఉన్న పారిశ్రామిక వివాదాన్ని హైకోర్టు పరిష్కరించదని స్పష్టం చేసింది.’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు.రాష్ట్రానికి లబ్ది చేకూర్చే పరిశ్రమను మూసివేసేలా చేయకూడదు‘ఇండియన్ సిమెంట్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రాథమిక విధి ఇదే హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, పన్నుల రూపంలో రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్న పరిశ్రమను, కార్మికుల నిరసనల కారణంగా మూసివేసేలా చేయకూడదు. కాంట్రాక్ట్ కార్మికులకు తమ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు లేదా డిమాండ్లు ఉంటే, వారు లేబర్ కోర్టు లేదా సంబంధిత లేబర్ అథారిటీ వద్ద తగిన పరిష్కారం కోరాలి. హింస, ఆటంకాలు, అలజడులను నిరోధించి, పరిశ్రమ తన చట్టబద్ధమైన కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా చూసేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వును ఇదే హైకోర్టుకు చెందిన మరొక సింగిల్ జడ్జి కూడా అనుసరించారు. అందువల్ల, పారిశ్రామిక శాంతికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద ఈ కోర్టుకు విస్తృత అధికారాలున్నాయి.’ అని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తేల్చి చెప్పారు. -
ఇది రాజకీయశక్తుల కుట్ర!
సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్‌స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్‌లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్‌స్టోన్ లోపలికి వెళితే, సిమెంట్ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. 10మంది ఆందోళన చేస్తున్నారు... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? ఇందుకు సీవీ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు -
అంతులేని అరాచకం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గమేముంటుంది? రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీ సిమెంట్స్‌పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో ఆరురోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీ సిమెంట్స్‌ను మూతపడేలా చేయడమే లక్ష్యమన్నట్లు టీడీపీ గూండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు 15 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు యూనిట్లు మూతపడ్డాయి. మైనింగ్ ప్రాంతంలోకి కార్మికులను, వాహనాలను పోనీయకుండా అడ్డుకుంటున్న పచ్చముఠాలు అక్కడ రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల దన్నుతో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరుల ముసుగులో గూండాలు, రౌడీషీటర్లు ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం తమవంతు సహకారం అందించాలి. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లడం లేదు. అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంటుకు రావాల్సిన ముడి ఖనిజాన్ని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతూనే ఉన్నారు.ఆరురోజులుగా మైనింగ్‌కు అడ్డుకట్ట..భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం గడిచిన ఆరు రోజులుగా పలుమార్లు మైనింగ్ ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా టీడీపీ గూండాలు రేయింబవళ్లు మైనింగ్ ప్రాంతంలోనే తిష్టవేసి మరీ అడ్డుకుంటున్నారు. కార్మికులు భయపడ్డట్లే భారతి సిమెంట్ పరిశ్రమలో శనివారం నుంచి సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్లాంటులో ఉన్న సున్నపురాయి నిల్వలు కూడా నిండుకున్నాయి. మైనింగ్ నిర్వహించి, సున్నపురాయిని ప్లాంటుకు తరలించకపోతే, ప్లాంటులో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని నాలుగు రోజులుగా భారతి సిమెంట్స్ యాజమాన్యం అధికారులకు వివరిస్తూనే ఉంది. అయినప్పటికీ జిల్లా అధికారులకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ప్లాంటులో ముడిఖనిజం లేక సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది.15వేల కుటుంబాలపై ప్రభావం..గత 17సంవత్సరాలుగా భారతి సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు.. ప్రత్యక్షంగా 3వేల మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి పొందుతున్న పరిశ్రమపై చంద్రబాబు సర్కార్ కక్షబూనింది. పరిశ్రమ అంతర్భాగంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుని, భారతీ సిమెంట్స్ మూతపడేలా చేయాలన్నదే సీఎంఓ లక్ష్యమన్నట్లు కనిపిస్తోందని అధికారవర్గాలలోనూ చర్చ నడుస్తోంది. తాము చేయగలిగింది ఏమీ లేదని, పైనుంచి వస్తున్న వత్తిడి వల్లే ఏమీ చేయలేకపోతున్నామని జిల్లా అధికారల్లో చర్చ జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల 15వేల మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. -
భారతి సిమెంట్స్ వద్ద ఆగని టీడీపీ మూకల దౌర్జన్యం
కడప: ఏపీ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతి సిమెంట్స్)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. నాలుగు రోజులుగా టీడీపీ మూకలు చేస్తున్న దౌర్జన్యంతో కాప్టివ్ మైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.మైన్‌లోకి వాహనాలు వెళ్లకుండా టీడీపీ మూకలు పదే పదే అడ్డుకుంటున్నాయి. సున్నపురాయి సరఫరా జరగకుండా భారతి సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునే కుట్రకు తెరలేపారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్సీ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో భారతి సిమెంట్స్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో ఉత్పత్తి ఆగిపోతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 15 వేల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విషయం అర్థమవుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదంటే చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందా? అనే అనుమానం కలగమానదు.పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలనే పణంగా పెడతారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ తరహా దాడులకు ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పుతున్నారని అభిప్రాయపడుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపుపై భారతి సిమెంట్స్ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) న్యాయ పోరాటానికి దిగింది. అధికార పార్టీకి చెందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తన అనుచరుల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకుంటున్నా కనీస స్థాయిలో కూడా స్పందించకుండా చోద్యం చూస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీసుల ఉదాసీనతపై హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ గుండాలు గత మూడు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి సున్నపురాయి తవ్వకాలను అడ్డుకుంటూ, తద్వారా ఉత్పత్తిని ఆపి కంపెనీని దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలను మొత్తం అడ్డుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్స్ అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు ‘భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద సిమెంట్ తయారీ ఫ్యాక్టరీ, సున్నపురాయి గనిని నిర్వహిస్తోంది. కంపెనీ మ్యాన్‌పవర్ కాంట్రాక్టర్ అయిన ‘మెసర్స్ వైష్ణవి అసోసియేట్స్’ ద్వారా పనుల్లోకి వచ్చిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ నిర్వహించిన క్రీడా పోటీలలో తీవ్ర గొడవలు సృష్టించారు. దీనిని తీవ్ర క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన కాంట్రాక్టర్ వారిని పని నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన కార్మికులు ఫ్యాక్టరీ వద్ద గొడవలు చేస్తామని బెదిరించడంతో, కంపెనీ యాజమాన్యం పోలీసుల రక్షణ కోరింది.అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 28న భారతి సిమెంట్స్ కమలాపురం జూనియర్ సివిల్ కోర్టులో సస్పెండ్ అయిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా దావా వేసింది. విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెండ్ అయిన కార్మికులు లేదా వారి అనుచరులు ఫ్యాక్టరీ కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రతిరోజూ 25–30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి సిమెంట్ ప్లాంట్‌కు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లు, వాహనాలు అడ్డంగా పెట్టి దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుండి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది.రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. భారతి సిమెంట్ తయారీ కేంద్రంలో ఉన్న ప్రస్తుత సున్నపురాయి నిల్వలు ఇకపై ఫ్యాక్టరీ కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోవు. పోలీసుల ఉదాసీతన కారణంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇది కంపెనీకి మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుండటమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది’ అని పిటిషనర్ పేర్కొన్నారు.అధికారం ఉన్నా.. కలెక్టర్ స్పందించడం లేదు‘జిల్లాపై పూర్తి అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ’భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చట్టబద్ధంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా నిరోధించడానికి, ప్రాణాలకు, భద్రతకు ప్రమాదం కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా, తిరుగుబాటు, గొడవలు జరగకుండా నిరోధించేందుకు నిర్దిష్ట చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించే అధికారం కూడా కలెక్టర్‌కు ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా కలెక్టర్ ఏ మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.’ అని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు.ఎస్పీ ఫిర్యాదును తీసుకోవడానికే నిరాకరించారు‘సస్పెండ్ అయిన కార్మికులు, ఇతరులు కలిసి కంపెనీ జీఎం (మైన్స్) కె.సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ జి. వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అటు తరువాత కూడా భారీ మూక ప్లాంట్ వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కమలాపురం సీఐ, కడప డీఎస్పీ, లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఎస్పీ ఫిర్యాదును స్వీకరించడానికే నిరాకరించారు. దీంతో ఆయనకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపాం. ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు సదరు మూకను చెదరగొట్టడం గానీ, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గానీ చేయలేదు. ఈ నేపథ్యంలో విధి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వండి.’ అని బాలాజీ తన పిటిషన్లో అభ్యర్థించారు. హైకోర్టుకు అభ్యర్థనలు ⇒ కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ⇒ ముందస్తు భద్రతను ఏర్పాటు చేసేలా కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి. ⇒ మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ⇒ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కలిగిస్తున్న ఆటంకాలను తొలగించి, వారిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయించేలా ఆదేశాలివ్వాలి. ⇒ తద్వారా సిమెంట్ ప్లాంట్‌లో చట్టబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగించేలా, ప్లాంట్ ప్రాంగణంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేలా ఆదేశించాలి. ⇒ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. -
భారతి సిమెంట్స్‌పై ‘పచ్చ’ పగ!
సాక్షి ప్రతినిధి,కడప: పగ పట్టారు.. వెంటాడుతున్నారు.. చివరకు పరిశ్రమనే మూసేయించాలన్న లక్ష్యంతో తెగిస్తున్నారు! పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ అంటూనే.. పరిశ్రమలకు ‘రెడ్‌బుక్’ ట్రీట్మెంట్! వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్‌పై చంద్రబాబు కక్ష పరాకాష్టకు చేరింది. మొన్న మైనింగ్ అనుమతులపై కొర్రీలు.. నేడు ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరుల ద్వారా మైనింగ్‌కు అడ్డంకులు.. రెండు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి లైమ్‌స్టోన్ తవ్వకాలను నిలువరిస్తున్నా చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. మైనింగ్ ఆగితే ఉత్పత్తి ఆగుతుంది.. ఉత్పత్తి ఆగితే 15 వేల మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిపై దెబ్బ పడుతుంది. అయినా పట్టింపులేదా? పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలనే పణంగా పెడతారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు నామమాత్రపు ధరలకే విలువైన భూములు కట్టబెడుతున్నారన్న విమర్శలు.. మరోవైపు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలకు ఇలాంటి వేధింపులు.. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధానం? ఇదేనా పారిశ్రామిక ప్రగతి? అంటూ నిలదీస్తున్నారు. రాజకీయ కక్ష కోసం పరిశ్రమలనే ఉక్కిరిబిక్కిరి చేస్తే రేపు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏ సంస్థ ముందు కొస్తుందని ప్రశ్నిస్తున్నారు.నిన్న అల్ట్రాటెక్...నేడు భారతి సిమెంట్స్..జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టారు. మైనింగ్‌ని అడ్డుకొని పరిశ్రమ ఉత్పత్తి నిలిపేశారు. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని సంస్కృతిని తీసుకువచ్చారు. అదేబాటలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పయనిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల పేరిట భారతి సిమెంట్స్‌లో ఆందోళన చేయించారు. వైఎస్సార్ కడప జిల్లా, కమలాపురం మండలం నల్లలింగాయపల్లి వద్ద భారతి సిమెంట్స్ 17సంవత్సరాలుగా క్యాప్టివ్ లైమ్‌స్టోన్ గనులను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ప్రవేశించారు. మైనింగ్ నిర్వహణను మంగళవారం నుంచి అడ్డుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా అక్కడే తిష్టవేసి లైమ్‌స్టోన్ మైనింగ్ నిర్వహణకు ఆటంకం కల్పించారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు మైనింగ్ రహదారులకు అడ్డుగా పెట్టి కార్యకలాపాలను అడ్డగించారు. పైగా సిమెంటు పరిశ్రమలోని కార్మికుల విధులకు ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుతగులుతున్నారు. భద్రతా సమస్యలను సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబుకు తెలిసే టీడీపీ ఎమ్మెల్యేలతో ఇలా చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్లాంట్ వాహనాన్ని అడ్డుకుంటున్న టీడీపీ మూకలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగంరెండు రోజులుగా భారతి సిమెంట్స్, వికాట్ సంస్థ పరిశ్రమలో మైనింగ్ నిర్వహణను అడ్డుకుంటున్న వ్యవహారంపై ప్లాంట్ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం లేకుండా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి అంతరాయాలు కొనసాగితే, ప్లాంట్ ప్రభావితమవుతుందని యాజమాన్యం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేయవలసి వస్తుందంటున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. చట్టబద్ధౖమెన సమస్యలను తీర్చేందుకు, కార్మికుల డిమాండ్ పరిష్కరించేందుకు యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని కార్మికులు వివరిస్తున్నారు. 2 రోజులుగా మైనింగ్ ఆగిపోయింది. పరిశ్రమ ఉత్పత్తి నిలిచిపోతే, వేలాది కుటుంబాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం పడనుంది.పెట్టుబడిదారులకు ఏం సందేశం ఇస్తున్నారు?భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతి సిమెంట్స్), భారత్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ సంస్థ వికాట్ గ్రూప్‌పై చంద్రబాబు సర్కార్ పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. వికాట్ గ్రూప్‌తో అనుబంధమున్న భారతి సిమెంట్స్ వంటి సంస్థ కార్యకలాపాలనే ఇలా కక్షసాధింపుతో అడ్డుకుంటుంటే... రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. చట్టబద్దమైన వ్యాపార సంస్థలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇలా కక్షసాధించడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాక్స్ రూపంలో రూ.3వేల కోట్లు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్ వంటి సంస్థలను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేమిటి అని పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఇక్కట్లు సృష్టించారా? హెరిటేజ్ సంస్థ నిర్వహణను అడ్డుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే కొరివితో తలగోక్కున్నట్లే అన్నట్లు సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని పలువురు పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. వైజాగ్‌లో గ్రైండింగ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించుకున్న వికాట్ సంస్థ ఇదే కారణంతో ఆ ఆలోచనను ఉపసంహరించుకుందని వారు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు అండ్ కో తీరు వల్లే రాష్ట్రం నుంచి పలు కంపెనీలు పలాయనం చిత్తగిస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ కంపెనీ బైబై చెప్పేసింది.. హిందుస్థాన్ కోకోకోలా, అజాద్ మొబిలిటీ, జ్యూపిటర్, జిన్ఫ్రా, ఐస్పేస్ లాంటి సంస్థలు కూడా వెళ్లిపోయాయి. -
భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ అవార్డు
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ భారతి భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ నుంచి ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది. సస్టైనబుల్ మైనింగ్ విభాగంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డును కంపెనీ సొంతం చేసుకుంది. భారతి సిమెంట్స్‌కు ఈ అవార్డు రావడం వరుసగా ఐదోసారి గమనార్హం.పర్యావరణహితమైన మైనింగ్ పద్ధతులు అవలంభించినందుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ అమలులో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గానూ కేంద్ర మైనింగ్ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భారతి సిమెంట్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మైన్స్ హెడ్ సుధాకర్ రాజు, సీఎస్ఆర్ హెడ్ నితేష్వర్లు ఈ అవార్డు అందుకున్నారు.భారతి సిమెంట్స్ కు వరుసగా ఐదోసారి అవార్డు రావడం గొప్ప విషయమని భారతి సిమెంట్స్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. పర్యావరణహితమైన మైనింగ్ నిర్వహించినందుకు గాను ఈ అవార్డు లభించిందని, భారతి సిమెంట్ టీం, మైనింగ్ కార్మికులు అద్భుతంగా పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1256 మైన్లు ఉంటే 68 మాత్రమే అవార్డుకు ఎంపికయ్యాయని వివరించారు. -
గనుల శాఖకు ఘన పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనులశాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రానున్న రెండేళ్లకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద రూ.2.40 కోట్లు ప్రోత్సాహకంగా ప్రకటించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులు శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అవార్డు అందుకున్నారు. రెండేళ్లుగా పారదర్శకంగా లీజులు.. దేశంలో ప్రధాన ఖనిజాల మైనింగ్‌పై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ఏటా అవార్డులను ప్రదానం చేస్తోంది. రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది రకాల ప్రధాన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అత్యంత వేగంగా లీజులు జారీ చేస్తోంది. వేగంగా మైనింగ్ కార్యక్రమాలను చేపట్టేలా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తోంది. దీనికి గుర్తింపుగా కేంద్రం అవార్డులను ప్రకటించింది. మైనింగ్ బ్లాకుల నిర్వహణను సమర్థంగా చేపట్టినందుకు అభినందిస్తూ 2022–23లో బాక్సైట్, ఐరన్ ఓర్ ఐదు కొత్త మినరల్స్ బ్లాక్‌లకు సంబంధించి జియోలాజికల్ నివేదికలను రాష్ట్రానికి కేంద్రం అందజేసింది. సీఎం తెచ్చిన సంస్కరణల ఫలితం.. మైనింగ్ రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకమని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మైనింగ్ రంగంలో సృజనాత్మక పనులతోపాటు పలు సంస్కరణలు తెచ్చినట్లు వెల్లడించారు. కొత్త మినరల్ బ్లాకులకు సంబంధించి త్వరలోనే ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్ ఆపరేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తామని వీజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్ రంగంలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించామన్నారు. భారతి సిమెంట్స్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ నేషనల్ కాంక్లేవ్‌లో భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం పట్ల సంస్థ యాజమాన్యాన్ని ద్వివేది, వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్లు సస్టెయినబుల్ మేనేజ్మెంట్ విధానాలను అవలంబించిన భారతి సిమెంట్స్‌కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమన్నారు. -
భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం
-
కన్నుల పండువగా ఇండియా అవార్డ్స్
సాక్షి, హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్, భారతీ సిమెంట్స్ సౌజన్యంతో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా అవార్డ్స్–2018 కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలకు సంబంధించిన అడ్వరై్టజింగ్ ఏజెన్సీలు సృజనాత్మకంగా రూపొందించిన వాణిజ్య ప్రకటనలకు అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 23 విభాగాల్లో ఇండియా అవార్డ్స్‌ను ఇచ్చారు. తొలిసారిగా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంస్థల వాణిజ్య ప్రకటనలకు రీజినల్ ఇండియా అవార్డ్స్ ప్రదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ఇండియా అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సాంకేతికతకు నగరంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందన్నారు. మీడియా తప్పుడు వార్తల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అత్యున్నత ప్రమాణాలతో వాణిజ్య ప్రకటనల రంగం పురోగమించాలని ఆకాంక్షించారు. ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అవార్డులను తేటతెలుగు భాషలో వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన సంస్థలకు అందజేయడం శుభపరిణామమన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వరై్టజింగ్ రంగాన్ని మరింత ప్రోత్సహించినట్లయిందని అభిప్రాయపడ్డారు. రీజినల్ ఇండియా అవార్డ్స్ విభాగం ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’మీడియా, భారతీ సిమెంట్స్ అందించిన ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. ఇండియా అవార్డ్స్ జ్యూరీ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. ఇండియా అవార్డ్స్–2018కి మొత్తం 23 విభాగాలలో వివిధ సంస్థలకు చెందిన 332 ఎంట్రీలు (వాణిజ్య ప్రకటనలు) టీవీ, వార్తాపత్రికలు, డిజిటల్ మీడియాకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సృజనాత్మకత, సమాచారం, వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా ఉన్నవి, ఉత్తమ సందేశం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలను అవార్డులకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆయా కంపెనీలకు యాడ్స్ సిద్ధం చేసిన యాడ్ ఏజెన్సీలతోపాటు కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, అమెరికాలోని న్యూయార్క్ మహానగరంతో దాదాపు సమానంగా నగర పోలీసు వ్యవస్థ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని భద్రత కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ వైఈపీరెడ్డి, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సవాళ్ల మధ్య పురోగమనం: శ్యాం బర్సారా దేశంలో వాణిజ్య ప్రకటనల రంగం(అడ్వర్టైజ్మెంట్) తీవ్ర పోటీ, సవాళ్ల మధ్య పురోగమిస్తోందని మాడిసన్ వరల్డ్ చైర్మన్ శ్యాం బర్సారా చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా, చానల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాణిజ్య ప్రకటనల విషయంలో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించాలని కోరారు. దేశంలో 1972లో కేవలం రూ.100 కోట్ల మేర ఉన్న వాణిజ్య ప్రకటనల వ్యాపారం ఇప్పుడు సుమారు రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. ఈ రంగంలో అనుసరించాల్సిన మెళకువలను ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇండియా అవార్డ్స్–2018కి ఎంపికైన సంస్థలు.. వాటి యాడ్స్ వివరాలివీ.. ఆటో ఫోర్ వీలర్స్ టాటా మోటార్స్ న్యూ ఏస్ ఎక్స్ఎల్ ఆటో టూ వీలర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆటో అదర్స్ అపోలో టైర్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ స్మార్ట్కీస్ ఫుడ్ అండ్ బేవరేజెస్ డాబర్ హనీ స్టే ఫిట్.. ఫీల్ యంగ్ హోమ్‌కేర్ లైజాల్ మాన్సూన్ న్యూప్యాక్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా సోనిమ్యాక్స్ సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ పర్సనల్ కేర్ కోల్గేట్ స్వర్ణ వేద్ శక్తి టూత్‌పేస్ట్ రిటైల్ లలిత జ్యూవెలరీస్.. లలిత చెక్ అండ్ బయ్ టెలికం అండ్ టెక్నాలజీ ఎయిర్టెల్– మై ప్లాన్ ఫ్యామిలీ ఫార్మా హైజిన్ అండ్ వెల్నెస్ మూవ్–సింధు డైరెక్టర్ హోమ్ డెకార్ ఫెవిక్విక్ జెల్–హెడ్‌స్టాండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కపిల్ చిట్ ఫండ్స్ యాడ్ ఫిల్మ్ బిల్డింగ్ మెటీరియల్ భారతీ సిమెంట్ ఫుల్ గ్యారంటీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మింట్ ఈ మొబైల్స్లాంచ్ ఆఫ్ మింట్ ఈ ఓపెన్బాక్స్ మొబైల్స్ రియల్ ఎస్టేట్ అపర్ణ గేటెడ్ కమ్యూనిటీస్–ది పేపర్ ప్లేన్ సర్వీసెస్ గటి–అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫ్రీడం రీఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గవర్నమెంట్ ఏపీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్–సన్రైస్ ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ రిటైల్ సెంట్రో–దసరా క్యాంపెయిన్ ట్రావెల్ అండ్ టూరిజం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ జెండర్ సెన్సిటివ్ అడ్వరై్టజింగ్ ఫ్యూర్ అండ్ ష్యూర్–కన్యాకుమారి టు లడక్ ఇన్ 100 హవర్స్ కార్పొరేట్ జన్రైస్ అడ్వరై్టజింగ్–హ్యాపీ మదర్స్‌డే -
భారతీ సిమెంట్స్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోండి
♦ లీజుపై ఈ నెల 10లోపు నిర్ణయం తీసుకోండి ♦ కేంద్రం నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్ణయం ఉండాలి ♦ ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా, కమలాపురం మండలం, పందిళ్లపల్లి, తురకపల్లి, టి.చదిపిరాళ్ల, యర్రగుంట్ల మండలం, టి.సుంకేసుల, తిప్పలూరు గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో భారతీ సిమెంట్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారతీ సిమెంట్స్‌కు గతంలో జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్ఓఐ) గడువు ఈ నెల 11తో ముగుస్తున్న నేపథ్యంలో లీజు కోసం ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తుపై ఈ నెల 10లోపు నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. గనులు, ఖనిజాభివృద్ధి చట్ట నిబంధనలు, ఈ నెల 4న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్ణయం ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ లీజు నిర్ధారణకు సంబంధించి భారతీ సిమెంట్స్‌కు జారీ చేసిన నోటీసు విషయంలో ప్రభుత్వ హక్కులపై తాము వెలువరించిన ఈ ఉత్తర్వులు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. కమలాపురం, యర్రగుంట్ల మండలాల పరిధిలోని గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయంటూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం ఎల్ఓఐ గడువు ముగుస్తున్నందున ఈ నెల 10లోపు భారతీ సిమెంట్స్ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఈడీవి తొందరపాటు చర్యలు
- అప్పీల్‌కు 45 రోజుల గడువుంది - అయినప్పటికీ డిపాజిట్లను బదలాయించేసుకుంది - ఇది ఎంతమాత్రం సరికాదు - అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయండి - హైకోర్టులో వై.ఎస్.జగన్, భారతి, పలు కంపెనీల పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ కేసులో జప్తు చేసిన ఆస్తుల బదలాయింపు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొందరపాటు చర్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో పాటు, మరికొన్ని కంపెనీలు ఉమ్మడి హైకోర్టు ముందు సవాలు చేశాయి. ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ గత నెల 23న ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపే యాలని కోరుతూ వారు సోమవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాక బ్యాంకు ల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ మేనేజర్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపేయా లని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పిలెట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేసుకునేందుకు తమకు 45 రోజుల గడువు ఉందని, అయినప్పటికీ ఈడీ తమ డిపాజిట్లను బదలాయించేసుకుందని వారు తమ పిటిషన్లలో వివరించారు. అదే విధంగా పలు ఆస్తులను కూడా బదలాయించుకునేందుకు ఈడీ తొందరపడుతోందని పేర్కొన్నారు. ఈడీ తమ ప్రాథమిక జప్తు ఖరారు నిమిత్తం అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలు చేసి అందులో తమపై పలు ఆరోపణలు చేసిందని, వాటికి తాము పూర్తి ఆధారా లతో తగిన సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే అడ్జ్యుడికేటింగ్ అథారిటీ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఈడీ ప్రాథమిక జప్తును ఖరారు చేస్తూ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కాగా, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ హోదాలో చట్టబద్ధంగా అందుకున్న జీతం, దాని తాలుకు డిపాజిట్లను కూడా ఈడీ అక్రమమని చెబుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని భారతి తన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదానం
జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట లోని శ్రీజోగినాథ ఆలయ రథోత్సవాల్లో భాగంగా బుధవారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ మేనేజర్ పీఎస్.కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు. సుమారు మూడువేల మంది భక్తులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్‌కు ఆలయ రథోత్సవ కమిటీ అభినందనలు తెలిపింది. సంస్థ టెక్నికల్ మేనేజర్ నరేష్ కుమార్, ఇంజనీర్ గణేష్, జోగిపేట షిర్టీ సాయిబాబా ట్రేడర్స్ యాజమాని సీహెచ్.నర్సింలు, సంగారెడ్డికి చెందిన శ్రీ బాలాజీ సాయిరాం ట్రేడర్స్ యాజమాని కృష్ణకాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్.కవిత సురేందర్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


