breaking news
BCI
-
బీసీఐ చైర్మన్ మనన్ దిగిపోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీసీఐ కో–చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మిశ్రాకు శనివారం ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. 15 రోజుల్లోగా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిధుల మళ్లింపు, అక్రమ నియామకాలు, అధికార దుర్వినియోగం సహా 8 ప్రధాన కారణాలను ప్రస్తావిస్తూ మనన్ రాజీనామాకు సదాశివరెడ్డి పట్టుబట్టారు. బీసీఐ ఖాతాలతో పాటు ఆయన హయాంలో ఏర్పాటైన ట్రస్ట్ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై చర్చించేందుకు కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశ పరచాలని కోరారు. హైదరాబాద్‌లోని నల్సా ర్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవా నికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరుకావడాన్ని తప్పుబట్టిన విద్యార్థులను మనన్ మిశ్రా బెదిరించడాన్ని సదాశివరెడ్డి తప్పుబట్టారు. మిశ్రా తన పదవీకాలంలో 2020లో ’బీసీఐ ట్రస్ట్ పెర్ల్– ఫస్ట్’ పేరిట తనకు కావలసిన వారితో ఒక కొత్త ట్రస్టును ఏర్పాటు చేశారని సదాశివరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బీసీఐ నిధుల నుంచి దాదాపు రూ.150 కోట్లను ఆ ట్రస్టుకు మళ్లించారన్నారు. బీసీఐ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో కీలక పరిపాలనా పోస్టులన్నీ మిశ్రా బంధువుల చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఏమాత్రం అర్హత లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వడంతో న్యాయ విద్యలో నాణ్యత పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుంచి వరుసగా 14 ఏళ్లకు పైగా మిశ్రా చైర్మన్ పదవిలో కొనసాగడం పార్లమెంటు ఉద్దేశించిన రొటేషనల్ విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు.ఆరోపణలను ఖండించిన మనన్తనపై వచ్చిన ఆరోపణలను మనన్ ఖండించారు. ‘‘ఆరోపణలు గుప్పిస్తున్న సదాశివరెడ్డి బీసీఐలో ప్రస్తుతం సభ్యుడు కాడు. సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఈసారి ఆయన పోటీచేయలేదు. గత ఎనిమిదేళ్లుగా బీసీఐ సభ్యునిగా ఉన్న కాలంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నట్లు? అయినా నేనెంత నిజాయతీపరుడినో బార్ కౌన్సిల్లో అందరికీ తెలుసు. పాతిక లక్షల మంది లాయర్ల మద్దతున్న నన్ను సోషల్‌మీడియాలో సదాశివరెడ్డి లాంటి వాళ్లు ఎంతో మంది విమర్శిస్తుంటారు’’ అని మనన్ వ్యాఖ్యానించారు. -
ఎన్రోల్మెంట్పై నిషేధం.. ఆపై సవరణ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై తొలుత నిషేధం విధించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆ తర్వాత వెనక్కి తగ్గింది. వర్సిటీ స్నాతకోత్స వానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారంలో ఈ బ్యాచ్ విద్యార్థుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గురువారం ఉదయం విధించిన ఎన్రోల్మెంట్ నిషేధాన్ని రాత్రికి ఉపసంహరించుకుంది. తాజా నిర్ణయంతో 2026లో లా డిగ్రీ పూర్తి చేసిన నల్సార్ విద్యార్థులందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు మార్గం సుగమమైంది. అంతలోనే వెనక్కి... సీజేఐకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఈ బ్యాచ్‌కు చెందిన అధిక శాతం విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని, వారు అమాయకులని బీసీఐ తాజా విచారణ నివేదికల ఆధారంగా నిర్ధారించింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించిన బీసీఐ సభ్యులు నిషేధాన్ని ఎత్తివేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అత్యధిక విద్యార్థులకు సీజేఐని అగౌరవపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కొద్దిమంది చేసిన తప్పునకు బ్యాచ్‌లోని విద్యార్థులందరినీ బాధ్యులను చేసి, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం సరికాదన్న నిర్ణయానికి బీసీఐ వచ్చింది. అనంతరం బీసీఐ చైర్మన్ గురువారం ఉదయం ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ రాత్రి మరో ప్రకటన విడుదల చేసింది. అసలేం జరిగిందంటే... ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. దీనిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.. 2026లో నల్సార్ నుంచి లా డిగ్రీ పొందిన ఏ ఒక్క విద్యారి్థని కూడా అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేయకూడదని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆందోళనల వెనుక ఉన్న వారిని గుర్తించి, పక్కా ఆధారాలతో మూడు రోజుల్లోగా వాస్తవ నివేదికను సమరి్పంచాలని నల్సార్ వీసీని తొలుత ఆ ఉత్తర్వుల్లో బీసీఐ ఆదేశించింది. ఆయా విద్యార్థుల పూర్తి జాబితాను అధికారిక రికార్డుల నుంచి తీసి పంపాలని ఆదేశించింది. క్యాంపెయిన్‌ను డ్రాఫ్ట్ చేసిన వారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారు, పత్రికలకు సమాచారం ఇచ్చిన వారు, అధికారిక గ్రూపులను అడ్మినిస్ట్రేట్ చేసిన వారిని గుర్తించాలని కోరింది. స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన వారి వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించిన అనంతరం అమాయకులైన మెజారిటీ విద్యార్థులకు న్యాయం చేస్తూ బీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది. 31న తుది ఉత్తర్వులు తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మధ్యంతర ఎన్రోల్మెంట్ కమిటీ ద్వారా చేపట్టిన న్యాయవాదుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. కమిటీ ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లో ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31న దీనిపై తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. -
నల్సార్ వర్సిటీ గ్రాడ్యుయేట్లను అడ్వకేట్లుగా ఎన్రోల్ చేయొద్దు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి 2026లో న్యాయ పట్టా పొందిన విద్యార్థులను తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అడ్వకేట్లుగా ఎన్రోల్ (నమోదు) చేయవద్దని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) చైర్మన్ గురువారం అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించారు. అలాగే, నల్సార్ కాన్వొకేషన్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిపిన ప్రచారంలో పాల్గొన్న వారిపై వాస్తవ నివేదిక సమర్పించాలని యూనివర్సిటీని కోరారు."తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, 2026 సంవత్సరంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి న్యాయ పట్టా పొందిన ఏ విద్యార్థినీ ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వకేట్‌గా నమోదు చేయకూడదు" అని బీసీఐ చైర్మన్ నల్సార్ వైస్-చాన్సలర్‌కు, అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. గత వారం, ఢిల్లీ విద్యార్థుల నిరసనలపై సీజేఐ చేసిన వ్యాఖ్యల కారణంగా, కాన్వొకేషన్‌కు ఆయనను ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి.విద్యార్థుల ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, ప్రచారాన్ని ప్రారంభించడం, నిర్వహించడం, సమన్వయం చేయడం, ప్రజలను సమీకరించడం వంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులను గుర్తిస్తూ 3 రోజుల్లో ధ్రువీకరించిన నివేదిక ఇవ్వాలని నాల్సార్ వైస్-చాన్సలర్‌ను కోరారు.సీజేఐ పాల్గొనడం లేదా ఆహ్వానం విషయంలో యూనివర్సిటీ అధికారులకు సమర్పించిన ప్రాతినిధ్య పత్రాలు, పిటిషన్లు, మెమొరాండాలు, ఇతర సమాచార పత్రాల ప్రతులతో పాటు, అధికారిక రికార్డుల్లో ఉన్న పూర్తి సంతకాల జాబితాను కూడా సమర్పించాలని యూనివర్సిటీకి సూచించారు.వీళ్లందరినీ గుర్తించాలి.. ప్రచారాన్ని ప్రారంభించినవారు, దానిని మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, సమావేశాలు నిర్వహించినవారు, ప్రజలను సమీకరించినవారు, పత్రికలతో మాట్లాడినవారు, అధికారిక లేదా వ్యవస్థీకృత సామాజిక మాధ్యమ సమూహాలను నిర్వహించినవారు, కాన్వొకేషన్ లేదా సంబంధిత కార్యక్రమాలను బహిష్కరించాలని, అడ్డుకోవాలని, భంగం కలిగించాలని, సమిష్టిగా పాల్గొనకూడదని పిలుపునిచ్చినవారిని గుర్తించాలని కూడా బీసీఐ నాల్సార్ను కోరింది. విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బయటి వ్యక్తుల ప్రమేయంపై వివరాలు కూడా కోరింది."కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొందరు అకడమిక్ సిబ్బంది మధ్య వర్గపోరు, అసహ్యకర రాజకీయాలు ఉన్నాయి. వారు విద్యార్థులను తప్పుదారి పట్టించడంలో, రెచ్చగొట్టడంలో, తప్పుగా ప్రభావితం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. ఇది అత్యంత తీవ్రమైన విషయం. ఉపాధ్యాయులు బోధనా బాధ్యతలపై దృష్టి పెట్టకుండా క్యాంపస్‌లో చెత్త రాజకీయాలు చేస్తున్నారు. న్యాయ విద్య నియంత్రణ సంస్థగా భారత బార్ కౌన్సిల్ ఇలాంటి పరిస్థితిని చూస్తూ మౌనంగా ఉండదు" అని చెప్పింది.అయితే, ప్రాతినిధ్య పత్రం లేదా ప్రచారంలో పాల్గొన్నారనే కారణంతో ఎవరినీ ఈ దశలో నమోదు అర్హత లేనివారిగా ప్రకటించలేదని బీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ, విచారణ కొనసాగుతున్న సమయంలో విద్యార్థుల నమోదు అనుమతిస్తే ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల 2026 నాల్సార్ బ్యాచ్ మొత్తానికి తాత్కాలికంగా నమోదు నిలిపివేయాలని ఆదేశించింది."దేశంలోని అత్యున్నత న్యాయ పదవికి గౌరవం లేని న్యాయ విద్యార్థి, బాధ్యతాయుతమైన అడ్వకేట్, ఉపాధ్యాయుడు లేదా న్యాయమూర్తిగా మారతాడని ఆశించలేం. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ వృత్తికి భారంగా మారతారు. అలాంటి ప్రవర్తన, న్యాయ వృత్తిలో ప్రవేశానికి లేదా దానితో అనుబంధానికి ఆ వ్యక్తి తగినవాడా కాదా అన్న విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది న్యాయ వృత్తి గౌరవం, క్రమశిక్షణ, నైతిక ప్రమాణాలకు విరుద్ధం. మా అనుభవం ప్రకారం అలాంటి వ్యక్తులు ఎప్పుడూ సమ్మెలు, బహిష్కరణల్లో పాల్గొంటారు. న్యాయ వృత్తి ప్రతిష్ఠను దెబ్బతీస్తారు" అని చైర్మన్ పేర్కొన్నారు.ధ్రువీకరించిన వాస్తవ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని బీసీఐ చైర్మన్ నల్సార్‌ను కోరారు. లేఖ ప్రకారం, వైస్-చాన్సలర్ నివేదిక అందిన తర్వాత 2026 ఆగస్టు 19న ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
కోర్టుల్లో 40% లాయర్లు ఫేక్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ న్యాయ స్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్లో 40 శాతం మంది వరకు నకిలీలేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్, సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్ మిశ్రా సంచలన విషయాన్ని వెల్లడించారు. కొందరు నకిలీ లా డిగ్రీలు సృష్టించి, నల్ల కోట్లు ధరించి కోర్టుల్లో దర్జాగా వాదనలు వినిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దష్టికి తీసుకువెళ్లామని మిశ్రా తెలిపారు. నకిలీల వ్యవహారంపై బీసీఐకి స్పష్టమైన అవగాహన ఉందని మిశ్రా పేర్కొన్నారు. ‘కోర్టు ప్రాంగణాల్లో నల్ల కోట్లు, బ్యాండ్లతో తిరుగుతున్న వారిలో 35–40 శాతం మంది నకిలీ న్యాయవాదులేనని బీసీఐకి తెలుసు. వారి డిగ్రీలు పూర్తిగా నకిలీవి. వాటిని ఎక్కడో కొనుగోలు చేసి లేదా సృష్టించి, ఆ ఆధారంతో కోర్టుల్లో వాదనలు చేస్తున్నారు‘అని ఓ ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. లాయర్ల డిగ్రీలను ధ్రువీకరించేందుకు బీసీఐ గతంలో ఒక ప్రక్రియను ప్రారంభించింది. ఆ సమయంలో 40 శాతం మంది న్యాయ వాదులు తమ వెరిఫికేషన్ ఫారాలను పూర్తి చేయలేదని మిశ్రా పేర్కొన్నారు. ధ్రువీ కరణలు సమర్పించని వారినే నకిలీలుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇటీవల సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదు ల హోదాకు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా కొందరు లాయర్ల డిగ్రీల వాస్తవికతపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీసీఐ చర్యలు తీసుకుంటుందని తాను ఆశించడం లేదని, డిగ్రీల వెరిఫికేషన్ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు సీజేఐ వ్యాఖ్యానించారు. అదే సమయంలో యాక్టివిజం ముసుగులో కొందరు నిరుద్యోగ యువకులు వ్యవస్థలపై బొద్దింకల (కాక్రోచ్ల) వలె దాడి చేస్తున్నారని తీవ్ర పదజాలం వాడారు. తీవ్ర దుమారం రేగడంతో నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించే తానలా అన్నట్లు సీజేఐ అనంతరం వివరణ ఇచ్చారు. సీజేఐ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో ’కాక్రోచ్ జనతా పార్టీ’పేరుతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మిశ్రా పైవివరాలను వెల్లడించారు. నకిలీ డిగ్రీలు పొంది న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతను ఉద్దేశించే సీజేఐ ఆ వ్యాఖ్యలు చేశారంటూ మిశ్రా సమర్థించారు. -
వ్యాపార అవకాశాలపై కంపెనీల ధీమా..
న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ వ్యవధిలో వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) 149.4కి పెరగడం ఇందుకు నిదర్శనం.జనవరి - మార్చి త్రైమాసికంలో ఇది 139.3గా నమోదైనట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నవారిలో వచ్చే ఆరు నెలల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని 78.7 శాతం, దేశీయంగా అమ్మకాలు పెరుగుతాయని 79.1 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే ముడి వస్తువుల దిగుమతులు పెరుగుతాయని 54.3 శాతం, పన్నుల ముందు లాభాలు మెరుగుపడతాయని 61 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి.ఆరు నగరాలవ్యాప్తంగా జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 479 కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడుల వాతావరణం తదితర నాలుగు అంశాలు బీసీఐకి ప్రాతిపదికగా ఉంటాయని ఎన్సీఏఈఆర్ తెలిపింది. -
సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. (చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..) -
తెలంగాణకు బార్ కౌన్సిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌ను విభజించి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) తీర్మానించింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకు నిరీక్షించకుండానే వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం టీఎస్ అజిత్, దినేశ్ పాథక్లతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందున.. తమకు ప్రత్యేక బార్ కౌన్సిల్ కావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీఐ ఆ దిశగా చర్యలు చేపట్టింది. దీనిపై ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. -
‘ఆ నలుగురిపై ఎలాంటి చర్యలుండవు’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు అంశాన్ని రాజకీయం చేయొద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విజ్ఞప్తి చేసింది. బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సోమవారమిక్కడ మాట్లాడుతూ...జడ్జీల మధ్య వివాదం ముగిసిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని ఆయన అన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించమని, అంతర్గతంగా అందరూ చర్చించుకున్నారని మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. జడ్జిలందరూ విధులకు హాజరయ్యారని, కోర్టు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నలుగురు జడ్జిలపై ఎలాంటి చర్యలుండవని బీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనితీరు సక్రమంగా లేదంటూ వ్యాఖ్యలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఇవాళ యథావిధిగా విధులకు హాజరు అయ్యారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారికంగా మీడియా ఎదుట ప్రకటించనుంది. -
పెరిగిన వ్యాపార విశ్వాసం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగుపడుతుందన్న ఆశాభావం కంపెనీల్లో వ్యక్తమైంది. సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ కాలానికి 59.7గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సూచీ 58.3 పాయింట్లుగానే ఉంది. త్రైమాసిక వారీ సీఐఐ అవుట్‌లుక్ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపారాలకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయన్న సంకేతాలతో మొత్తం మీద ఆర్థికరంగంపై అంచనాలు మెరుగుపడ్డాయి. ‘‘ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు క్షేత్రస్థాయిలో చూపించిన ప్రభావంతో ఆర్థిక రంగం స్థిరమైన పునరుద్ధరణ బాటలో ఉన్నట్టు ఈ సర్వే గుర్తించింది. సూక్ష్మ ఆర్థిక అంశాల పరంగా వృద్ధి పెరుగుదల నిలకడగా ఉంటుందన్న అంచనాలే వ్యాపార విశ్వాస సూచీ పుంజుకోవడానికి కారణం’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
లా అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో ప్రవేశాల్లో జాప్యం తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో న్యాయ విద్య ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయినందున ఈనెలలో ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్లను పూర్తి చేయాలన్న ఆలోచనకు కమిటీ సభ్యులు వచ్చారు. ఇందులో భాగంగా తాత్కాలిక షెడ్యూలును ఖరారు చేశారు. ఈనెల 13వ తేదీన ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీచేసి, 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. 21వ తేదీనుంచి 25వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 28వ తేదీన సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. అయితే సీట్లను కేటాయించే 28వ తేదీ వరకు బీసీఐనుంచి కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. అవి వస్తేనే సీట్లను కేటాయించనున్నారు. నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. న్యాయ విద్యలో ప్రవేశాలకోసం లాసెట్‌ను గత మే 27న నిర్వహించారు. ఈ పరీక్షకు 40 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితాలను జూన్ 10వ తేదీన విడుదల చేశారు. అందులో 18,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారికి అప్పటినుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో బీసీఐ జాప్యం చేస్తూనే ఉంది. గత ఏడాది ఎల్ఎల్ఎంలో 524 సీట్లు, మూడేళ్ల లా కోర్సులో 2,590 సీట్లు, 5 ఏళ్ల లా కోర్సులో 1,176 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికే కాకుండా మరిన్ని కొత్త కాలేజీలకు సైతం అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అనుమతులపై మాత్రం బీసీఐ ఇంతవరకూ తేల్చలేదు. -
వ్యాపార వర్గాల్లో పెరిగిన విశ్వాసం
జీవితకాల గరిష్ట స్థాయికి సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల వ్యాపార వర్గాలు ఎంతో ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రంగ కార్యకలాపాలు పుంజుకుంటాయన్న విశ్వాసం వారిలో వ్యక్తమవుతోంది. దీన్ని ప్రతిఫలిస్తూ సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) జనవరి–మార్చి త్రైమాసికంలో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరింది. ‘‘2017 ఆగమనంతోనే వ్యాపార దృక్పథంలో స్వల్ప వృద్ధి నెలకొంది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల చర్యలు కంపెనీలకు పెట్టుబడుల అవకాశాలు కల్పిస్తాయనే ఆశాభావం నెలకొంది’’ అని సీఐఐ పేర్కొంది. వ్యాపార సెంటిమెంట్ బలంగా ఉందని, తమ రంగాల్లో భవిష్యత్తు కార్యకలాపాల పట్ల కంపెనీలు ఆవాభావంతో ఉన్నాయని తెలిపింది. సీఐఐ దేశ వ్యాప్తంగా వ్యాపారుల అభిప్రాయాలను సేకరించి ఈ ఫలితాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా 98వ ఎడిషన్ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో బీసీఐ 64.1గా నమోదు కాగా, ఇది అంతకు ముందు త్రైమాసికం (2016 అక్టోబర్–నవంబర్)లో 56.5గా ఉంది. 200 భారీ, మధ్య స్థాయి, చిన్న, సూక్ష్మ సంస్థల నుంచి అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా సేకరించారు. సర్వే ఫలితాలు జనవరి – మార్చి త్రైమాసికంలో 63 శాతం సంస్థలు విక్రయాలు పెరిగినట్టు చెప్పాయి. అంతకు ముందు మూడు నెలల కాలంలో ఇలా విక్రయాలు పెరుగుదల చూసిన సంస్థలు 39 శాతమే. కొత్త ఆర్డర్లు కూడా పెరగొచ్చన్న విశ్వాసం 60 శాతం సంస్థల నుంచి వ్యక్తమైంది. అంతకుముందు కాలంలో ఇది 41 శాతమే. -
నకిలీ లాయర్లెవరో తేల్చేస్తాం
న్యూఢిల్లీ: తొందర్లోనే నకిలీ లాయర్లెవరో తేల్చిపారేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు తేల్చాలంటే సాధ్యం కాని పని అని మరో ఏడు నెలల్లో నిజమైన లాయర్లెవరో, నకిలీ లాయర్లెవరో తెలుపుతామని పేర్కొంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నోత్తరాల సమయంలో బీసీఐ తరుపున కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానంద గౌడ వ్రాత పూర్వక వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు నకిలీలాయర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తేల్చాలన్న ఆలోచన బార్ కౌన్సిల్ చేయలేదని, ప్రస్తుతం మాత్రం అందుకోసం ఒక ప్రత్యేక మెకానిజాన్ని, కార్యచరణను ఏర్పాటుచేసి నకిలీ లాయర్ల సంఖ్య తేలుస్తామని చెప్పారు. గతంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో 30శాతంమంది నకిలీ లాయర్లే ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి లెక్కలేమిటో తేల్చాలని కేంద్ర ప్రభుత్వం బీసీఐని కోరింది. -
తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుపై వైఖరేమిటి..?
బీసీఐకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు శనివారం విచారణ జరిపారు.


