breaking news
Bauxite excavation
-
బాక్సైట్.. ఫైట్ .. తీవ్రరూపం
రాయగడ : రాయగడలో బాక్సైట్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్‌లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. సిజిమాలి తవ్వకాలకు అనుమతి కాశీపూర్ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్ సమీపంలొ ఉన్న సిజిమాలి (Sijimali)లో సుమారు 311 మిలయన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాక్సైట్ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంత వ్యతిరేకత..? కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్‌లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. సిజిమాలిలో జరిగింది ఇదే.. సిజిమాలి బాక్సైట్ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి కంఠమాల్ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాష్వ వాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్ పైండింగ్ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు. ఇందులో భాగంగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు కంఠమాల్ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్ అశుతొష్ కులకరి్ణతో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్‌తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి. ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులుప్రభావిత గ్రామాలు సిజిమాలి బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది! -
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా సీఎం వ్యాఖ్యలు చేయడం దారుణం పాడేరు : దళితులను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని’ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వివక్ష పూరిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు వివక్షకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీలను సీఎం మనుషులుగా చూడడం లేదని, కులాల మధ్య చిచ్చుపెట్టవ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జీవో 97ను రద్దు చేయాలని చింతపల్లిలో జరిగిన బహిరంగ సభలో డిమాండ్ చేస్తే తన వ్యాఖ్యలను వక్రీకరించి కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. ప్రజాభీష్టాన్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కి చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీసీలకు, కాపులకు మధ్య చిచ్చు పెట్టేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాక్సైట్ కోసమే అవుట్ పోస్టులు మన్యంలో గిరిజనులంతా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తవ్వకాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసమే చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో కొత్తగా అవుట్ పోస్టుల ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీని వల్ల జీవనోపాధి పొందుతున్న భూములను కోల్పోతామని, అక్కడ అవుట్ పోస్టు ఏర్పాటును విరమించాలని రాళ్ళగెడ్డలో గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.


