breaking news
Bashir
-
టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో ‘6జర్నీ’
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు బసీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఇది వరకు తెలుగులో సమరం, కన్నడలో మరో చిత్రాన్ని చేశాను. ఇప్పుడు నా మూడో సినిమా 6 జర్నీ అంటూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ.→ సమీర్, పల్లవి జంట అద్భుతంగా నటించింది. కొత్త అబ్బాయి విలన్‌గా అభిరాం చక్కగా నటించారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఫైట్ మాస్టర్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది.→ వర్షాకాలంలో ఈ మూవీ షూటింగ్ చేశాం. షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రకృతి మాకు ఎంతో సహకరించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాం.→ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా మంచి పాటల్ని ఇచ్చారు. మంచి సంగీతం, మంచి పాటలు ఉన్నాయి. ఆల్రెడీ మా పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.→ క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. బోర్డర్లో సినిమా షూటింగ్, వర్షాకాలం అవ్వడంతో కాస్త బడ్జెట్ పెరిగింది.→ మళ్లీ అక్టోబర్‌లో ఓ సినిమాను చేయబోతోన్నాను. ముంబై బ్యాక్ డ్రాప్లో ఆ చిత్రం ఉంటుంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను. -
సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్
డమాస్కస్: అసద్ నిరంకుశ పాలనకు తెరదించిన హయత్ తహ్రీర్ అల్ షామ్, ఇతర తిరుగుబాటుదారుల గ్రూప్‌లు ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. 2025 మార్చి ఒకటో తేదీదాకా ఈయన తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో సభ్యులతో కలిసి మంగళవారం డమాస్కస్‌లో సమావేశం నిర్వహించిన ఆయన... తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. మైనారిటీలను గౌరవిస్తూ ప్రజాస్వామిక రీతిలో నడిచినంత కాలం సిరియా ప్రభుత్వానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆదేశ విదేశాంగ మంత్రి చెప్పారు. -
భారత్ తడబాటు
భారత స్పిన్నర్ జడేజా మిగిలిన మూడు వికెట్లను పడగొట్టిన మన స్పిన్ పిచ్‌పై ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆ తర్వాత అంతకు మించి పట్టు సాధించాడు. ఇది భారత తొలి ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టింది. అలాగే ‘అంపైర్ కాల్’ భారత వికెట్లను ప్రభావితం చేసింది. క్రీజులో ప్రధాన బ్యాటర్ అంటూ లేకుండా చేయడంతో పరుగుల పరంగా టీమిండియా వెనుకబడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించడం ఖాయమైంది. రాంచీ: మ్యాచ్‌కు ముందు రోజు వికెట్‌ను పరిశీలించిన ఇరుజట్ల వర్గాలు ‘పిచ్‌పై అంచనా కష్టం. ఏ రోజు టర్న్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం’ అని అభిప్రాయపడ్డాయి. అనూహ్యంగా రెండో రోజే పిచ్ పూర్తిగా స్పిన్‌కు స్వర్గధామమైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిపోయిన మూడు వికెట్లను జడేజా పడేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ తమ యువ ఆఫ్‌స్పిన్నర్ బషీర్‌తో వరుసగా ఓవర్లు వేయించాడు. అతను 31 ఓవర్లు నిర్విరామంగా బౌలింగ్ చేసి విలువైన వికెట్లను పడేయడంతో ఆతిథ్య భారత్ కష్టాల పాలైంది. శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (117 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. బషీర్ 4 వికెట్లు పడగొడితే మరో స్పిన్నర్ హార్ట్లీ కూడా 2 వికెట్లు తీసి భారత్ కష్టాల్ని పెంచాడు. మరో 51 పరుగులు... రెండో రోజు 302/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ 104.5 ఓవర్లలో 353 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో 14.5 ఓవర్లు ఆడి తొలి రోజు స్కోరుకు 51 పరుగులు జోడించింది. జో రూట్ (274 బంతుల్లో 122 నాటౌట్; 10 ఫోర్లు) అజేయగా నిలువగా... చకాచకా బౌండరీలు బాదిన ఒలీ రాబిన్సన్ (96 బంతుల్లో 58; 9 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో తొలి సారి అర్ధ శతకాన్ని సాధించాడు. వీరిద్దరు 8వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎట్టకేలకు రాబిన్సన్ను అవుట్ చేయడం ద్వారా జడేజా ఈ జోడీని విడగొట్టాడు. 347 పరుగుల వద్ద ఈ వికెట్ పడగా, మరో ఆరు పరుగుల వ్యవధిలో బషీర్ (0), అండర్సన్ (0) వికెట్లను కూడా జడేజానే తీయడంతో లంచ్‌కు ముందే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన యశస్వి ఈ సిరీస్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. లేదంటే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేది! కెప్టెన్ రోహిత్ (2) మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శుబ్‌మన్ గిల్‌తో జైస్వాల్ జోడి కుదరడంతో తొలి సెషన్లో మరో వికెట్ పడలేదు. ఇక రెండో సెషన్‌ను సాఫీగా నడిపిస్తున్న తరుణంలో బషీర్ స్పిన్ భారత్‌ను పదేపదే కష్టాల్లోకి నెట్టేసింది. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద గిల్‌ను బషీర్ ఎల్బీగా అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రజత్ పటిదార్ (17) క్రీజులోకి రాగా... జైస్వాల్ 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ మరోవైపు పటిదార్ బషీర్‌కే వికెట్ అప్పగించాడు. టీ విరామానికి ముందు అనుభవజు్ఞడైన ఆల్‌రౌండర్ జడేజా (12; 2 సిక్సర్లు)ను అవుట్ చేయడం ద్వారా బషీర్ భారత్‌ను చావుదెబ్బ తీశాడు. 131/4 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ధ్రువ్ నిలకడ ఆఖరి సెషన్లో కూడా స్పిన్ హవానే కొనసాగింది. దీంతో భారత్ 47 పరుగుల వ్యవధిలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. ముందుగా జట్టు స్కోరు 150 పరుగులు దాటిన కాసేపటికి యశస్విని బషీర్ బౌల్డ్ చేశాడు. ఇది జట్టును కోలుకోనివ్వలేదు. దాంతో స్వల్ప వ్యవధిలో సర్ఫరాజ్ (14), అశ్విన్ (1)లను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. 177 స్కోరు వద్ద 7 వికెట్లను కోల్పోయిన దశలో ధ్రువ్ జురెల్ (58 బంతుల్లో 30 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), కుల్దీప్ (72 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) చూపించిన తెగువ భారత్‌ను ఆలౌట్ కాకుండా ఆపగలిగింది. ఇద్దరు 17.4 ఓవర్ల పాటు ప్రత్యర్థి స్పిన్, పేస్‌కు ఎదురునిలిచి అబేధ్యమైన 8వ వికెట్‌కు 42 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 353 భారత్ తొలిఇన్నింగ్స్: యశస్వి (బి) బషీర్ 73; రోహిత్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 2; శుబ్‌మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 38; పటిదార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 17; జడేజా (సి) పోప్ (బి) బషీర్ 12; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) హార్ట్లీ 14; జురెల్ బ్యాటింగ్ 30; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్లీ 1; కుల్దీప్ బ్యాటింగ్ 17; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (73 ఓవర్లలో 7 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–112, 4–130, 5–161, 6–171, 7–177. బౌలింగ్: అండర్సన్ 12–4–36–1, రాబిన్సన్ 9–0–39–0, బషీర్ 32–4–84–4, హార్ట్లీ 19–5–47–2, రూట్ 1–0–1–0. -
వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ యాంటీ టైజమ్ కోర్టు తీర్పు చెప్పింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
మడకశిరలో లాకప్ మరణం
మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం లాకప్ డెత్ జరిగింది. మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన బషీర్ (35) లాకప్‌లో మరణించాడు. విషయం తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్ఐ సద్గురుడు, మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి బషీర్‌ను కొట్టి చంపారని ఆరోపించారు. తీవ్రతను గమనించిన ఎస్ఐ, కానిస్టేబుళ్లు అక్కడి నుంచి ఉడాయించారు. గత నెల 12న మడకశిరలో 20 టన్నుల ఐరన్ రాడ్ల అపహరణ కేసులో బషీర్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు అర్ధరాత్రి బషర్ లాకప్‌లో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. బషీర్‌ను పోలీసులు గత శుక్రవారమే స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యుల కథనం. కాగా, అనంతపురం ఎస్పీ సెంథిల్‌కుమార్ మడకశిర ఎస్ఐ సద్గురుడుతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.