breaking news
Awake
-
రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్లైన్లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్‌ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం -
మేల్కొని ఉండండి
గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. కానీ అనంతత్వంలో మేలుకొన్నవారికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది! కాలం పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకే కాబోలు. తనలో తాను లయమైపోతుంది. కాలానికి ఉన్న గొప్ప గుణం గాయాలను మాన్పడం. అదేంటి, గాయాలు చేయడం కూడా కదా అంటారా? అవును. గాయాలు అవుతాయి. కానీ, వాటిని చేసేది కాలం కాదు. మనం, మనలోని కోరికలు. 2018 ఎందరికో ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు, సుఖం, సంతోషం, బాధ, దుఃఖం వంటి అనుభూతులను మిగిల్చి ఉంటుంది. కొందరికి పదవీ యోగం, కొందరికి పదవీ‘వియోగం’, కొందరికి కాసుల పంట, ఇంకొందరికి కాసుల తంట. కొన్ని జననాలు, మరెన్నో మరణాలు. ఈ ఏడాది కాలం కొందరికి కల్యాణ యోగం కలిగించితే, ఇంకొకరి కాపురంలో కలతలు రేపి ఉండవచ్చు. కొందరు వాహనాలు కొనుక్కుని ఉంటే, ఇంకొందరు తామెంతో ఆశపడి కొనుక్కున్న వాహనాలను, ఇతర ఆస్తులను అయినకాడికి అమ్మేసుకుని ఉండవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి ఉన్న గండాలనుంచి గట్టెక్కించి ఉంటే, ఇంకొందరిని సుడిగండంలోకి నెట్టి ఉండవచ్చు. ఈ కాలం కలకాలం ఇలాగే నిలిచిపోనీ అని కొందరు కోరుకుంటే, ‘అబ్బబ్బ.. చేటుకాలం దాపురించిందిరా నాయనా! తొందరగా గడిచి పోతే బాగుండు’ అని మరికొందరు దండాలు పెట్టుకుంటూ ఉండచ్చు. మనం ఏమనుకుంటేనేం, ఎన్ననుకుంటేనేం.. గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. రాలేదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇంతవరకు కోట్ల సంవత్సరాలు వచ్చిపోయాయి. లెక్కలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి, లెక్కించలేనంతమంది మానవులు వచ్చి, వెళ్లిపోయారు. ఈ రోజు ఇప్పుడు.. ఇక్కడ మనం ఉన్నాం. ఏదో ఒకరోజు మనమూ వెళ్లిపోతాం.. ఒకసారి మేలుకోండి! గాఢంగా నిద్రపోతున్నవారు పండుగ జరుపుకోలేరు. కాలం ఎవరికోసమూ ఆగదని అంటారు. కాని, అనంతత్వంలో మేలుకొన్నవానికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది. రాబోయే నూతన సంవత్సరం కొత్త కలలు కనండి. అయితే, కొత్తగా ఆలోచించాలంటే పాతవాటిని మరచిపోవాలి. అప్పుడే కొత్తదనంచ దాని మంచీ చెడ్డా తెలుస్తాయి. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణయోగ్యంగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. కొత్త కలలను నెరవేర్చుకునేందుకు నిర్విరామంగా శ్రమ చేయండి. – డి.వి.ఆర్. -
ప్రేమ్‌రాజ్ వర్మ అరెస్ట్
హైదరాబాద్: ‘అవేక్ ఓ వరల్డ్’ పేరుతో అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రేమ్‌రాజ్ వర్మను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపారు. అంతకుముందు నింబోలిఅడ్డలోని ప్రభుత్వ బాలికల సదన్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణకు ప్రేమ్‌రాజ్ వర్మ హాజరయ్యారు. అనంతరం అతన్ని విచారణ నిమిత్తం కూషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘అవేక్’ చిన్నారులకు విముక్తి
ప్రేమ్ రాజ్ పై కేసు నమోదు హైదరాబాద్: నగర పరిధిలోని మౌలాలిలో ‘అవేక్ ఓ వరల్డ్’ సంస్థలో ఉంటున్న చిన్నారులకు అక్కడి బాధలనుంచి విముక్తి లభించింది. దీని నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ తన వద్ద ఉన్న చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడి, వారిని ఇబ్బందులకు గురిచేసిన సంగతి వెలుగు చూడడంతో చైల్డ్వెల్ఫేర్ కమిటీ బాధితులకు అతని చెరనుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ‘అవేక్ ఓ వరల్డ్’ పై రెండు రోజులపాటు ప్రాథమిక విచారణ జరిపిన తరువాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరో మారు విచారణ చేపట్టింది. ఆశ్రమంలో ఉన్న పిల్లల అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసిన తరువాత పూర్తి ఆధారాలతో సంస్థ నిర్వాహకుడిపై కుషాయిగూడా పోలీస్ స్టేషన్ లో ‘ఫోక్సో’ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా గత ఆరేళ్లుగా ప్రేమ్‌రాజ్ నడుపుతున్న ఈ సంస్థ చట్టవిరుద్ధమైందనీ, దీనిలో పిల్లలకు రక్షణ లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ పద్మావతి, సభ్యురాలు విజయాదేవి బృందం అభిప్రాయపడింది. తక్షణమే ఇక్కడి బాలికలను మేడిపల్లి లోని చైల్డ్ గెడైన్స్ సెంటర్‌కూ, మగపిల్లలను సైదాబాద్ లోని ప్రభుత్వ హోంకు తరలించారు. ‘అవేక్ ఓ వరల్’్డలో మొత్తం 35 మంది చిన్నారులు ఉండాల్సి ఉండగా ఏడుగురు మగపిల్లలు, 10 మంది బాలికలు కలిపి 17 మంది పిల్లలే ఉండడం గమనార్హం. మిగిలిన వారు ఏమయ్యారన్నది ప్రేమ్ రాజ్ స్పష్టం చేయాల్సి ఉంది. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నింబోలిఅడ్డాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రేమ్ రాజ్ హాజరు కావాల్సి ఉంది. ‘అవేక్’లో ఉన్న 7, 8 వ తరగతుల పిల్లల పరీక్షలు మధ్యలో ఉన్నందున వారి చదువులకు ఇబ్బందికలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కమిటీ చైర్పర్సన్ పద్మావతి,సభ్యురాలు విజయాదేవి పేర్కొన్నారు. పూర్తి విచారణ తరువాత చిన్నారులకు ప్రభుత్వం శాశ్వత భద్రత కల్పిస్తుందని ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ‘అవేక్’ నిర్వాకాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా ఖండించారు. తక్షణమే నిందితుడిపై పూర్తి విచారణ జరిపించి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


