arrest
-
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు. -
వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. -
25 మందిని వివాహం చేసుకున్న యువతి.. 26వ పెళ్లితో
జైపూర్: పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25మందిని పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లి కూతురు 26వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది.వివరాల్లోకి వెళ్లితే.. రాజస్తాన్‌కు చెందిన యువతి అనురాధా పాస్వాన్ది కడుపేదరికం, ఒంటరి జీవితం, నిరుద్యోగైన తమ్ముడు బాధ్యతను తానే చూసుకోవాలి. పెళ్లి చేసుకునేందుకు చేతిలో డబ్బు లేదు. వెరసీ.. పేదరికం నుంచి బయటపడేందుకు కతర్నాక్ ప్లాన్ వేసింది. తనకున్న అందం, తెలివితేటలతో పెళ్లి పేరుతో వరుస మోసాలకు పాల్పడింది.పెళ్లి చేసుకోవడం. ఆపై అత్తారింట్లో అనుకువగా ఉండటం. వారిని తన మాటలతో నమ్మించి ఇంట్లో ఉన్న బంగారం,డబ్బులు,ఖరీదైన వస్తువుల్ని అందినకాడికి దోచుకోవడం పరారవ్వడం. పేరు మార్చి, మకాం మార్చడం మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇలా తక్కువ సమయంలో 25మందిని వివాహం చేసుకుంది.ఇందుకోసం తానే ఓ గ్యాంగ్‌ను నడుపుతోంది. అమాయకులు, పెళ్లి కుమార్తె కోసం అన్వేషిస్తున్న వారి ఇంటికి తన గ్యాంగ్‌లోని మనిషిని పంపిస్తోంది. ఈ గ్యాంగ్ ఆమె ఫోటోలు, ప్రొఫైల్‌ను పెళ్లి కుమారులకు చూపిస్తారు. అనంతరం, పెళ్లికి ఒప్పిస్తారు. ఇందుకు గాను పెళ్లి కుమార్తెను చూసినందుకు పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి రూ.2లక్షలు వసూలు చేస్తారు. పెళ్లి తర్వాత ప్లాన్ ప్రకారం.. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అనురాధా పాస్వాన్ అత్తింటి వారితో అనుకువగా మెసులుతుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉడాయించాలనుకుంటే వెంటనే తన ప్లాన్‌లో భాగంగా కట్టుకున్న భర్త, ఇతర కుటుంబసభ్యులు తినే ఆహారంలో మత్తు మందు కలుపుతుంది. మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబ సభ్యులు ఆపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేస్తుంది.ఇప్పటివరకు 25 మందిని బురిడీ కొట్టించింది. ఈ క్రమంలో అనురాధా పాస్వాన్ చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె రూట్లోనే వెళ్లారు. నిత్యపెళ్లి కుమార్తెను, ఆమె ముఠా గుట్టురట్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దేవినేని అవినాష్ అరెస్ట్
-
కీలెరిగి వాతపెట్టిన ‘సుప్రీం’
యుద్ధంలో ఆయుధాలు మాత్రమే నిర్ణయాత్మక శక్తి కాదు... కోట్లాది పౌరులు ఒక్కటై వినిపించే స్వరం కూడా. కానీ పాకిస్తాన్‌తో తీవ్ర ఘర్షణలు తలెత్తిన వేళ ఆ సమష్టి స్వరానికి అవరోధం కల్పించేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి మన నేతల్లో కొందరు దేశాన్ని దిగ్భ్రమ పరిచారు. బహుశా అందుకే కావొచ్చు, కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ మంత్రి కన్వర్ విజయ్ షా క్షమాపణను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఈ నెల 28కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.ఐపీఎస్ అధికారులతో ఏర్పాటయ్యే ఈ బృందంలో ఒక మహిళా అధికారి ఉండాలనీ, దానికి ఐజీ ర్యాంకుకు తక్కువకాని అధికారి సారథ్యం వహించాలనీ ఉత్తర్వులిచ్చింది. ఈ తరహా విద్వేష ప్రసంగాలు బీజేపీ నేతల నుంచి మాత్రమే కాదు, కొందరు విపక్ష నేతల నుంచీ వినిపించాయి. చిత్రమేమంటే ఎక్కడా, ఎవరిపైనా పోలీసులు కేసులు పెట్ట లేదు, చర్యలకు సిద్ధపడలేదు. కానీ సాధారణ పౌరులు చిన్నపాటి భిన్నస్వరం వినిపించినా విరు చుకుపడ్డారు. ఇందుకు అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ ఉదంతమే నిదర్శనం. కల్నల్ సోఫియాను కీర్తిస్తున్న బీజేపీ శ్రేణులు విద్వేష ప్రచారానికి బలవుతున్నవారిని ఎందుకు పట్టించుకో రని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్నిగానీ, ఆ మహిళా అధికారుల్నిగానీ కించపరచలేదని, బాహాటంగా కనిపిస్తున్న ద్వంద్వ నీతిని ఎత్తిచూపటమే తన ఉద్దేశమని చెప్పినా ఆయన్ను అరెస్టు చేశారు.విజయ్ షాపై మధ్యప్రదేశ్ పోలీసులు సొంతంగా కేసు నమోదు చేయలేదు. అక్కడి హైకోర్టు సుమోటోగా తీసుకుని తక్షణం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాతైనా పోలీసులు సక్రమంగా చర్యలు తీసుకున్నది లేదు. ఎఫ్ఐఆర్ వాలకం గమనించిన హైకోర్టు చీవాట్లు పెట్టాకే వారికి జ్ఞానోదయమైంది. విజయ్ షా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గం హర్సూద్ నుంచి ఇప్పటికి 8 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. మంత్రిగా పని చేస్తున్నారు.సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం. బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు ఆ సంగతి మరిచిపోతున్నారు. విజయ్ షా వ్యాఖ్యల సంగతే తీసుకుంటే ఆయన అన్నది కేవలం కల్నల్ సోఫియా ఖురేషిని మాత్రమే కాదు... ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన చేసి ఆయనపై సంశయాలు రేకెత్తించే విధంగా మాట్లాడారు. యుద్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించటానికి నియమించిన ఇద్దరు మహిళా ప్రతినిధుల్లో ఒకరైన కల్నల్ సోఫియాను ‘ఉగ్ర వాదుల సోదరి’గా అభివర్ణించారు. ఉగ్రవాదులను ఆ వర్గం చేతే దెబ్బకొట్టించటానికి ప్రధాని ఆమెను తెలివిగా ఎంపిక చేశారన్నట్టు మాట్లాడారు.కల్నల్ సోఫియా నిర్వహించిన మీడియా సమావేశాలను గమనిస్తేనే ఆమె ఎంత సమర్థంగా, చతురతతో ఆ బాధ్యతను నెరవేర్చారో తెలు స్తుంది. గర్వించదగిన నేపథ్యం ఆమెది. దేశంలోని ప్రతి మహిళా స్ఫూర్తిదాయకంగా తీసుకోదగిన చరిత్ర ఆమెది. సైనిక కుటుంబం నుంచి వచ్చి, సైన్యంలో చేరి అందులోని వ్యక్తినే వివాహమాడి ప్రతి స్థాయిలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ కల్నల్ హోదా వరకూ ఎదిగారు. అటువంటామెను కేవలం ముస్లిం మహిళగా చూశారంటేనే... విజయ్ షా ఎంత ఉన్మాదపూరితంగా ఆలోచి స్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆయన ప్రసంగం తీరు చూసి దేశం యావత్తూ సిగ్గుపడుతోందని సుప్రీంకోర్టు అనక తప్పలేదు.ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశమంతా ఒక్కటై ఈ కష్టకాలాన్ని అధిగమించటానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దాని అర్థం, పర మార్థం విజయ్ షాకు కాస్తయినా అర్థం కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు, అటు తర్వాత క్షమా పణ చెబుతూ చేసిన ప్రకటన గమనిస్తే తెలుస్తుంది. నోరుజారి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే బహుశా కోర్టు చీవాట్లతో సరిపెట్టేదేమో! కానీ అందరి నేతల మాదిరే ‘ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే...’ అంటూ రాగం తీయడంతో వివాదంలో మరింత కూరుకుపోయారు.మంత్రి చెప్పిన క్షమాపణలో చిత్తశుద్ధి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చేస్తున్నది క్షమించరాని తప్పని ఎటూ తెలియలేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పార్టీ అధిష్ఠానం సైతం మందలించినా పునరాలోచన కలగలేదు, పరివర్తన రాలేదు. ఇలాంటివారిని నాలుగ్గోడల మధ్య మందలించటం కాదు... పదవి నుంచి సాగనంపివుంటే అలాంటివారికి అదొక హెచ్చరికగా ఉండేది. దేశ ప్రజలు కొనియాడేవారు. కానీ బీజేపీ ఆ పని చేయలేకపోయింది.సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ సైతం ఈ మాదిరి వ్యాఖ్యలే చేశారు. వైమానిక దళ అధికారులైన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల కులాల ప్రస్తావన చేశారు. బీజేపీకి కల్నల్ సోఫియా మతం తెలిసిందిగానీ ఈ అధికారులిద్దరూ పీడిత కులాలవారని తెలియదని, లేకుంటే వారిపైనా తప్పుడు వ్యాఖ్యనాలు చేసేవారని అన్నారు. ఈ బాపతు నాయకు లంతా మనుషుల్ని ఎంతసేపూ కులమతాల చట్రాల్లో చూస్తూ వారి సేవలనూ, అంకిత భావాన్నీ, సంకల్ప దీక్షనూ మరుగుపరుస్తారు. దేశభక్తి పేరుతో ఉన్మాదాన్నీ, విద్వేషాన్నీ పెంచి పోషిస్తారు. సుప్రీంకోర్టు స్పందించిన తీరు నేతలందరికీ గుణపాఠం కావాలి. సంక్షోభ కాలాల్లో మాత్రమే కాదు... సాధారణ సమయాల్లోనూ జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసుకోవాలి. -
దారుణం, ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన యువతి.. పోలీసుల అదుపులో నిందితురాలు
సాక్షి,హైదరాబాద్: అమీన్పూర్లో దారుణం జరిగింది. సోమవారం అమీర్‌పూర్‌లో మహేశ్వరీ అనే యువతి కారు నేర్చుకుంటూ చిన్నారులపైకి ఎక్కించింది. ఈ దుర్ఘటనలో పదేళ్ల మణిధర్ వర్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏకవాణి మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! -
యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అరెస్ట్: కారణం ఇదే..
యూకో బ్యాంక్ మాజీ సీఎండీ 'సుబోధ్ కుమార్ గోయెల్'ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. బ్యాంకు రుణ మోసం కేసులో.. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుబోధ్ కుమార్ గోయెల్‌ను అరెస్ట్ చేసి కోల్‌కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టు ముందు ఏదీ హాజరుపరచింది. కాగా యూకో బ్యాంక్ మాజీ సీఎండీని మే 21 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.యూకో బ్యాంక్ సీఎండీగా గోయెల్ పనిచేసిన సమయంలో కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు భారీ మొత్తంలో నిధులను మంజూరు చేశారు. ఇలా మంజూరైన రూ. 6,210.72 కోట్ల నిధులను ఆ సంస్థ దుర్వినియోగం చేసిందని.. సీబీఐ దర్యాప్తులో తెలిసింది. అంతే కాకూండా ఋణ మంజూరు విషయంలో.. సుబోధ్ కుమార్ గోయెల్‌ను ముడుపులు అందినట్లు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఇదీ చదవండి: సంపన్న నటుడు.. టామ్ క్రూజ్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. -
హత్యాయత్నం కేసు.. ప్రముఖ నటి అరెస్ట్
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయ్ లాండ్ కు వెళుతున్న క్రమంలో ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. . ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయిఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ఆధారంగా తమ బృందం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని సదరు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక 2023లో తెరకెక్కిన ముజిబ్: ద మేకింగ్ ఆఫ్ నేషన్ చిత్రంలో షేక్ హసీనా పాత్రలో నటించింది నుసారత్ ఫరియా. -
నందిగం సురేష్ అరెస్ట్
-
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
ఇది స్టేట్ ఫ్యాక్షనిజం కాదా?
ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్ సర్కార్ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్ అంశాన్ని నెగెటివ్ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్ఎఫ్ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్ సర్కార్ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్ ‘యెల్లో ట్యాక్స్’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
-
అరెస్ట్ చేసే ముందు చెప్పండి బట్టలు సర్దుకుని రెడీగా ఉంటా
-
IAS, IPSల అరెస్టులు సరికావు.. అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి
-
కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్
-
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. లష్కరే తొయిబా సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుద్గాం జిల్లాలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా.. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉగ్రవాదులను ముజామిల్ అహ్మద్, ఇష్ఫాక్ పండిట్, మునీర్ అహ్మద్‌గా గుర్తించారు. వారి నుంచి పిస్టల్, హ్యాండ్ గ్రెనేడ్‌తో సహా పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా, మణిపూర్‌లోని చండేల్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు మృతి చెందారు. భారత్–మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని కొండప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. చండేల్ జిల్లా ఖెంగ్జోయ్ తహశీల్‌లోని న్యూ సంటాల్ గ్రామం వద్ద సాయుధులు సంచరిస్తున్నట్లు కోహిమాలోని ఈస్టర్న్ కమాండ్ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ మేరకు బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. - -
టీజీసీఎస్బీ అంతర్రాష్ట్ర ఆపరేషన్.. 20 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గుజరాత్లో నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సైబర్ నేరాలకు పాల్పడే వారికి మ్యూల్ బ్యాంకు ఖాతాలు (ఒకరి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను ఇతరులకు వినియోగించుకునేందుకు ఇవ్వడం) సరఫరా చేస్తున్న ఏజెంట్లు, మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు లావాదేవీల్లో సహకరిస్తున్న ముఠా గుట్టురట్టు చేసింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుజరాత్‌లోని సూరత్‌లో మే 1 నుంచి మే 10 వరకు ప్రత్యేక ఆపరేషన్‌లో 20 మందిని అరెస్టు చేసింది. వీరిలో 14 మంది మ్యూల్ ఖాతాదారులు, ఆరుగురు ఏజెంట్లు ఉన్నారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణలో 60కి పైగా, దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో పేర్కొన్న ప్రకారం..తెలంగాణలోని ఏడు సైబర్ క్రైం పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా పలు అనుమానాస్పద నగదు ఉపసంహరణలు, చెక్కుల ద్వారా జరిగిన లావాదేవీలపై టీజీసీఎస్బీ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రాథమిక విచారణలో 27 మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా రూ.44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు తేలింది. తెలంగాణలోనే ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా రూ. 22,64,500 విత్‌డ్రా చేసుకున్నట్టు గుర్తించారు.అరెస్టయిన నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఒక బ్యాంకు ఉద్యోగి (వాపీ శాఖకు చెందిన డీసీబీ బ్యాంకు రిలేషన్íÙప్ మేనేజర్) ఉన్నారు. వీరు వ్యాపార, పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్, పార్ట్–టైమ్ ఉద్యోగ సహా వివిధ సైబర్ మోసాల్లో పాల్గొన్నట్టు శిఖాగోయల్ తెలిపారు. అరెస్టు అయిన నిందితుల నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, నాలుగు ఏటీఎం కార్డులు, ఐదు చెక్ బుక్‌లు, రెండు పాన్‌కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులు, ఇతర నేర సంబంధిత డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.సూరత్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీలు ఫణీందర్, రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు మహేందర్, రవికుమార్‌తోపాటు ఆపరేషన్‌కు సహకరించిన ఎస్పీ దేవేందర్‌సింగ్, డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, హరికిషన్‌లను శిఖాగోయల్ అభినందించారు. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే 1930 లేదా ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
మల్కన్‌గిరి కేంద్రంగా గంజాయి ప్రాసెసింగ్
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్‌గిరి కేంద్రంగా కొన్ని ముఠాలు గంజాయి ప్రాసెసింగ్ చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ కీలక ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి అంతా మల్కన్‌గిరి అటవీ ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలు.. అక్కడే ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. మల్కనగిరి నుంచి గంజాయిని హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేయగా, అసలు విషయం వెలుగుచూసింది. ⇒ ఉప్పల్ హెచ్‌సీఎల్ మల్లాపూర్‌లో జరిపిన సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందికి చిక్కిన నిందితులు వివేక్‌రెడ్డి, మధుకిరణ్‌ల ఫోన్లలో ఈ మేరకు కీలక వీడియోలు లభించాయి. వీటిల్లో టన్నుల కొద్ది గంజాయిని కుప్పగా పోసి కొందరు వాటిని ప్యాకింగ్ చేస్తూ..గంజాయి రవాణా గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గంజాయి ముఠా కార్యకలాపాలను క్షణ్ణంగా వివరించే ఇలాంటి వీడియోలు దర్యాప్తు బృందాలకు చిక్కడం ఇదే తొలిసారి అని మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రాసెసింగ్ నుంచి ప్యాకింగ్ దాకాఅటవీ ప్రాంతంలో సేకరించిన గంజాయిని ఎండబెట్టిన తర్వాత అంతా ఒక్కచోటకు తెస్తారు. కుప్పలుగా పోసి..దానిని కిలోల చొప్పున అవసరం మేరకు ఎన్ని కిలోల ప్యాకెట్లు కావాలంటే అంత బరువు తూచి ఒక కవర్లో పెడతారు. ఈ కవర్లను చతురస్రాకార డబ్బాల్లో కూర్చి వీలైనంత వరకు ముద్దగా మార్చుతున్నారు. ఆ తర్వాత ఆ చతురస్రాకార బాక్స్‌ల్లోని గంజాయిని ప్రెసింగ్ రాడ్ కింద పెట్టి పదిమంది తిప్పుతూ వీలైనంత మేరకు తక్కువ పరిమాణంలో కనిపించేలా ముద్దలా అయ్యేలా చేస్తున్నారు. దీనిపై ప్లాస్టర్‌తో సీల్ చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల బరువు ఎక్కువగా ఉన్నా..ప్యాకెట్ సైజు కుదించబడడంతోపాటు, గంజాయి రవాణా సమయంలో వాసన రాకుండా చేస్తున్నారు. దీన్ని దళారులు, గంజాయి ముఠాలతో డీల్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలం, రాజమండ్రి మార్గాల్లో రోడ్డు మార్గంలో, లేదంటే ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రైలు మార్గంలో దేశంలోని పలు పట్టణాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి. రూ.53 లక్షల విలువైన గంజాయి సీజ్ మల్లాపూర్‌లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని ఎక్సైజ్‌శాఖ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.53 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా ముఠాకు చెందిన దగ్గుమల్లి మధు కిరణ్ , కట్ల వివేక్‌రెడ్డిలను అరెస్టు చేయగా, ఏ–1 మల్కన్‌గిరి జిల్లాకు చెందిన రాంబాబు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
రూ.70 లక్షల లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్/వైరా: ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్ (ఎక్సెంప్షన్స్) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడు జీవన్‌లాల్ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు. మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్ జీవన్‌లాల్ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్‌లాల్ లవిడియాతోపాటు శ్రీరామ్ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. -
అసెంబ్లీలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’?.. ఎమ్మెల్యే అరెస్ట్!
ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జైపూర్: భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ జైపూర్ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్ చేశారు. అయితే చివరకు డీల్ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, స్పీకర్ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. భారత్ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్ ఆదివాసీ పార్టీ కన్వీనర్, బంస్వారా ఎంపీ రాజ్‌కుమార్ రావోత్ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది. -
బీఎస్ఎఫ్ అదుపులో పాక్ రేంజర్
-
Rajasthan: జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై 40 ఏళ్ల జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. భారత సైన్యం కదలికల సమాచారం పంపినట్లు విచారణలో తేలింది. జైసల్మేర్.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల గూఢచర్యకు కేంద్రంగా మారిందని అధికారులు గుర్తించారు.2022లో ఆపరేషన్ సర్హద్‌లో 36 మంది అనుమానిత గూఢచారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐఎస్ఐ.. భారత సైనిక కార్యకలాపాల సమాచారం సేకరించేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని గుర్తించారు. భారత దేశ జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు గూఢచర్యం పాకిస్తాన్‌కు ఒక సాధనంగా మారింది. భారత్-పాకిస్థాన్‌ల భౌగోళిక-రాజకీయ పోరాటంలో భాగంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. -
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కాంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కాంలో దళారి మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు.ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్‌కి పారిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన మొయినుద్దీన్‌ను ఇమ్మిగ్రేషన్ సహకారంతో శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్టులోనే ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటివరకు గొర్రెల స్కాములో 17మంది అరెస్టయ్యారు. వారిలో మాజీమంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండి రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా మాధవరెడ్డి అరెస్ట్
-
అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్‌మెయిలే..!
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్థిని అఖిల (23) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమజంటలు, మద్యం తాగేవారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలుచేసే పల్లపోతుల అనిల్‌కుమార్‌రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెల్లడైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్‌కుమార్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మన్నూరు పోలీసుస్టేషన్లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్‌రింగ్‌రోడ్డు, పులివెందుల టౌన్ ఔటర్ రింగ్ రోడ్, కదిరిరోడ్డులోని బట్రపల్లె మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం తాగేవారిని టార్గెట్ చేసుకునేవాడు. పోలీసుశాఖకు చెందిన వాడినని చెప్పి.. వారి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదుకాకుండా చూడాలంటే డబ్బులివ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరివద్ద లాక్కునేవాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్‌ఫాల్ చూడటానికి వెళ్లిన అఖిల, ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలను, డబ్బును తీసుకున్నాడు. అనంతరం అఖిల, ఆమె స్నేహితులకు ఫోన్‌చేసి బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్లో ఫిబ్రవరి 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో అనిల్‌కుమార్‌రెడ్డి బ్లాక్‌మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిపై ఇప్పటికే గుత్తి పోలీసుస్టేషన్లో పొక్సో, అనంతపురం త్రీటౌన్ పీఎస్‌లో దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పోలీసుస్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులున్నాయి. దొంగతనం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది. -
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తనని అరెస్ట్ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు . pic.twitter.com/ER4CR2jpBF— Kesineni Nani (@kesineni_nani) April 27, 2025 నా పోరాటం ఆగదుఅంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
టీడీపీ నేత అరెస్ట్
-
24 ఏళ్ల కిందటి కేసు.. మేధా పాట్కర్ అరెస్టు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సుమారు 24 ఏళ్ల కిందట దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు, ఈ కేసుకు సంబంధించిన ప్రొబేషన్ బాండ్ అమలు ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో క్రవారం నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్ అరెస్ట్‌ను సౌత్ఈస్ట్ డీసీపీ రవి కుమార్ సింగ్ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కిందటే ఢిల్లీ సాకేత్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో న్యాయ స్థానం నుంచి మేధా పాట్కర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, కోర్టు ఆదేశాలను ఆమె ఉల్లంఘించారని, ప్రొబేషన్ బాండ్ సమర్పించలేదని, రూ. లక్ష జరిమానా చెల్లించలేదంటూ వారెంట్‌లో పేర్కొంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్ కుమార్ సక్సేనా(VK Saxena)పై ఆమె అప్పట్లో కేసు వేశారు. అప్పుడు ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు. అయితే ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు.సక్సేనా పిరికిపంద అని, హవాలా లావాదేవీల్లో ఆయన హస్తం ఉందని ఆరోపించారామె. నవంబర్ 5, 2000 సంవత్సరంలో మేధా పాట్కర్ వీకే సక్సేనాపై వ్యాఖ్యలు చేయగా.. పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తోచ్చింది. అంతేకాదు.. కిందటి ఏడాది జులై1వ తేదీన ఆమె ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
‘అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు’.. హైకోర్టులో పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ హైకోర్టులో (telangana highcourt) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (brs mla padi kaushik reddy)కి ఊరట దక్కింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.50లక్షలు ఇవ్వాలంటూ క్వారీ యజమాని మనోజ్‌ను పాడి కౌశిక్‌రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయంపై మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే,ఈ నేపథ్యంలో తనపై నమోదైనే కేసును కొట్టి వేయాలని కోర్టుతో పాడికౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పాడికౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్..2023 అక్టోబర్25న 25లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని ప్రభుత్వం తరుఫు న్యాయవాది (public prosecutor) హైకోర్టు ప్రశ్నించింది.అందుకు పాడికౌశిక్ రెడ్డి బెదిరించారు కాబట్టే రూ.25 లక్షలను కౌశిక్‌రెడ్డికి మనోజ్ చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని ప్రశ్నించిన హైకోర్టు..కౌశిక్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది. -
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపీనాథ్ పై అక్రమ కేసు
-
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై నటి జత్వానిని ఆయన వేధించారనే అభియోగాల కింద సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు. మరోవైపు.. పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని విపరీతంగా ప్రయత్నించింది. కక్ష పూరితంగా కేసులు నమోదు చేయించగా.. హైకోర్టు ఆ ఇద్దరు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఆర్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేయించింది. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణి అరెస్ట్
దాచేపల్లి: రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుపై నడికుడికి చెందిన టీడీపీ నేత చిలుమూల దుర్గారావు మార్చి 1న చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. కృష్ణవేణిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలు పత్రాలపై కృష్ణవేణితో సంతకాలు చేయించుకున్నట్లు తెలిసింది.రాత్రంతా ఆమెను దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. గురువారం సాయంత్రం అరెస్ట్ చూపి.. గురజాల ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గురజాల కోర్టులో హాజరుపరచగా ఆమెకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా, కృష్ణవేణిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు, న్యాయవాది రొళ్ల మాధవి పరామర్శించారు. కృష్ణవేణి అరెస్టు విషయం తెలియడంతో వైఎస్సార్సీపీ నాయకులు కోట కృష్ణ, షేక్ సుభానీ, కందుల జాను, తండా అబ్దుల్‌సత్తార్, మందపాటి రమేశ్‌రెడ్డి, కొప్పుల సాంబయ్య, షేక్ జాకీర్ హుస్సేన్, కుందురు తిరుపతిరెడ్డి, షేక్ ఇమామ్‌వలి తదితరులు పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. -
బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్
-
వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
బ్రస్సెల్స్: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025 -
గోరంట్ల మాధవ్ కేసులో పోలీసుల సస్పెండ్.. పేర్ని నాని రియాక్షన్
-
3 నెలల్లో 2,586 మంది పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వెకిలిచేష్టలతో అమ్మాయిలను వేధించే ఆకతాయిల భరతం పడుతున్నాయి షీ టీమ్స్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 331 షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొదటి త్రైమాసికంలో మొత్తం 2,586 మంది ఆకతాయిలను షీ టీమ్స్ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు మహిళా భద్రతా విభాగం అధికారులు ‘ఎక్స్’లో తెలిపారు. అదేవిధంగా 703 మంది మైనర్లకు కౌన్సెలింగ్ చేసినట్టు పేర్కొన్నారు.మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలు ఎక్కువగా ఉంటున్న హాట్ స్పాట్స్‌పై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గత మూడు నెలల్లో ఇలాంటి 15,249 హాట్స్పాట్లను గుర్తించి షీ టీమ్స్ బృందాలతో నిఘా పెట్టినట్టు వివరించారు. అదేవిధంగా షీ టీమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా మొత్తం 3,080 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.ఆకతాయిల వేధింపులపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ అధికారులు సూచించారు. బాధితులు వాట్సాప్ నంబర్ 8712656856లో ఫిర్యాదు చేయవచ్చని లేదా డయల్ 100కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఆకతాయిలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రెడ్ బుక్ రాజ్యాంగానికి మరో 11 మంది పోలీసులు బలి
-
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సాయినగర్‌లోని శ్రీసాయిరామ్ అపార్ట్మెంట్లో స్వప్న, నవనీత అనే మహిళలు ఫ్లాట్ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఫ్లాట్‌పై దాడిచేసి స్వప్న, నవనీతతో పాటు ఆకుల తనీష్ పెనుమల కళ్యాణ్బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2,930 నగదు, 8 సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. చోరీ కేసులో నిందితుడి రిమాండ్ ఘట్కేసర్: ఓ ఇంట్లో వెండి వస్తువులు చోరీచేసిన పాత నేరస్తుడిని ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మేడపాటినగర్‌లో నివసించే సునీత ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెండి వస్తువులు అపరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. పోలీసుల దర్యాప్తులో మేడపాటినగర్కు చెందిన మహమ్మద్ మొయిన్ షరీఫ్ (23)గా తేలింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన వస్తువులను తిరిగి స్వా«దీనం చేసుకున్నారు. అతడు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడని, పలుసార్లు జైలుకు కూడా వెళ్లొచి్చనట్లు పోలీసులు తెలిపారు. -
చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్ పై అంబటి రియాక్షన్
-
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. -
వ్యభిచార గృహాలతో సంబంధాలు: అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్
క్లీన్ వాటర్ స్టార్టప్ అయిన 'గ్రాడియంట్' సీఈఓ అనురాగ్ బాజ్‌పేయ్ (Anurag Bajpayee)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్నత స్థాయి వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు, బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు వెల్లడించారు.భారత సంతతికి చెందిన అనురాగ్ బాజ్‌పేయ్ మాత్రమే కాకుండా.. వ్యభిచార గృహాల్లో గడిపిన కేసులో వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు మొదలైనవారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు మహిళలతో గడపడానికి గంటకు 600 డాలర్లు (రూ. 50వేలు కంటే ఎక్కువ) వెచ్చించేవారు. వీరు ఎంచుకునే మహిళలలో ఎక్కువ మంది.. అక్రమ రవాణాకు గురై వ్యభిచార కూపంలో ఇరుక్కున్నవారే అని భావిస్తున్నారు.వ్యభిచార కుంభకోసం కేసులు తమ బాస్ అరెస్ట్ అవ్వడంతో.. కొందరు ఉద్యోగులు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే గ్రాడియంట్ కంపెనీ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచింది. న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.ఎవరీ అనురాగ్ బాజ్‌పేయ్?అనురాగ్ బాజ్‌పేయి బోస్టన్‌కు చెందిన గ్రేడియంట్ సంస్థకు సహా వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ కంపెనీ మురుగు నీటిని శుభ్రం చేస్తుంది. భారతదేశంలో జన్మించిన బాజ్‌పేయ్ క్లీన్టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఈయన నాయకత్వంలో కంపెనీ సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, ఫుడ్, డ్రింక్స్ వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తోంది. కంపెనీ మొత్తం 25 కంటే ఎక్కువ దేశాలలో 2500 కంటే ఎక్కువ సౌకర్యాలలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పాఠశాల విద్యను పూర్తి చేసిన బాజ్‌పేయ్ 2006లో మిస్సోరి కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత ఎంఐటీలో అడ్వాన్స్డ్ డిగ్రీలు, 2008లో మాస్టర్ ఆఫ్ సైన్స్, 2012లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో PhD పట్టా పొందారు. పరిశోధనల సమయంలో ఈయన పారిశ్రామిక డీశాలినేషన్ & నీటిని శుద్ధి చేయడం వంటి వాటిపై రీసర్చ్ చేశారు. -
BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్?
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివిధ కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ముఖ్యంగా ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే అరెస్ట్ భయంతో గత కొన్ని నెలలుగా ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో తన తల్లి అంత్యక్రియల కోసం వచ్చిన ఆయన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల కోసం ఆయన్ని బోధన్‌కు తీసుకెళ్లి ఆపై స్టేషన్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. షకీల్ అమీర్ మహమ్మద్ గతంలో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు బోధన్ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.సాహిల్‌ను తప్పించి.. 2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వినియోగదారుల ఫోరం అరెస్ట్ వారెంట్ ఇవ్వజాలదు
కోల్‌కతా: వినియోగదారుల ఫోరంలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ జైలులో నిర్బంధించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రమే అధికారముంటుందని పేర్కొంది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. తన ఆదేశాల అమలు కోసం సీపీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)కింద వారెంట్ ఇచ్చేందుకు అధికారం లేదని పేర్కొంది. ఇటువంటి ఆదేశాలు వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధనల పరిధిని అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలు కోసం 2013లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. అతడు రూ.25,716 బకాయి చెల్లించలేదంటూ ఫైనాన్స్ కంపెనీ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో, బకాయిని పూర్తిగా చెల్లించిన ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తనకు తిరిగి ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆదేశాలను ఫైనాన్స్ కంపెనీ యజమాని పట్టించుకోలేదు. దీంతో, ఫోరం అతడి అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. ఫోరం అధికారాలను సవాల్ చేస్తూ అతడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఫోరం వారెంట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
Manipur: నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
బిష్ణుపూర్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్(Manipur)లో ఉగ్రవాదులు కలకలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో రెండు నిషేధిత సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. బిష్ణుపూర్‌లోని మోయిరాంగ్ ఓక్షోంగ్బంగ్లో నిషేధిత కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (పీడబ్ల్యూజీ)సభ్యుడిని శనివారం అరెస్టు చేయగా, తాజాగా ఇదే జిల్లాలోని నంబోల్ బజార్లో కేసీపీ క్రియాశీల సభ్యుడైన ఒక టీనేజర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిష్ణుపూర్‌లోని నింగ్‌థౌఖోంగ్‌లో నిషేధిత కేసీపీ(పీడబ్ల్యుజీ)కి చెందిన చురుకైన క్యాడర్‌ను అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో జరిగిన తనిఖీల్లో భద్రతా దళాలు.. యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(United People's Party of Kanglipak) (యుపీపీకే) సభ్యుడిని అరెస్టు చేశాయని ఆయన పేర్కొన్నారు. అలాగే శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన తనిఖీల్లో పోలీసులు ఉగ్రవాదులకు చెందిన తుపాకీలను స్వాధీనం చేసుకున్నారన్నారు.శుక్రవారం నాడు బిష్ణుపూర్, తౌబాల్,ఇంఫాల్ తూర్పు జిల్లాలలో రెండు నిషేధిత సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు(Security forces) అరెస్టు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిషేధిత సంస్థ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్-పాంబే)కి చెందిన ఇద్దరు సభ్యులను బిష్ణుపూర్ జిల్లాలోని నంబోల్లో అరెస్టు చేశారు. వీరు 47 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని పట్సోయ్ పార్ట్-4 నివాసి లైతోంజమ్ దిలీప్ సింగ్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి నుండి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఒక ఎం20 పిస్టల్, ఒక మ్యాగజైన్, రెండు కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు -
ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు
కర్ణాటక: ఓ క్రీడా శిక్షకుడు కామాంధునిగా మారి కటకటాలు లెక్కిస్తున్నాడు. మైనర్ బాలికపై దారుణానికి పాల్పడిన కేసులో బ్యాడ్మింటన్ కోచ్‌ను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితడు సురేశ్ బాలాజీ (26), వివరాలు.. ఇటీవలే టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్ బాలాజీ అనే బ్యాడ్మింటన్ కోచ్ వద్ద ఆట నేర్చుకుంటోంది. తమిళనాడుకు చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆట నేర్పించే నెపంతో అతడు బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడేవాడు, ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడు.ఇలా గుట్టురట్టుఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేశారు. అతని మొబైల్ఫోన్ని పోలీసులు తనిఖీ చేయగా 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారి మీద కూడా అత్యాచారాలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోచ్ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో తెలిపింది. బాలికల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇతడు దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుని విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది. -
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్ చేసింది. అహ్మద్ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, అహ్మద్ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసింది. -
నైజీరియాకు డ్రగ్స్ సొమ్ము
సాక్షి, హైదరాబాద్: మన దేశంతోపాటు విదేశాల్లో నిషేధిత మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) పోలీసులు రట్టు చేశారు.గత ఏడేళ్లలో ఈ ముఠా రూ.125 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య టీజీఏఎన్‌బీ ఎస్పీలు రూపేశ్, రఘువీర్‌తో కలిసి శనివా రం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠాలోని ఇద్దరు నైజీరియన్లతోపాటు ఒక ఫారెక్స్ ఏజెంట్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. అంతా వాట్సాప్‌లోనే.. బ్లెస్సింగ్ అలియాస్ జో అనే మహిళ హైదరాబాద్‌లోని నైజీరి యన్ డ్రగ్స్ ముఠా కింగ్‌పిన్ ఎబుకా సుజీ సోదరుడు కేలేశీకి ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి 200 గ్రాముల కొకైన్ తీసుకువస్తుండగా 2024 జూలైలో టీజీఏఎన్‌బీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను విచారించగా ఈ ముఠా డొంకంతా కదిలింది. ⇒ డ్రగ్స్ ఆర్డర్ తీసుకోవడం, డబ్బు అందిన విషయాన్ని నిర్ధారించుకోవడం, ఒక ప్రదేశంలో డ్రగ్స్‌ను వదిలి..వాటి ఫొటో, లొకేషన్‌ను కస్టమర్‌కు చెప్పి.. డ్రగ్స్ వారికి చేరవేయడం వరకు అన్నింటికీ వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ⇒ కింగ్‌పిన్ ఎబుకా సుజీ ఆదేశాలతో డ్రగ్స్‌ను స్థానిక కస్టమర్లకు చేర్చడంలో కెలేశీకి ఎమ్మా, బిగ్జో సహకరించేవారు. ఎబుకా సుజీ తన డ్రగ్స్ దందాను అమెరికాలోనూ మొదలు పెట్టినట్లు గుర్తించారు. ⇒ యూఎస్ కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తీసుకోకుండా తొలుత ఇండియాకు తరలించి ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు ఈ ముఠా తరలిస్తోంది. యూఎస్ నుంచి డబ్బును భారత్‌కు చేర్చేందుకు పాత మలక్‌పేటకు చెందిన మహ్మద్ మతీన్ సిద్ధిఖీ అనే పైన్ మల్టీ సర్విసెస్ ప్రొప్రైటర్ సహకారం తీసుకునేవారు. ⇒ మతీన్ తనకున్న పరిచయాలతో గోయమ్ ఫారెక్స్‌కు చెందిన ఆనంద్ జైన్ ద్వారా అమెరికాలోని పలువురు భారతీయుల బ్యాంకు ఖాతాలు సేకరించాడు. డ్రగ్స్ అమ్మగా వచ్చిన సొమ్మును ఆ ఖాతాల్లో వేయించి భారత్‌లోని వారి బంధువుల ద్వారా ఇక్కడ తీసుకునేవారు. ⇒ ఆ డబ్బును ముంబైకి వస్త్ర వ్యాపారం కోసం వచ్చే నైజీరియన్ వ్యాపారులు డానియల్, మాలిక్, స్టాన్లీల ద్వారా నైజీరియాకు తరలించేవారు. ఇలా ప్రతిదశలోనూ ఎవరికి వారు కమీషన్లు తీసుకుంటూ దందా చేస్తున్నారు. ఇలా 40 శాతం వరకు కమీషన్లు తీసుకుని, మిగిలిన మొత్తాన్ని నైజీరియాలోని ఎబుకా సుజీకి చేరవేస్తున్నారు. – ఈ నెల 3న ఏ–1 ఎమ్మా, ఏ–2 బిగ్ జో, ఏ–3 మతీన్ సిద్దిఖీలను అరెస్టు చేశారు. డివైన్ ఎబుకా సుజీ, కేలేశీతోపాటు సయ్యద్ సోహిల్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ నసీర్ అహ్మద్, మహ్మద్ అవైజ్, మహ్మద్ మతీన్, సయ్యద్ యూసుఫ్ హక్, ఆనంద్‌జైన్, శాంతిలాల్ సురేశ్కుమార్జైన్, ఉత్తమ్ జైన్ పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తేనే డ్రగ్స్ కట్టడి డ్రగ్స్ దందా మొత్తం ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఉంది. ఈ ముఠాల ఆర్థిక మూలాలను దెబ్బకొడితేనే డ్రగ్స్ కట్టడి సాధ్యం. డ్రగ్స్ వల్ల భారత యువత బానిసలుగా మారుతున్నారు. చదువుకోసం నైజీరియా సహా పలు దేశాల నుంచి వచ్చే యువత డ్రగ్స్ దందాలోకి దిగి చెడిపోతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ధనికులు సైతం డ్రగ్స్ వాడకాన్ని మానుకోవాలి.టీజీఏఎన్‌బీ సాంకేతికంగా, నైపుణ్యం పరంగా ఎంతో పటిష్టంగా మారింది. డ్రగ్స్ దందా చేసేవారిని వదిలే ప్రసక్తే లేదు. 2020 నుంచి 260 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపాం. విదేశీయులకు ఇల్లు, అపార్టమెంట్లు అద్దెకు ఇచ్చేముందు ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్స్ (ఎఫ్ఆర్ఆర్ఎ)కు ఫామ్–సీలో, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో వారి వివరాలు ఇవ్వాలి. – సందీప్ శాండిల్య, టీజీఏఎన్‌బీ డైరెక్టర్. -
మంగళగిరిలో డ్రగ్స్, గంజాయి
మంగళగిరి: ఇటీవల అమరావతి పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోయాయి. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన కొకైన్ వంటి డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గంజాయి అయితే అన్నిచోట్లా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి మంగళగిరిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న యువకులను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఇటీవల మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఒక మహిళ దారుణ హత్యకు గురికాగా... ఇప్పుడు అక్కడికి కొద్ది దూరంలోనే ఏకంగా డ్రగ్స్ విక్రయిస్తూ యువకులు దొరకడంతో అమరావతి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నలుగురి అరెస్ట్... విజయవాడ కృష్ణలంకకు చెందిన నందం నిఖిల్, రాణిగారితోటకు చెందిన బొట్ల కాశీవర్ధన్ అనే యువకులు శుక్రవారం రాత్రి మంగళగిరిలోని ఎర్రబాలెం డిలైట్ డాబా సెంటర్ వద్ద కొకైన్, గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా... మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని 8.71 గ్రాముల కొకైన్, 1,200 గ్రాముల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.వారిని విచారించగా, తమకు కృష్ణలంకకు చెందిన పెండ్యాల సాయికుమార్, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన గొర్ల గిరీష్‌రెడ్డిలు కొకైన్, గంజాయి విక్రయిస్తారని చెప్పారు. సాయికుమార్, గిరీష్రెడ్డిలను కూడా అరెస్ట్ చేసి విచారించగా..వారికి విజయవాడకు చెందిన సొహైల్, శామీర్లు కొకైన్ గంజాయి విక్రయిస్తారని తెలిపారు. పరారీలో ఉన్న సొహైల్, శామీర్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ విభాగం ఐజీ ఏకే రవికృష్ణ శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారించారు. -
100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు. -
ప్రేమోన్మాది నవీన్ అరెస్ట్
-
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్/హిమాయత్‌నగర్: హెచ్‌సీయూ భూము లను పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళతారన్న ముందస్తు సమాచార నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్అరెస్ట్ చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పోలీసులు చుట్టుముట్టి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఓయూ, కేయూ భూములు కూడా అమ్ముతారేమో: ఏలేటి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, రాబోయే రోజుల్లో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది. భూములు అమ్మితే కానీ ప్రభుత్వం నడవని పరిస్థితి. రియల్ ఎస్టేట్ దందా చేయడానికే ఈ ప్రభుత్వం ఉందా’అని ఏలేటి ప్రశ్నించారు. మంగళవారం హెచ్‌సీయూ సందర్శనకు వెళుతున్న తన హౌస్అరెస్ట్, బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఆయన ఖండించారు. వెంటనే అఖిలపక్ష బృందాన్ని హెచ్సీయూకు తీసుకెళ్లి చూపించాలని డిమాండ్ చేశారు. ‘త్వరలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తాం. వర్సిటీల భూముల జోలికి వెళితే సహించేది లేదు. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం’అని హెచ్చరించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలైన ప్రొఫెసర్ కోదండరామ్, కూనంనేని సాంబశివరావులకు హెచ్‌సీయూ భూముల వివాదం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వేలాన్ని వెనక్కి తీసుకోవాలి: పాయల్ శంకర్ హెచ్‌సీయూ భూము ల వేలాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసు కోవాలని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనా రాయణ గుప్తాతో కలి సి ఆయన మీడియాతో మాట్లాడారు ‘ధరణి పేరుతో నాడు కేసీఆర్ దోపిడీ చేశారు. భూమాత పేరుతో నేడు కాంగ్రెస్ భూ దందా చేయడానికి ప్రయ త్నిస్తోంది’అని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై వాస్తవ పరిస్థితు లకు తెలుసుకుందామని వెళుతుంటే పోలీసులు తమను నిర్బంధించారని, అణచివేత ప్రజాపాలన అవుతుందా అని పాయల్‌శంకర్ ప్రశ్నించారు. -
ఇద్దరు యువతులతో ప్రేమాయణం
యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. ప్రియుడు ఆకాశ్ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం వేలాడుతున్నా చూడకుండా.. ఆకాశ్ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్ మొబైల్‌కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆకాశ్ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్‌ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్ బెళగావిలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్íÙప్ చేస్తోంది. ఆకాశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
ప్రయాగరాజ్ మహాకుంభమేళా వల్ల పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమెకు ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది. అయితే ఈమెకు అవకాశమిచ్చిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరిస్తున్నాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. 2020లో టిక్ టాక్, ఇన్ స్టా ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువతి పరిచయమైంది. 2021 జూన్ 17న ఈమెకు ఫోన్ చేసిన సనోజ్ మిశ్రా.. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానని రావాలని కోరాడట. కానీ ఆమె రాలేదు. కలవడానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయంతో సనోజ్ ని వెళ్లి కలిసింది.సదరు యువతిని ఓ రిసార్ట్ కి తీసుకెళ్లిన సనోజ్ మిశ్రా.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయటకు చెప్తే.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఇలా పెళ్లి, సినిమా అవకాశాలు పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో ఈమె దిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
వైఎస్సార్సీపీ నాయకుడు అక్రమ అరెస్ట్
నర్సరావుపేట: పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు తెలంగాణలో తలదాచుకున్నా పోలీసులు వదలడం లేదు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా వెంటాడి వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల వైస్ ఎంపీపీ కుమారుడు, పిన్నెల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు చింతపల్లి జానీబేగం భర్త, వైఎస్సార్సీపీ మండల నాయకుడు పెద్ద సైదాను తెలంగాణ రాష్ట్రం మల్లారెడ్డిగూడెంలో శనివారం దాచేపల్లి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్లు ఆయన బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా మాచవరం వైస్ ఎంపీపీ, సైదా తండ్రి చింతపల్లి నన్నే మాట్లాడుతూ ఉదయం ఓ ప్రైవేటు వాహనంలో దాచేపల్లి సీఐతోపాటు మరికొందరు పోలీసులు మల్లారెడ్డిగూడెంలోని తాము ఉంటున్న ఇంటి వద్దకు వచ్చారని చెప్పారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉండి ఇంట్లో నిద్రిస్తున్న తన కుమారుడు సైదాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని నన్నే కోరారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అల్లాభక్షును కూడా అరెస్ట్ చేశారు.మాజీ సీఎం జగన్‌ను కలిశారనే అక్కసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి పాల్పడ్డారు. అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని విడిచి వందలాది కుటుంబాలు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను, గ్రామంలో జరుగుతున్న అరాచకాలను, అక్రమాలను, దౌర్జన్యాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చట్టపరమైన అనుమతులతో ఏప్రిల్ నెలలో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమం చేపట్టి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చే బాధ్యతను వైఎస్ జగన్ తీసుకున్నారనే విషయం తెలిసి... ఎలాగైనా వారు రాకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే టీడీపీ నాయకులు మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
పిన్నెల్లి YSRCP నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
రాజరికం కోసం.. అట్టుడుకుతున్న నేపాల్
ఖాట్మండు: నేపాల్(Nepal)లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్ అంతకంతకూ ఉధృతమవుతోంది. ఈ నేపధ్యంలో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో హింస చెలరేగి, ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పరిస్థితిని చక్కదిద్దేందుకు హోం మంత్రిత్వ శాఖ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ హింసాయుత ఘటనలకు మాజీ రాజు జ్ఞానేంద్ర షానే కారణమని ఆరోపిస్తూ, ఆయనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.ఇటీవల ఖాట్మండులోని పలు ప్రాంతాలలో రాచరిక మద్దతుదారులు, భద్రతా దళాల(Security forces) మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇంతలో ఆందోళనకారులు ఒక వాణిజ్య సముదాయం, ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం, ఒక మీడియా హౌస్ భవనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో 12 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.ఈ హింసాయుత ఘటనలను నివారించేందుకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి(Nepal Prime Minister KP Sharma Oli) అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాట్మండులో జరుగుతున్న హింసకు మాజీ రాజు జ్ఞానేంద్ర షాను బాధ్యునిగా చేసి, ఆయనను అరెస్టు చేయాలనే ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. జ్ఞానేంద్ర షా అరెస్టుకు సంబంధించి భద్రతా అధిపతుల అభిప్రాయాన్ని సేకరించడానికి, తదనంతర పరిణామాలను అంచనా వేయడానికి చర్చలు జరుగుతున్నాయని క్యాబినెట్ మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు. ఖాట్మండులో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.చెలరేగిన హింస.. ఇద్దరు మృతిరాజధాని ఖాట్మండులోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రాళ్లు రువ్వారు. అలాగే దుకాణాలను దోచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ భవనం వైపు రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో జరిగిన ఘర్షణల్లో 112 మంది గాయపడ్డారు. ఒక టెలివిజన్ కెమెరామెన్‌తోపాటు ఒక నిరసనకారుడు మృతిచెందాడని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు సైన్యాన్ని మోహరిస్తున్నారు.नेपाल जैसे छोटे देश में भी हिंदू राष्ट्र की मांग उठ रही है, लेकिन भारत में 115 करोड़ हिंदू होने के बावजूद यह भावना नहीं जागती। यह वाकई शर्म की बात है!#HinduRashtra #Nepal #India #HinduUnity #Sanatan #WakeUpHindus#earthquake #Bangkok #earthquake#AmitShahAtTimesNowSummit… pic.twitter.com/QBh2uCjNWZ— Journalist Namita Sharma (@NamitaSharmaSV) March 28, 20252008లో రాచరికాన్ని రద్దు చేసి నేపాల్‌లో లౌకిక, సమాఖ్య, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఇటీవలి కాలంలో రాచరికం పునరుద్ధరణ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ అవినీతి, ఆర్థిక అస్థిరత, తరచూ ప్రభుత్వాలు మారడంపై ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ప్రజల నుంచి మద్దతు కోరారు. ఇది ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీని తరువాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి. 2008 నుండి నేపాల్‌లో 13 ప్రభుత్వాలు మారాయి. అయినా రాజకీయ స్థిరత్వం ఏర్పడలేదు.ఇది కూడా చదవండి: World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు? -
తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తత
ఇస్తాంబుల్: అవినీతి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకుడు ఎక్రెమ్ ఇమామోగ్లు అరెస్టుతో తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయనకు మద్దతుగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇమామోగ్లును అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్ సిటీ హాల్ వద్ద గుమిగూడిన జనం తుర్కియే జెండాలు ఎగరవేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వం నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును, రబ్బరు పెల్లెట్లను, పెప్పర్స్పేని ప్రయోగించింది. మొత్తంగా తుర్కియేలోని 81 ప్రావిన్సుల్లో కనీసం 55 ప్రావిన్సుల్లో, దేశంలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,133 మందికి పైగా అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల్లో 123 మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టు.. మరోవైపు సోమవారం పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం నిర్బంధించిందని జర్నలిస్టు యూనియన్ తెలిపింది. ఇది పత్రికా స్వేచ్ఛ, సత్యాన్ని తెలుసుకునే ప్రజల హక్కుపై దాడి చేయడమేనని, జర్నలిస్టులను మౌనంగా ఉంచి నిజాన్ని దాచలేరని పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే అరెస్టు : ఇమామోగ్లు అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాకులు, జర్నలిస్టులు వ్యాపారవేత్తలను మొత్తంగా 100 మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) నేత ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, లంచాలు తీసుకోవడం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను నమోదు చేయడం, టెండర్ రిగ్గింగ్ వంటి అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిలివ్రీలోని జైలుకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఇమామోగ్లును మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అవాంతరాలు.. ఇమామోగ్లును అరెస్టు చేసినా.. 2028 అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం ఆదివారం ఓటింగ్ జరిగింది. అధ్యక్ష అభ్యరి్థగా ఇమామోగ్లు ఒక్కరే పోటీ చేశారు. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో దాదాపు కోటిన్నర మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సీహెచ్‌పీ తెలిపింది. సుమారు పది లక్షలకు పైగా ఓట్లు తమ సభ్యుల నుంచి రాగా, మిగిలినవి ఇమామోగ్లుకు సంఘీభావంగా తమ సభ్యులు కానివారు వేసినవని సీహెచ్‌పీ వెల్లడించింది. ఈ అరెస్టు ఇమామోగ్లు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అభియోగాలు రుజువైతే మాత్రం అతను ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇదిలావుండగా, అవకతవకల కారణంగా ఇమామోగ్లు డిగ్రీని రద్దు చేస్తున్నట్లు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలని తుర్కియే రాజ్యాంగం చెబుతోంది. ఇదే జరిగితే.. అధ్యక్ష పదవికి పోటీ చేయడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అయితే ఇమామోగ్లు డిగ్రీ రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో అప్పీల్ చేస్తామని ఇమామోగ్లు న్యాయవాదులు తెలిపారు. -
సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్
గన్నవరం : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏఎస్పీ వీవీ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక(14) సన్నిహితులతో కలిసి ఇటీవల కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెం జాతరకు వచ్చి.. సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను స్వగ్రామం తీసుకెళతామని నమ్మబలికిన వీరపనేనిగూడేనికి చెందిన ఇద్దరు మైనర్లు ముందుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మైనర్లు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామానికి చెందిన బాణావత్ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ అక్కడికి వెళ్లి బాలికపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆ బాలికను కేసరపల్లిలోని కొండేటి అనిల్ సహకారంతో అతని ఇంట్లో నిర్బంధించారు. అక్కడ జితేంద్ర, హర్షవర్ధన్‌లతో పాటు వారి స్నేహితులైన పరసా సంజయ్, ఉయ్యూరు నవీన్‌కుమార్, పరసా రాజేష్ ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే జితేంద్ర, హర్షవర్ధన్‌తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ చేసిన అనిల్, సంజయ్, నవీన్‌కుమార్, రాజేష్ లను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిట్ ప్రొఫెసర్ అరెస్ట్
గౌహతి: విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ బాగోతం మరువకముందే, అస్సాంలోని సిల్చార్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపుల వార్తల్లో నిలిచారు. సిల్చార్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర్ రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు డాక్టర్ కోటేశ్వర్ రాజును అరెస్ట్ చేశారు. అతనిని నిట్ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహత్తా తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా అతనిని ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(Bachelor of Technology) విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల ప్రకారం ప్రొఫెసర్ ఆమెను తన చాంబర్‌కు పిలిచి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపధ్యంలో బాధితురాలు ఇన్స్టిట్యూట్ అధికారులకు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులో.. ప్రొఫెసర్ తనకు వచ్చిన తక్కువ గ్రేడ్ల గురించి చర్చించేందుకు, చాంబర్‌కు పిలిచారని, ఆ తరువాత తనను అనుచితంగా తాకాడని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు గురించి తెలియగానే నిందితుడు దాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి తెలిపారు. అతని మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి, అతనిని, అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ తర్వాత అతనిని భారత శిక్షాస్మృతి (బీఎస్ఎన్) లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం -
‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆటకట్టించారు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే వ్యక్తి.. సమస్యలను పరిష్కరిస్తానంటూ.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి.. ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు.. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
అన్నదాతలపై ఉక్కుపాదం
-
అసెంబ్లీ వద్ద బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అరెస్ట్
-
మాజీ సర్పంచ్ దారుణ హత్య.. నూతనకల్ మండలంలో ఉద్రిక్తత
సాక్షి,సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్(61) పై గొడ్డలితో దుండగుల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితుణ్ని అతని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయితే హత్యకు పాల్పడిన నిందితుల ఇంటిపై బాధితుడి బంధువుల దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు మోహరించారు. -
Posani Krishna Murali : న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని
సాక్షి,గుంటూరు: ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళికి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని సీఐడీ విచారించనుంది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. -
వృద్ధ దంపతులను మోసం చేసిన బ్యాంకు మేనేజర్ మేఘన
యశవంతపుర(కర్ణాటక): వృద్ధురాలిని మోసం చేసిన గిరినగరకు చెందిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్ మేఘన, ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. గిరినగరలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో వృద్ధ దంపతులు జాయింట్ అకౌంట్ తెరిచారు. కొంతమొత్తం డిపాజిట్ చేశారు. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మేఘనా పరిచయం ఉండటంతో వృద్ధ దంపతులు తమ కష్టాలు ఆమె వద్ద చెప్పుకునేవారు. ఇటీవల ఇంటిని కూడా విక్రయిం కోటి రూపాయిలు బ్యాంకులో జమా చేశారు. ఆ నగదుపై మేఘనా కన్ను పడింది. బాండ్ అవధి ముగిసిందని, కొత్తగా డిపాజిట్ చేసేందుకు చెక్ అవసరమని మభ్య పెట్టి కొన్నిపత్రాలపై సంతకాలు చేయించుకుంది. అనంతరం రూ.50 లక్షలను తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుంది. వృద్ధ దంపతుల కుమారుడు బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నగదు తక్కువగా కనిపించింది. బ్యాంకుకు వెళ్లి మేఘనాను ప్రశ్నించారు.మీరు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు మేఘనా దబాయించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా మేఘనా వంచన బయట పడింది. మేఘనతోపాటు ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్ డయాక్సీ మెథాంఫెటమైన్) అనే సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.ఇది అంతర్జాతీయ డ్రగ్స్ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్ (31), అబిగైల్ అడోనిస్(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘ఎన్సీబీ ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న లిలాంగ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్‌బాక్స్‌లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్ టైర్లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి అరెస్టు
సాక్షి గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేదింపుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం, పెదకాకాని స్టేషన్‌కి తీసుకుని వెళ్లకుండా గుంటూరు చుట్టూ తిప్పుతున్నారునోటీసు ఇవ్వకుండా ,కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల అరెస్టు చేసి గుంటూరు చుట్టూ తిప్పుతూ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని పెదకాకాని పోలీసులు హింసిస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు మండిపడుతున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డికి 35(3) నోటీస్ ఇవ్వాలి ....లేకపోతే వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తున్నారు. -
సచివాలయంపై డ్రోన్ చక్కర్లు.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన తెలంగాణ సచివాలయంపై ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. దీన్ని గమనించిన ఎస్పీఎఫ్ పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులను సైఫాబాద్‌కు చెందిన వంశీ, నాగరాజుగా గుర్తించారు. దీంతో, వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సెక్రటేరియల్ అవుట్ పోస్టుతో పాటు సచివాలయం లాన్ ఏరియాను డ్రోన్‌తో చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. -
పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు
కొచ్చి: ఉపాధ్యాయులు, ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు. ప్రాథమికంగా దర్యాప్తు చేసి, నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి’’ అని పోలీసులను ఆదేశించింది. ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు స్కూళ్లలోకి ఆయుధాలు, మద్యం, డ్రగ్స్ తదితరాలను యథేచ్ఛగా తీసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచరుకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. కేరళలో విద్యార్థులు, యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు. టీచర్లనే బెదిరిస్తున్నారు. వారిని ఘెరావ్ చేస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అన్నారు. క్లాసురూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిసారీ బెత్తం వాడాలని కాదు. అది టీచర్ల చేతిలో ఉంటే చాలు, తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు. తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి. అది నేరమేమీ కాదు. పైగా అంతిమంగా మన విద్యావ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది. కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లినా, గిచ్చినా, మందలించినా టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. దీన్నుంచి వారికి రక్షణ కల్పించాలి. లేదంటే పని చేయలేరు’’ అన్నారు. ‘‘టీచర్లంతా సాధుసత్తములని చెప్పడం లేదు. వాళ్లలోనూ కొందరు చెడ్డవాళ్లు ఉండవచ్చు. కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అని మర్చిపోవద్దు’’ అన్నారు. -
రెచ్చిపోయిన గ్రామస్తులు.. పోలీసులపై దాడి.. ఏఎస్ఐ మృతి
పాట్నా: ఓ ఊరి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. ఊర్లో పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడుల చేశారు. గ్రామస్తులు చేసిన దాడుల్లో ఏఎస్ఐ దుర్మరణం పాలయ్యారు.బీహార్ రాష్ట్రం, అరారియా జిల్లా ఫుల్కహా అనే గ్రామంలో అన్మోల్ యాదవ్ ఓ పేరు మోసిన క్రిమినల్. పలు నేరాలకు పాల్పడి.. పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో బుధవారం అన్మోల్ యాదవ్ తన స్వగ్రామంలో పెళ్లి చేసుకుంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది.వెంటనే ఫుల్కహా గ్రామంలో పోలీసులు మోహరించారు. పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులపై దాడులకు తెగబడ్డారు. దాడుల్లో ఏఎస్ఐ రాజీవ్ రంజన్ మాల్ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయాడు. అప్రమత్తమైన పోలీసులు రాజీవ్ రంజన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.వైద్య పరీక్షల్లో ఏఎస్ఐ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్పీ అంజన్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరుగురు ఆనుమోల్ యాదవ్ మద్దతుదారుల్ని అరెస్ట్ చేశారు. అనుమోల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. -
నెల్లూరు జిల్లా సంగంలో నకిలీ SI హల్ చల్
-
మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్
-
నా ఐస్‌క్రీమ్ తినేసింది అమ్మను అరెస్ట్ చేయండి
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్‌క్రీమ్‌ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్‌లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది. అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్ ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్‌కు ఫోన్‌చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.అమ్మను తీసుకెళ్లండి911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్‌కాల్‌కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్‌క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్‌చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్‌క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్‌చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.ఐస్‌క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్‌కాల్‌లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్‌చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్‌క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్‌క్రీమ్‌ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్‌క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతర్తే అరెస్ట్
మనీలా: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే మంగళవారం అరెస్ట య్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ను మనీలా లోని అంతర్జాతీయ విమా నాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ దుతర్తే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివా దాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది.అయితే, ఆ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఐసీసీ నుంచి వైదొలగుతున్నట్లు అధ్యక్షుడిగా ఉన్న దుతర్తే ప్రకటించారు. 2022 ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతర పరిణామాల్లో దుతర్తేపై వచ్చిన ఆరోప ణలపై విచారణను తిరిగి ప్రారంభించనున్నట్లు 2023 జూలైలో ఐసీసీ ప్రకటించింది.జన హననా నికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై దుతర్తే కు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే దుతర్తేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలి పారు. దుతర్తేపై విచారణకు ఐసీసీకి సహక రిస్తామని అధ్యక్షుడు మార్కోస్ ప్రకటించారు. -
NRI డాక్టర్ రోజా మృతి కేసులో బిగ్ ట్విస్ట్
-
గోల్డ్ కేసులో ట్విస్ట్.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్‌ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు. -
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు అరెస్ట్
సాక్షి,అనంతపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు మహానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహానందరెడ్డిపై ఎలాంటి కేసులు లేకున్నా అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిడితో మహానందరెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మహానందరెడ్డి అరెస్ట్‌ను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. మహానందరెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది. మహానందరెడ్డిని చంపడానికి టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. -
పోసానికి 10 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
-
రెడ్ బుక్ పై పెట్టిన శ్రద్ధ.. మేనిఫెస్టోపై ఎందుకు లేదు: రోజా
-
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్!
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట. -
పోసాని అరెస్ట్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
నిందితుడి అరెస్ట్.. ఎలా చిక్కాడంటే!
-
పోసాని అరెస్ట్ పై అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లతో చెలరేగిపోతోన్న కూటమి సర్కార్
-
అరెస్ట్ పై పోసాని ఫస్ట్ రియాక్షన్
-
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్‌దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్‌దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025 జరిగింది ఇదీ..పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. -
పోసాని అరెస్ట్ ను ఖండించిన YSRCP నేతలు
-
ఏపీలో ఉన్నామా..? అఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?: విశ్వేశ్వర్ రెడ్డి
-
Big Question: పోసాని అరెస్ట్ వెనుక అసలు నిజం.. కుట్ర బట్టబయలు
-
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన కూటమి సర్కారు... పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం
-
రాష్ట్ర ప్రభుత్వానిది రౌడీయిజం
ఒంగోలు టౌన్: ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజానికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని, అందులో భాగమే ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు అని చెప్పారు.జూపూడి గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోసాని దొంగో, నేరస్తుడో కాదని, ఒక రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రజలకు అండగా నిలబడి మాట్లాడారని, ఆయన అరెస్టు అక్రమమేనని చెప్పారు.దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యక్తిగత దూషణలు చేసిన చంద్రబాబు సంగతేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతటి వారినైనా విమర్శిస్తారుగానీ.. ఆయన మీద విమర్శలు చేస్తే అరెస్టులు చేయిస్తారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాలు, అణచివేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని జూపూడి తెలిపారు. -
చంద్రబాబుది నియంత పాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం కట్టలు తెంచుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తూ నియంత పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. వేణుగోపాలకృష్ణ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరాయన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని నెలల క్రితమే పోసాని ప్రకటించారని తెలిపారు. గొంతు ఆపరేషన్ చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్నారని, అయినా చంద్రబాబు సర్కారు క్రూరంగా అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
-
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం
-
Advocate Sai Ram: పోసానిపై నమోదైన కేసులివే !
-
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్
-
సైలెంట్ గా ఉన్న వ్యక్తిని లేపి తన్నించుకుంటున్నారు...
-
పోసాని అరెస్ట్ పై వెల్లంపల్లి షాకింగ్ కామెంట్స్..
-
పోసాని అరెస్ట్ పై పోతిన మహేష్ సీరియస్ రియాక్షన్..
-
ధైర్యంగా ఉండమ్మా నేనున్నా.. పోసాని భార్యతో జగన్ ఫోన్ కాల్
-
పోసాని ఆరోగ్యంపై భార్య ఆందోళన
-
పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్!
-
మొత్తం 12 కేసులు.. పక్కా ప్లాన్ తోనే అరెస్ట్ !
-
పోసాని ఎక్కడ?.. పోలీసుల కుట్ర!
-
పోసానీ అరెస్ట్ పై తోపుదుర్తి షాకింగ్ నిజాలు
-
పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై YSRCP నేతల ఆగ్రహం
-
పక్కా ప్లాన్ తో పోసాని అరెస్ట్
-
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండానియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: డీజీపీ పోస్టుపై తమకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణ అక్రమ నిర్బంధంపై పిటిషన్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం, చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పరస్పర విరుద్ధంగా రెండు నివేదికలు... ధర్మాసనం ఆదేశాల మేరకు బొసా రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ తమ నివేదికలను అందచేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ఈ రెండు నివేదికల్లో అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారని కమిషనర్ చెబుతుండగా.. ప్రకాశం ఎస్పీ మాత్రం విశాఖ ఎంవీవీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారని తెలిపింది. అరెస్ట్ విషయంలో వాస్తవాలను కోర్టు ముందుంచడం లేదని, అందువల్లే డీజీపీ నుంచి నివేదిక కోరామని స్పష్టం చేసింది. వర్రా అక్రమ నిర్బంధం కేసులో విద్యాసాగర్ నాయుడుకు నోటీసులుసోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో వైఎస్సార్ కడప జిల్లా అప్పటి ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపింది. వాటికి బదులివ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
అమిత్ షా కొడుకు పేరుతో వసూళ్లు.. మోసగాడి అరెస్ట్
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. -
ఇవన్నీ పకోడీ కేసులు.. బాబుపై కొడాలి నాని సెటైర్లు
-
స్నేహితురాలి మోజులో భార్యను.. ఆప్ నేత అరెస్ట్
అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకైనా దారితీస్తాయనడానికి పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఒక ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదిమందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక నేత స్వయంగా అకృత్యానికి పాల్పడటం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని లుథియానాలో భార్యను హత్య చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అనోఖ్ మిట్టల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని స్నేహితురాలు, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తొలుత అనోఖ్ మిట్టల్ తన భార్య లిప్సీ మిట్టల్‌ను ఒక గ్రామం దగ్గర దుండగులు హత్య చేశారని చెప్పాడు. తాను, తన భార్య లుథియానా-మలెర్‌కోట్లా రోడ్డులో ఒక హోటల్లో భోజనం చేసి, తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని అనోఖ్ మిట్టల్ పోలీసులకు తెలిపాడు. ఆ దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, తమ కారు తీసుకుని పారిపోయాడని పేర్కొన్నాడు.పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ తమ విచారణలో లిప్సీ మిట్టల్‌ను ఆమె భర్త అనోఖ్ మిట్టల్ హత్య చేశాడని విచారణలో వెల్లడయ్యిందన్నారు. అనోఖ్ మిట్టల్‌తో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితురాలు, మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నదని లిప్సీ మిట్టల్‌కు తెలిసిపోయందని, దీంతో భయపడిన అనోఖ్ మిట్టల్ తన స్నేహితురాలి సాయంతో భార్యను హత్య చేశాడన్నారు. ఈ ఘటనలో అనోఖ్‌కు సహకరించిన అమృత్‌పాల్‌సింగ్, గురుదీప్ సింగ్, సోనూ సింగ్, సాగర్‌దీప్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్‌ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్‌పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని అకౌంట్లోని రూ.33 వేలు ఫోన్‌పే ద్వారా వారి ఖాతాలకు జమ చేసుకున్నారు.ఈ విషయంపై బాధితుడు హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగరాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్‌ను కూడా కలిశాడు. -
వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాగోలేకుంటే కనీసం మందులు కూడా ఇవ్వరా..?
-
ఫోన్ టాపింగ్ కేసులో ట్విస్ట్
-
వంశీ అరెస్ట్ పై మనోహర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్‌షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్‌షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్‌షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను అరెస్ట్‌చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్‌లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్‌ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్‌షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్‌షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్‌పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్‌పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా ఇదే మగ్‌షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్‌షాట్‌ను వైట్‌హౌస్‌లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్‌చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్‌లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ఈ ఫొటోఫ్రేమ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్‌గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్‌షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్ అరెస్ట్
సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు.తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు. -
అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi ) అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై తాజాగా ఆయన స్పందించారు. .. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్(Kutami Prabhutvam) వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా?. మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ‘నాకు వీళ్ల నుంచి ప్రాణ హాని ఉంది..’ జడ్జితో వల్లభనేని వంశీ.. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి(Kotaru Abbaya Chowdary)పై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి.. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి?. తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? చంద్రబాబుగారూ! .. ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు(Illegal Arrests) దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం అని ఎక్స్‌లో వైఎస్ జగన్(YS Jagan) పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం -
TG: అర్ధరాత్రి హైడ్రామా.. బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్
సాక్షి, చండూరు: నల్లగొండ జిల్లాలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. రాత్రి రెండు సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. శేఖర్‌ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందుతున్నారు. మరోవైపు.. శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.వివరాల ప్రకారం.. జిల్లాలోని చండూరులో బీఆర్ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన కొందరు వ్యక్తులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబీకులను భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో, ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే లాకెళ్లారు. ఈ క్రమంలో అన్నెపర్తి శేఖర్ సతీమణి.. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత చివరకు పోలీసులమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే, శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.మరోవైపు.. శేఖర్ అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం, మునుగోడు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..‘అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారు. బెదిరించడంలో భాగంగా ఓ కేసును అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. శేఖర్‌ను వెంటనే విడుదల చేయాలి. ఇంతవరకు శేఖర్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
వల్లభనేని వంశీకి 14రోజుల రిమాండ్.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రియాక్షన్
-
వల్లభనేని వంశీకి రిమాండ్.. భార్య పంకజశ్రీ రియాక్షన్
-
లోకేష్ ప్లాన్ పల్టీ కొట్టిందా?.. రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్..
-
వంశీ అరెస్ట్ పై భార్య న్యాయపోరాటం
-
రూల్స్ కూడా తెలియకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా అరెస్ట్
-
వల్లభనేని వంశీ అరెస్ట్ పై భార్య పంకజశ్రీ ఫస్ట్ రియాక్షన్
-
వంశీ అరెస్టుపై జూపూడి ఫైర్
-
లోకేష్ ఆదేశాలతో వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు
-
సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేరు. వంశీ 24 గంటల్లో బయటకు వస్తారు. కుట్రలతో చేస్తున్న మీ చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నేతలు గూండాల్లా బరి తెగిస్తున్నారు. వైఎస్సార్పీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. సత్యవర్థన్ నిజం చెప్పినా తప్పుడు కేసులు పెడుతున్నారు. సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?’’ అంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు.‘‘తనతో తప్పుడు కేసు పెట్టించారని సత్యవర్ధన్ కోర్టులో జడ్జి ముందే చెప్పాడు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. కోర్టులు, చట్టాలు అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. వంశీ అరెస్టు అన్యాయం, అక్రమం. టీడీపీ ఆఫీసుపై దాడి చేసింది వారి పార్టీ కార్యకర్తలే. కానీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. సత్యవర్ధన్ ఎస్సీ అని ఆయన్ను వేధిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి వెయ్యి గొంతులు బయటకు వస్తాయి. అరెస్టులతో వైఎస్సార్సీపీ భయపెట్టలేరు. పాలకులు చట్టబద్దంగా వ్యవహరిస్తే మంచిది. అధికార దుర్వినియోగం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. చట్టమే ఉరితాడుగా మారి మీ గొంతులకు బిగిస్తుంది జాగ్రత్త. వంశీతో అరెస్టుతో కూటమి ప్రభుత్వం అధ:పాతాళానికి పోయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే కూడా పోలీసులకు లెక్క లేకుండా పోయింది. బాధితుల మీదనే తిరిగి కేసులు పెట్టే దారుణమైన పరిస్థితి ఏర్పడిందిఅధికారం లేనందున వైఎస్సార్సీపీ నేతలంతా లొంగిపోతారనుకోవటం అవివేకం. అక్రమ కేసులు పెట్టటం నుండి సాక్ష్యం చెప్పించే వరకు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పోలీసులే నిర్ధారిస్తున్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించండి’’ అని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. -
ప్రతీకారంతో అరెస్టులు.. వల్లభనేని వంశీ అరెస్ట్ పై భూమన రియాక్షన్
-
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పోలీసులు
-
కక్షతోనే వంశీ అరెస్ట్: Devineni Avinash
-
వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
-
Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే..
కాఠ్మాండు: నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అరెస్టు చేశారు. వీరు ఆన్లైన్లో అక్రమంగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. నేపాల్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వీరు కాఠ్మాండుకు 10 కిలోమీటర్ల దూరంలోని బుద్ధనిలకంఠ ప్రాంతంలోని రెండస్తుల భవనంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక రహస్య సమాచారం మేరకు ఒక భవనంపై దాడి చేసి, 23 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 81 వేల రూపాయలు, 88 మొబైల్ పోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని యాంటీ గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం నేపాల్ పోలీసులు కోట్ల రూపాయల విలువైన ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను చేధించారు.అలాగే పది మంది భారతీయులతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. లలిత్‌పూర్‌లోని సనేపా ప్రాంతంలో రెండు ఇళ్లపై ప్రత్యేక పోలీసు బృందం దాడి చేసి, ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మంది భారతీయ పౌరులు, 14 మంది నేపాలీ జాతీయులను అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని నేపాల్ పోలీసులు తెలిపారు. నిందితులు రెండు అద్దె ఇళ్లలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత -
లక్ష్మిని అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్‌రాయల్(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi)ని సోమవారం తిరుపతిలో జైపూర్ పోలీసులు అరెస్ట్(Jaipur Police Arrest) చేశారు. కిరణ్‌రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు.ఇప్పుడు అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకెళ్లిన పోలీసులుజైపూర్ పోలీసులు లక్ష్మిని అరెస్టుచేశాక రుయాలో పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి కోర్టుకు తరలించారు. కోర్టు ఆవరణలో లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుప రిచారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని మీడియా వారు లక్ష్మిని ప్రశ్నిస్తుంటే.. ఆరోగ్యంగా ఉందని పోలీసులు సమాధానం ఇస్తూ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందిలక్ష్మిపై 2021లో జైపూర్‌లో కేసు నమోదైందని, అందులో ఆమె ఏ6గా ఉన్నారని, ఈ కేసుకు 41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందని తిరుపతికి చెందిన న్యాయవాది విజయకుమార్ తెలిపారు. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో కాలేదని చెప్పారు. పవన్ అభిమానినని కాలర్ ఎగరేసుకు తిరుగుతా రెండేళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్టు చేయించింది వైఎస్సార్సీపీనే అని జనసేన నేత కిరణ్‌రాయల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. వైఎస్ జగన్‌పై తాను పది రూపాయల పోస్టర్ తయారు చేస్తే తనకు రూ.10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చారన్నారు. రూ.25 లక్షలు లక్ష్మికి ఇచ్చి తనపై ప్రయోగించారని ఆరోపించారు. తాను పవన్ అభిమానినని, కాలర్ ఎగరేసుకు తిరుగుతానని చెప్పారు. -
ఏడేళ్ల లోపు కేసు కావడంతో 41సీ నోటీసులు మాత్రమే ఇవ్వాలి: లక్ష్మీ తరపు లాయర్
-
12 వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావును అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో హాజరు నుంచి కూడా మినహాయింపు ఇచి్చంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ కేటీఆర్‌తోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లకు ఊరటనిచి్చంది. కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.గతేడాది జూలై 26న మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్.. ఎటువంటి సమా చారం, అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారంటూ మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తప్పు చేయకున్నా తప్పుడు కేసు పెట్టారని.. విచారణ సహా తదుపరి చర్యలు నిలిపివేయడంతోపాటు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. -
త్రిపుర చిట్ ఫండ్ కేసు: 12 ఏళ్ల తర్వాత సీబీఐకి చిక్కిన నిందితుడు
న్యూఢిల్లీ: త్రిపుర చిట్ ఫండ్ కుంభకోణం కేసులో దాదాపు 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని మహారాష్ట్రలోని భివాండిలో సీబీఐ అరెస్టు చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపుర చిట్ ఫండ్ కేసులో వికాస్ దాస్ 2013 నుండి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.20,000 రివార్డును ప్రకటించారు.‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’, దాని డైరెక్టర్లు అధిక లాభాల హామీనిచ్చి వందలాది మంది పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేశారని, అయితే కంపెనీ పెట్టుబడిదారులకు ఎటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) (సీబీఐ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 2012లో మెచ్యూరిటీ మొత్తాన్ని సంబంధీకులకు చెల్లించకుండానే చిట్‌ఫండ్ కార్యాలయాన్ని మూసివేశారన్నారు.అగర్తలలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి 2024, ఆగస్టు 16న నిందితుడు వికాస్ దాస్(Vikas Das)ను ప్రకటిత నేరస్తునిగా వెల్లడించి, అతనిపై వారెంట్ జారీ చేశారు. అనంతరం నిందితుని ఆచూకీ తెలిపిన వారికి సీబీఐ రూ. 20,000 రివార్డును కూడా ప్రకటించింది. అయితే నిందితుడు 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సీబీఐ 2025 ఫిబ్రవరి 3న భివాండిలో అరెస్టు చేసింది. కాగా సీబీఐ 2023లో రెండు కేసులు నమోదు చేసింది. వీటిలో వికాస్ దాస్ ప్రధాన నిందితుడు. ఈయన ‘సూచ్నా రియల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే చిట్ ఫండ్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ కంపెనీ దాదాపు రూ. 6,60,000 మేరకు మోసానికి పాల్పడింది. కేసు దర్యాప్తు అనంతరం సీబీఐ 2025, జనవరి 21న వికాస్ దాస్, సుజిత్ దాస్, కంపెనీపై చార్జిషీట్ దాఖలు చేసింది.ఇది కూడా చదవండి: మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
చెన్నై కారు ఛేజింగ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
చెన్నయ్: చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో కారు ఛేజింగ్ ఘటనలో మరో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితుల్లో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. చంద్రు అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు అనంతరం సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీలను పరిశీలించి ఫిబ్రవరి 1న చంద్రును అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్తికేయన్ (పల్లికరనై) తెలిపారు. మరో ఇద్దరు నిందితులను కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. శనివారం అరెస్టైన చంద్రుపై ఇప్పటికే కిడ్నాప్ సహా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ నేరం సమయంలో ఉపయోగించిన రెండు ఎస్‌యూవీలను ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కారులో ఉన్న కొందరు మహిళలను డీఎంకే జెండా ఉన్న ఎస్‌యూవీలో వచ్చిన వ్యక్తులు వెంబడించి బెదిరిస్తున్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో 2025 జనవరి 25 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు ఆధారంగా తొలుత సీఎస్ఆర్ (కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్) నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం బీఎన్ఎస్, తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్గా మార్చారు. అయితే ఘటన పట్ల ప్రభుత్వ తీరుపై అన్నాడీఎంకే, బీజేపీ సహా విపక్షాలు మండిపడ్డాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే రాజకీయ సంబంధాలను పోలీసులు తోసిపుచ్చారు. టోల్ ప్లాజాల వద్ద రుసుము వసూలు చేయడానికి నిందితులు పార్టీ జెండాను ఉపయోగించారని చెప్పారు. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగి దొరికాడిలా!
సాక్షి,హైదరాబాద్ : కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. తాజాగా, తెలంగాణ సెక్రటరియేట్లో కేటుగాళ్లు..‘మేం తెలంగాణ సెక్రటరియేట్ ఉద్యోగులం మీకు ఏమైనా పని కావాలంటే చెప్పండి. చిటికెలో చేసి పెడతాం. కాకపోతే దానికి కొంత ఖర్చవుతుంది’ అంటూ పలువురి దగ్గర భారీ వసూళ్ల పాల్పడ్డారు. చివరికి ఎత్తుగడ ఫలించక దొరికిపోయారు. ఇంతకీ ఆ ఫేక్ ఉద్యోగి ఎవరు? ఆ ఫేక్ ఉద్యోగికి సహకరించింది ఎవరు? వాళ్లని పోలీసులు ఎలా పట్టుకున్నారు? రెండ్రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్‌మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ ఐడీ కార్డు వ్యవహారంలో.. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాస్కర్‌రావు, రవిలు సచివాలయంలో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఫేక్ ఐడీ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. -
మహిళపై అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత మధ్య రాకేష్ రాథోడ్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జనవరి 15న తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు సీతాపూర్‌లో అతడిపై కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. యూపీలో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 15న తనపై అత్యాచారం చేశారంటూ సీతాపూర్‌కు చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని, రాజకీయంగా తను భవిష్యత్ కల్పిస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్లుగా రాథోడ్ తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్స్ కాల్స్ లిస్ట్, సంభాషణలకు పోలీసులకు అందజేసింది.ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్ రాథోడ్‌ను ఈరోజు అరెస్ట్ చేశారు. అనంతరం, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాకేష్‌ను అరెస్ట్ చేసే సమయంలో కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, భారీ భద్రత మధ్య రాకేష్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.Sitapur, Uttar Pradesh: Congress MP Rakesh Rathore was taken into police custody during a press conference at his residence in connection with a Rape case pic.twitter.com/KlsQtjVhYi— IANS (@ians_india) January 30, 2025ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయమే ఎంపీ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. రెండు వారాల్లోగా సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని సూచించినట్లు సమాచారం. అంతకముందు ఇదే కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘డిజిటల్ అరెస్ట్’ కేసులో మరో ఆరుగురు అరెస్ట్
తిరుపతి క్రైం: డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలికి ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక వీడియో కాల్ వచ్చింది. ‘‘నేను ఢిల్లీ నుంచి సీబీఐ అధికారిని మాట్లాడుతున్నాను. రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించిన వివరాల కోసం సంప్రదించాను’’ అని నమ్మించాడు. వృద్ధురాలి పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి చట్ట వ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయని, అందువల్ల డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేశారు. వివిధ అకౌంట్లలోకి నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి, మనీ ల్యాండరింగ్ కేసుతో సంబంధం లేకపోతే తరువాత డబ్బులు రిలీజ్ చేస్తామని నమ్మించారు. వృద్ధురాలు తన ఖాతాలో ఉన్న రూ.2.50 కోట్లు వారు చెప్పిన వివిధ అకౌంట్లలో జమచేసింది. అనంతరం వారు స్పందించకపోవడంతో ఈ నెల 13న వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 22న అప్పటి ఇన్చార్జ్ ఎస్పీ మణికంఠ రాజమండ్రి కి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 24.5 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 16 గ్రాముల బంగారం కూడా స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. అదే కేసులో తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, సిమ్ మాడ్యూల్‌ను సీజ్ చేశామని, మరో రూ. 10 లక్షలు ఫ్రీజ్ చేశామని చెప్పారు.నిందితుల వివరాలు 1. సింగంపల్లి గణేష్(34), త్రినాధపురం, విశాఖపట్నం. 2. పాలకొల్లు రవికుమార్(28), చిన్న వాల్తేరు, విశాఖపట్నం . 3. యుల్లి జగదీష్(37), సత్యనగర్, ఇండ్రస్టియల్ ఎస్టేట్, కంచరపాలెం, విశాఖపట్నం. 4. పెంకి ఆనంద్ సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ (39), రామ్‌నగర్, శ్రీ హరిపురం, విశాఖపట్నం 5. ఊటా అమర్ ఆనంద్ (33), సుజాతా నగర్, గొల్లవెల్లివాని పాళెం, ఎల్ఐసి కాలనీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం రూరల్ 6. వాసుదేవ్(34), మురళీనగర్, విశాఖపట్నం