
దేశవ్యాప్తంగా రూ.44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు
టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) గుజరాత్‌లో నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సైబర్ నేరాలకు పాల్పడే వారికి మ్యూల్ బ్యాంకు ఖాతాలు (ఒకరి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను ఇతరులకు వినియోగించుకునేందుకు ఇవ్వడం) సరఫరా చేస్తున్న ఏజెంట్లు, మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు లావాదేవీల్లో సహకరిస్తున్న ముఠా గుట్టురట్టు చేసింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుజరాత్‌లోని సూరత్‌లో మే 1 నుంచి మే 10 వరకు ప్రత్యేక ఆపరేషన్‌లో 20 మందిని అరెస్టు చేసింది.
వీరిలో 14 మంది మ్యూల్ ఖాతాదారులు, ఆరుగురు ఏజెంట్లు ఉన్నారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణలో 60కి పైగా, దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో పేర్కొన్న ప్రకారం..తెలంగాణలోని ఏడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా పలు అనుమానాస్పద నగదు ఉపసంహరణలు, చెక్కుల ద్వారా జరిగిన లావాదేవీలపై టీజీసీఎస్‌బీ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రాథమిక విచారణలో 27 మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా రూ.44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు తేలింది. తెలంగాణలోనే ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా రూ. 22,64,500 విత్‌డ్రా చేసుకున్నట్టు గుర్తించారు.
అరెస్టయిన నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఒక బ్యాంకు ఉద్యోగి (వాపీ శాఖకు చెందిన డీసీబీ బ్యాంకు రిలేషన్íÙప్ మేనేజర్) ఉన్నారు. వీరు వ్యాపార, పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్, పార్ట్–టైమ్ ఉద్యోగ సహా వివిధ సైబర్ మోసాల్లో పాల్గొన్నట్టు శిఖాగోయల్ తెలిపారు. అరెస్టు అయిన నిందితుల నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, నాలుగు ఏటీఎం కార్డులు, ఐదు చెక్ బుక్‌లు, రెండు పాన్‌కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులు, ఇతర నేర సంబంధిత డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
సూరత్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీలు ఫణీందర్, రంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మహేందర్, రవికుమార్‌తోపాటు ఆపరేషన్‌కు సహకరించిన ఎస్పీ దేవేందర్‌సింగ్, డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, హరికిషన్‌లను శిఖాగోయల్ అభినందించారు. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే 1930 లేదా ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.