breaking news
APMSIDC
-
వైద్యానికి నిర్లక్ష్య 'రోగం'
మే 13న సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి దాక రాష్ట్రంలో 108 సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం డయల్ చేసినా కలవలేదు. 5 గంటలకు పైగానే అంతరాయం ఏర్పడింది. గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైనవారు వైద్యసేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. సకాలంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు విడిచారు. మే 29న విజయవాడ కనకదుర్గ వారధిపై గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన వృద్ధురాలు గుడిపూడి భవానీని బస్సు ఢీకొట్టగా రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్... బాధితురాలికి వైద్యం అందించాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. భవానీకి తీవ్ర రక్తస్రావం అవుతుండగా... అరుణ్ పలుసార్లు 108కు కాల్ చేసినా సమాధానం లేదు. సమయానికి ప్రైవేట్ అంబులెన్స్ అటుగా రావడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు కలెక్టరేట్ సమీపంలో ఓ గృహిణి స్పృహ తప్పి పడిపోగా కుటుంబ సభ్యులు 108కు కాల్ చేశారు. కాల్ సెంటర్ సిబ్బంది వివరాలు తీసుకున్నాక అంబులెన్స్ సిబ్బంది లైన్లోకి వచ్చి ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కాల్ కట్ చేశారు. దీంతో ప్రైవేట్ వాహనంలో బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి, లైఫ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల విజయవాడ కరెన్సీ నగర్లో రోడ్డుపై ఇసుక మేటను తప్పించబోయి స్కూటీ మీద నుంచి వృద్ధుడు పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. అక్కడివారు 108కు ఫోన్ చేస్తే అరగంటైనా రాలేదు. బాధితుడి కుటుంబ సభ్యులే వృద్ధుడిని తీసుకెళ్లారు. అనారోగ్యంగా ఉండి 108ని పిలిస్తే రాదు... ఒంట్లో శక్తి లేకున్నా ఓపిక చేసుకుని సొంతంగానే ఆస్పత్రికి వెళ్తే కనీసం మందులుండవు... గాయాలైతే దూది కూడా బాధితులే కొనుక్కోవాలి... ఒకవేళ ప్రైవేటులో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అవసరమైతే ఇక ప్రాణాలు గాల్లో దీపమే...! మధుమేహ బాధితులైనా... తీవ్ర వ్యాధుల పీడితులైనా అంతే...! వైద్యం దైవాధీనమే..! చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఏలుబడిలో ఇదీ పరిస్థితి..! నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయి..!సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేసేశాం. ఎక్కడా కొరత లేదు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. విలేజ్ క్లినిక్స్ నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోనూ కొరత వేధిస్తోంది. అన్ని బోధనాస్పత్రులను బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటీబయోటిక్స్ కొరత వేధిస్తోంది. విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ, ఏ ఆస్పత్రిని పరిశీలించినా ఈ మందులేవీ లేవు. జ్వరం, గ్యాస్, బీపీ, నొప్పుల వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చేవారినీ బయట కొనుక్కోమంటూ సిబ్బంది చిట్టీలు రాస్తున్నారు. సర్జికల్స్‌లో.. క్షతగాత్రులే గాయాల శుభ్రం, కట్టు కోసం దూది, డ్రెస్సింగ్ మెటీరియల్ తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మధుమేహ బాధితుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ అన్ని ఆస్పత్రుల్లో కొరత ఉందని వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు. ఔట్ పేషంట్లకు (ఓపీ) నెలకు 3, 4 అవసరం ఉంటే.. ఒకటి, రెండే ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, వైఎస్సార్, సీఎం సొంత జిల్లా చిత్తూరుతో పాటు మిగిలిన చోట్ల ఇదే పద్ధతి కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో సర్జరీకి వచ్చిన రోగులనే సూదులు, సూచర్, ఇతర మెటీరియల్స్ కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పారాసిటమాల్, బీపీ మందులు, బీ కాంప్లెక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇన్సులిన్ కొరత నెలకొంది.మంత్రి చేతిలో మాత్ర..వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా కాని మందులను స్థానికంగా పీఎంబీజేకే కార్యక్రమం కింద కొనాలని కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఓ మంత్రితో డీల్ కుదుర్చుకున్న సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు ఎంవోయూ చేసుకున్నాయి. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినా ఆ సంస్థ మందులను సరఫరా చేయడం లేదని సూపరింటెండెంట్లు వాపోతున్నారు. ఏ మందులు సరఫరా చేయలేరో చెబితే... ప్రత్యామ్నాయం చూసుకుంటామని కోరుతున్నా అది కూడా చేయడం లేదు. సమయానికి మందులు సరఫరా చేయకపోతే జరిమానాలు విధించడం, ఇదే తంతు కొనసాగితే సంస్థను బ్లాక్ లిస్టింగ్ చేస్తారు. కానీ, తమకు వచ్చిన బిజినెస్‌పై కమీషన్ ముట్టజెప్పేలా మంత్రితో సరఫరాదారులు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారిపై జరిమానాలు విధించడానికి వీల్లేకుండా పోతోందని అధికారులు చెబుతున్నారు.చంద్రబాబు ‘బీమా’లో ఆరోగ్యశ్రీ చిక్కి శల్యంపేదల సంజీవని ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం అంపశయ్య పైకి ఎక్కించింది. బీమా రూపంలో... ప్రజారోగ్యాన్ని దళారుల చేతిలో పెడుతూ గద్దెనెక్కిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రణాళికబద్ధంగా పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధుల్లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్‌తో సరిపెట్టుకోవాలని స్వయంగా టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లు చెల్లింపులు సక్రమంగా చేయడం లేదు. ప్రస్తుతం రూ.3,500 కోట్లు బకాయి పడింది. దీంతో చికిత్సలు అందించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీని విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసి, చిట్టచివరి నిరుపేద, మధ్య తరగతి పౌరుడికి సేవలందేలా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. 2019కి ముందు చంద్రబాబు పాలనలో 919 నెట్వర్క్ ఆస్పత్రుల్లో మొక్కుబడిగా అమల వుతున్న ఆరోగ్యశ్రీని వైఎస్ జగన్ ఏకంగా 2,371కు తీసుకుని వెళ్లారు. వీటిలో 200పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి.వీలైనన్ని ఎక్కువ ఆస్పత్రులకు అనుమతులివ్వడం ద్వారా మార్కెట్లో పోటీ పెంచి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చేశారు. సేవలకు ముందుకు వచ్చిన ఆస్పత్రుల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులిచ్చారు. ప్రతి వారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపానెల్ కమిటీ భేటీ అయి దరఖాస్తుల పరిశీలన, ఆమోదం వంటి కార్యకలాపాలు నిర్వహించేది. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. 140కు పైగా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అనుమతి కోసం చేసిన అభ్యర్థనపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. కొత్తగా ఏర్పాటైన ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ అనుమతులు కావాలంటూ ట్రస్ట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితం లేకపోతోంది.2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. వీటిని చెల్లిండమే కాక ఏడాది తిరగకుండానే అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదారు. తెల్ల కార్డు ఉన్నవారికే ఆరోగ్యశ్రీ అనే నిబంధనను సవరించి, రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేశారు. దీంతో 1.40 కోట్లపైగా కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. 1,059 ప్రొసీజర్లను ఏడాదిలోనే 2059కు, ఐదేళ్లలో 3,257కు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్‌ను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చిన పాపాన పోలేదు. పైగా గత ప్రభుత్వంలో చికిత్స తర్వాత రోగులకు నెలకు రూ.5 వేల మేర అందించిన ఆరోగ్య ఆసరాను.. నిరుడే నిలివేశారు. ఏడాదికి రూ.400 కోట్ల మేర ఈ సాయం అందించాల్సి ఉంది. 5 వేల కాల్స్‌కు నో రెస్పాన్స్గతంలో కాల్ సెంటర్‌కు వివిధ ప్రమాద, అనారోగ్య బాధితులకు సాయం కోసం రోజుకు 12 వేల నుంచి 13 వేల కాల్స్ వచ్చేవి. ప్రస్తుతం 8 వేల కాల్స్ మాత్రమే వస్తున్నాయి. అన్ని సందర్భాల్లో 108 వాహనాలు బాధితులకు అండగా నిలవడం లేదు. జూన్‌లో ఏకంగా 4500–5,000 ఉదంతాల్లో బాధితులకు సాయం అందలేదు. మరోవైపు కిందిస్థాయి ఆస్పత్రుల నుంచి మెరుగైన వైద్యానికి పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను పట్టించుకోవడమే లేదు.ప్రతిసారీ మందులు బయటే కొంటున్నా... నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. అయినా కాళ్ల నొప్పులు తగ్గడం లేదు. ప్రతి నెల విజయవాడ జీజీహెచ్‌కు చికిత్స కోసం వస్తుంటా. స్టాక్ లేదు.. మందులు బయట కొనమని సిబ్బంది చీటీ రాస్తున్నారు. రూ.500 ఖర్చవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకుని మందులు కొనే స్తోమత లేకనే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటికి రాస్తున్నారు. – శ్రీనివాసరావు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు విజయవాడ ప్రాణం పోతున్నా రాని 108ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసిన నిమిషాల్లోనే కుయ్ కుయ్‌మంటూ వచ్చిన అంబులెన్సులు నేడు ప్రాణాలు పోతున్నా రావడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి నిర్వహణ సంస్థను వెళ్లగొట్టి అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటివరకు ఉన్న నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా వేధించింది. దీంతో అత్యవసర వైద్యసేవల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎలాగూ వెళ్లగొట్టేస్తున్నారని నిశ్చయించుకుని పాత సంస్థ వాహనాల నిర్వహణను వదిలేసింది. 100 నుంచి 200 మేర వాహనాలు అధ్వాన స్థితికి చేరాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉండగా 731 ఆన్‌రోడ్ సేవలు అందించాలి. మిగతావి బ్యాకప్. కానీ, ఏ రోజూ 731 వాహనాలు ఆన్‌రోడ్ సేవల్లో ఉండడం లేదు. మరమ్మతుల పేరుతో నిత్యం 100 వాహనాలు షెడ్లకు చేరుతున్నాయి. ఉన్న అరకొర వాహనాలు సమయానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదు. మే నెల సగటు రెస్పాన్స్ సమయాన్ని గమనిస్తే.. పట్టణాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వెళ్లాల్సి ఉండగా 10 నిమిషాల మేర ఆలస్యంగా వెళ్లాయి. గ్రామాల్లో 20 నిమిషాలకు గాను 28 నుంచి 30 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 5 నుంచి 10 నిమిషాలకు పైగా ఆలస్యంగా చేరుకున్నాయి. గత నెల నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ భవ్య నిర్వహణ చేపట్టింది. కొత్త కాంట్రాక్ట్ ప్రమాణాల్లో గోల్డెన్ అవర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కాల్ సెంటర్‌కు ఫోన్ వచ్చిన గంటలో అంబులెన్స్ ప్రమాద స్థలి నుంచి రోగిని ఆస్పత్రికి చేర్చాలి. అయినా నిర్దేశిత సమయంలోపు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందడం లేదు.108... వైఎస్ జగన్ తొలి ఏడాది పాలనకు నేటికీ ఎంత తేడా?చంద్రబాబు ‘108’లను ఏడాదిలోనే అస్తవ్యస్తంగా మార్చగా, గతంలో ఏడాది లోనే వైఎస్ జగన్ వాటిని బలోపేతం చేశారు. 2019కి ముందు ఈ అంబులెన్స్ సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. ఈ క్రమంలో ఏడాది కూడా తిరగకుండానే వైఎస్ జగన్ సర్కారు 412 అంబులెన్స్‌ల కొనుగోలు చేసింది. వీటిని 2020 జూలై 1న ప్రారంభించారు. 26 నవజాత శిశు అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. రూ.4.76 కోట్లతో 2022 అక్టోబరులో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీంతో 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్సులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అండగా నిలిచారు. -
అవినీతి నిత్య ‘సత్యం’
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో..! లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమాత్యుడి అవినీతి నిత్య‘సత్యం’గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌లపై కన్నేసిన ఆయన ముందే కొన్ని సంస్థలతో డీల్ కుదుర్చుకుని వాటికి పనులను కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలను ఆస్పత్రులకు, ఇంటి వద్దకు తరలించే కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏపీఎంఎస్ఐడీసీ కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం ఐదు వందల వాహనాలతో.. మూడేళ్ల కాల పరిమితితో టెండర్లను పిలిచారు. కాంట్రాక్టు పరిమితి ముగిశాక మరో రెండేళ్లు పొడిగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఈ సేవలకు ప్రభుత్వం వెచ్చించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది!!అస్మదీయుడికి కట్టబెట్టేలా పక్కా ప్రణాళికగతంలోనూ అత్యవసర వైద్య సేవల్లో అక్రమాలకు తెర తీయగా.. ఆ ఆశలపై ప్రభుత్వ పెద్దలు నీళ్లు చల్లడంతో.. ప్రత్యామ్నాయంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలపై సదరు నేత దృష్టి సారించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులను పిలిచి బెంగళూరుకు చెందిన తన సన్నిహితుడి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మార్చితో ప్రస్తుత కాంట్రాక్ట్ ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఏం చేస్తారని అధికారులు నివేదించడంతో.. ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొత్త కాంట్రాక్ట్‌నే తమవారికి కట్టబెట్టేలా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో కొత్త టెండర్ నిబంధనలన్నీ అస్మదీయ సంస్థకు అనుగుణంగా రూపొందించేలా అమాత్యుడు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సదరు సంస్థకు సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో కన్షార్షియంలో ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థ అనుభవాన్ని వాడుకునేందుకు సిద్ధమమైనట్లు సమాచారం. ఓ సంస్థకు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకుని, ఒకే బిడ్ దాఖలైనా ఆమోదించే వెసులుబాటుతో అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. సాధారణంగా ఒకే బిడ్ దాఖలైన సందర్భాల్లో బిడ్‌ను రద్దు చేసి ప్రభుత్వం మళ్లీ టెండర్లకు వెళుతుంది. గత ప్రభుత్వంలో ఇదే నిబంధనతో ఇవే టెండర్లను నిర్వహించారు. అయితే తాజా టెండర్లలో మాత్రం ఒకే బిడ్ వచ్చినా ఆమోదించే అవకాశాన్ని సృష్టించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ముందే ఓ సంస్థను నిర్ణయించుకుని పేరుకు టెండర్ల తంతు నిర్వహిస్తోందని స్పష్టమవుతోంది.కాంట్రాక్ట్ లేకుండానే..తిరుపతికి చెందిన జనరిక్ మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకుని ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట అమాత్యుడు ఇప్పటికే అవినీతికి తెర తీశారు! తాను డీల్ కుదుర్చుకున్న సంస్థతోనే ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు ఎంవోయూ కుదుర్చుకుని మందులు కొనుగోలు చేసేలా వైద్య శాఖ అధికారులతో నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు ఇప్పించారు. ప్రభుత్వ బోధనాస్పత్రులకు డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్లో సరఫరా కాని వాటితో పాటు అత్యవసర మందులు, సర్జికల్స్‌ను ఏటా రూ.50 కోట్లకుపైగా వెచ్చించి స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ఒకే సంస్థకు మేలు జరిగేలా అమాత్యుడు చక్రం తిప్పారు. మంత్రి డీల్ చేసుకున్న సంస్థతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకునేలా గతేడాది ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఎంవోయూలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన రెండేళ్లలో రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.‘‘అత్యవసర’’ ఆశలపై నీళ్లు..!టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైద్య శాఖలో అత్యవసర సేవల నిర్వహణపై కన్నేసిన సదరు అమాత్యుడు ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థను టార్గెట్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యాజమాన్యం అమాత్యుడిని శరణు కోరగా.. తాను చెప్పిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇందుకు సరేనన్న యాజమాన్యం అమాత్యుడు సిఫార్సు చేసిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ కోసం వైద్య శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ దశలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని.. సబ్ కాంట్రాక్ట్‌లు కుదరవని, తమ అస్మదీయుడికి అత్యవసర వైద్య సేవల కాంట్రాక్ట్ కట్టబెడతామని చెప్పడంతో చేసేదేమీ లేక అమాత్యుడు సైలెంట్ అయిపోయారు. -
పుష్కలంగా మందులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల అవసరాలకు సరిపడా ఔషధాలు, వైద్య పరికరాలు సమృద్ధిగా ఉన్నాయని ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ డి. మురళీధరరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మందులు, సర్జికల్స్ కోసం రూ.2,250 కోట్లు వెచ్చించిందన్నారు. దీంతోపాటు గత ప్రభుత్వ బకాయిలు రూ.160 కోట్లను సైతం చెల్లించిందన్నారు. ‘మందులు లేవాయే’ శీర్షికతో ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని ఆయన ఖండించారు. నవరత్నాలు, నాడు–నేడు పథకాలతో రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు వాటి బలోపేతం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మందుల రకాలు 480 వరకు పెంపు రాష్ట్రంలో మే 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం కేవలం 229 రకాల మందులను మాత్రమే అందుబాటులో ఉంచేదని.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ సంఖ్యను 480కు పెంచినట్లు ఆయన తెలిపారు. అప్పట్లో సరఫరాదారులకు చెల్లింపుల్లో కూడా తీవ్రజాప్యం జరిగేదని గుర్తుచేశారు. ఫలితంగా మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడేదన్నారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆస్పత్రుల్లో రోగుల అవసరాలు, డిమాండ్ కంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద మొత్తంలోనే మందులు, సర్జికల్స్ కొనుగోలు చేస్తోందని మురళీధరరెడ్డి స్పష్టంచేశారు. ఇందులో భాగంగా 2021–22లో రూ.254 కోట్లతో కొనుగోళ్లు చేశామన్నారు. అవసరానికి తగ్గట్లుగా సరఫరా ఇక మధుమేహం, రక్తపోటు, హృద్రోగం నివారణకు అవసరమైన ఔషధాలు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రుల అవసరాల మేరకు వాటిని సరఫరా చేస్తున్నట్లు మురళీధరరెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు 1.93 కోట్ల పాంటాప్రజోల్ టాబ్లెట్లు, 2.32 కోట్ల రాంటిడిన్ టాబ్లెట్లను సరఫరా చేసిందని వివరించారు. అయితే.. మూడు బ్యాచ్‌ల రాంటిడిన్, ఆరు బ్యాచ్‌ల పాంటాప్రజోల్ టాబ్లెట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని విజయవాడలోని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఎల్) ప్రకటించడంతో వాటిని నిలిపివేశామన్నారు. వీటికి తాజాగా టెండర్లు పిలిచామని, వచ్చే వారంలో ఖరారు చేస్తామన్నారు. రూ.150 కోట్లతో యాంటీ బయోటిక్స్, ఫ్లూయిడ్స్ కొనుగోళ్లు మరోవైపు.. కోవిడ్ వ్యాప్తి సమయంలో డిమాండ్ కంటే ఎక్కువగా రూ.150 కోట్ల వ్యయంతో యాంటిబయోటిక్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. అయితే.. కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవటంతో వీటిని ఆ చికిత్సకు వినియోగించామన్నారు. తర్వాత కాలంలో అవసరాల మేరకు యాంటీబయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందన్నారు. ప్రస్తుతం తగిన స్థాయిలో వీటి నిల్వలున్నాయన్నారు. -
ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: విప్లవాత్మక సంస్కరణలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై కొందరు ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారాలకు దిగుతున్నారు. ఇలాంటి వారికి ఎల్లో మీడియా కొమ్ముకాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని చేపడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ)కు వైద్య ఉప కరణాలు సరఫరా చేసిన బిల్లులు నాలుగైదేళ్లుగా సకాలంలో రావడం లేదంటూ ఓ సంస్థ ఉద్దేశ పూర్వకంగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజస్ ఇండస్ట్రీ(ఏఐఎంఈడీ)కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐఎంఈడీ వాస్తవాలు తెలుసుకోకుండా ఏపీఎంఎస్‌ఐడీసీకి వైద్య ఉపకరణాలు సరఫరా చేయొద్దంటూ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ వాస్తవాలు.. మందులు, వైద్య ఉపకరణాలు కొనుగులుకు గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు రూ.1442.65 కోట్లు ఖర్చు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019-20లో రూ.300.07 కోట్లు, 2020-21లో రూ.1,279 కోట్లు, 2021-22లో ఇప్పటి వరకు రూ.641.41 కోట్లు.. మొత్తంగా రూ.2220.48 కోట్లు వెచ్చించింది. ఈ బిల్లులతో పాటు, టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.300 కోట్లకు పైగా బిల్లుల్ని చెల్లించింది. ప్రస్తుతం కొన్ని బిల్లులు సీఎఫ్ఎంఎస్లో ఉన్నాయి. టెండర్ల సమయంలో ఎంవోయూ కుదుర్చుకున్న ప్రకారం ఉప కరణాలు, మందులు సరఫరా చేసిన సంస్థలకు ఏపీఎంఎస్ఐడీసీ బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఏపీలోను బిల్లుల మంజూరు జరుగుతోంది. ఏవైనా సంస్థలు ఏంవోయూలోని నిబంధనలను పాటించకున్నా, నాణ్యమైన మందులు, ఉపకరణాలు సరఫరా చేయకుంటే ఆ తరహా సంస్థలకు బిల్లుల మంజూరు విషయంలో కొంత జాప్యం జరుగుతోంది. ఆయా సంస్థలు నిబంధనలను అతిక్రమించిన దానిని బట్టి బిల్లుల్లో సవరణలు చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. ఓ సంస్థ చేసిన పనే ఇది ఏఐఎంఈడీకి తప్పుడు ఫిర్యాదులు చేసి ప్రకటన జారీ చేసేలా చేయడం వెనుక ఓ సరఫరా సంస్థ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సదరు సరఫరా సంస్థ గత ఏడాది కోవిడ్ వైరస్ నిర్ధారణ కిట్ల సరఫరా టెండర్‌ను దక్కించుకుంది. ఏపీకి సరఫరా చేస్తున్న ధరల కంటే తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాలు, ఇన్స్టిట్యూట్లకు కిట్లు సరఫరా చేస్తే.. ఆ తక్కువ ధరలనే ఏపీఎంస్ఐడీసీ చెల్లిస్తుందనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఈ సరఫరా సంస్థ ఏపీ కన్నా తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాల్లో కిట్లు సరఫరా చేస్తుందని గుర్తించిన ఏపీఎంస్ఐడీసీ అధికారులు ఒప్పంద నిబంధనల మేరకు మిగులు బిల్లులను సవరించి విడుదల చేస్తామని ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ సవరణల్లో భాగంగా సదరు సంస్థకు బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం కావడంతో దీని యజమాని.. వాస్తవాలు కప్పి పెట్టి ఏఐఎంఈడీ.. హెచ్చరికలు జారీ చేసేలా చక్రం తిప్పినట్టు సమాచారం. ఏఐఎంఈడీకి నోటీసులు ఇచ్చాం ఏఐఎంఈడీ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే తొందరపాటుతో తన వెబ్సైట్లో ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తూ వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు వైద్య ఉపకరణాలు, మందులు సరఫరా చేసిన సంస్థకు రూ.1,407 కోట్లు ఇచ్చాం. కరోనా చికిత్స మందులు, వైద్య పరికరాలు సరఫరా చేసిన సంస్థలకు రూ.514 కోట్లు ఇప్పటికే చెల్లించాం. ఏఐఎండీ చేసిన ప్రకటన వెనుక దురుద్దేశం ఉందని గమనించి ఆ సంస్థకు నోటీసులు జారీ చేశాం. 2019కి ముందు బిల్లులు అన్నీ చెల్లించాం. కేవలం రూ.2 రెండు కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు కూడా ఆయా సంస్థలు టెండర్ నిబంధనలు ఫుల్‌ఫిల్ చేయకపోవడం వల్లే ఆగాయి. - మురళీధర్ రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
పాతతరం మందులకు స్వస్తి
సాక్షి, అమరావతి: రోగాల తీరు మారిపోయింది. ఎన్ని మందులు వాడినా కొన్నిరకాల వైరస్‌లను నివారించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోగాలను తగ్గించేందుకు అధునాతన మందులు అందుబాటులోకొచ్చాయి. కానీ.. ప్రభుత్వాస్పత్రులకు మందులను సరఫరా చేసే మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్ఐడీసీ) జాబితాలో మాత్రం 1995 నాటి మందులే ఉన్నాయి. వాటివల్ల చాలా రోగాలు తగ్గటం లేదు. దీంతో ఏసీ ఎంఎస్ఐడీసీ జాబితా నుంచి పాత తరం మందులను తొలగించి కొత్త మందులను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేసింది. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మందులతోపాటు కొన్ని రకాల యాంటీ బయోటిక్స్‌ను కొత్త జాబితాలో చేర్చుతున్నారు. రెండు నెలలుగా వివిధ వైద్య విభాగాల నిపుణులు పలు దఫాలుగా సమావేశమై చర్చించిన అనంతరం కొత్త మందులు తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తం 440 రకాల కొత్త మందులను నూతన జాబితాలో చేర్చుతున్నారు. ఈ అంశంపై ఈనెల 21, 22 తేదీల్లో ఏపీ ఎంఎస్ఐడీసీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి.. ఏయే మందులు తీసుకోవాలో నిర్ణయించారు. నాలుగైదు రోజుల్లో జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత ఈ జాబితాను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుంది. ఇదిలావుండగా.. 2018–19 సంవత్సరంలో మందుల కోసం రూ.160 కోట్లు బడ్జెట్ ఇవ్వగా.. కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది వినియోగం ప్రాతిపదికన నిధులు కేటాయించడంతో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త మందుల జాబితాపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. రోగాలకు పనిచేయని మందులు జాబితాలో ఉన్నా ఉపయోగం లేదని, అందుకే వాటిని తొలగించి కొత్త మందులను ఎంపిక చేశామన్నారు. కుక్క కాటు (ఏఆర్వీ) మందుల కొరతను నివారించేందుకు తొలిసారిగా ఏపీ ఎంఎస్ఐడీసీ ఆ మందులను జిల్లాలకు విమానంలో తరలించించిందన్నారు. ప్రణాళికా బద్ధంగా మందులను ఎంపిక చేసి జాబితా ఇస్తే సకాలంలో సరఫరా చేసేందుకు కృషి చేస్తామని ఎండీ హామీ ఇచ్చారన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ల కొరత
గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి వ్యాపార సంస్థలతో ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఆ సంస్థలు నాణ్యతలేని మందులు సరఫరా చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇన్సులిన్ విషయంలోనూ ఇదే జరిగింది. శ్రేయా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేసిన ఇన్సులిన్‌లో నాణ్యత కొరవడింది. ఇదే విషయం ల్యాబ్ పరీక్షల్లోనూ తేలడంతో వాటిని వాడకుండా మూలనపడేశారు. ఈ కారణంగా వేలాది మంది మధుమేహ (షుగర్) రోగులు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, కర్నూలు: జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా మందులు సరఫరా అవుతున్నాయి. ఆసుపత్రుల్లో అవసరాలను బట్టి మందుల ఇండెంట్‌ను ఏపీఎంఎస్ఐడీసీ స్టోర్‌కు పంపుతారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఆయా ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా మందులు, సర్జికల్స్ సరఫరా అవుతాయి. వీటిని కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఆయా ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. కాగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీగా కమీషన్లు తీసుకుని.. అవసరం లేకపోయినా అధిక శాతం మందులు కొనుగోలు చేసి పంపించారు. 2014లో ఒకేసారి మూడింతల మందులు, సర్జికల్స్ అధికంగా కొనుగోలు చేశారు. అలా అధికంగా వచ్చిన మందులు, సర్జికల్స్ మూడేళ్ల వరకు ఉండి, ఆ తర్వాత కాలం తీరిపోయాయి. జిల్లాలో రూ.4కోట్లకు పైగా విలువైన మందులు కాలం తీరి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇన్సులిన్ కొరత పాపం గత పాలకులదే ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇన్సులిన్ నిండుకుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రమే ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి ఇన్సులిన్‌ను బయట కొనుగోలు చేసి రోగులకు ఇస్తున్నారు. అది కూడా పరిమితంగా ఇస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు భారీగా కమీషన్లు దండుకుని నాణ్యతలేని మందులు, సర్జికల్స్ సరఫరాకు కారణమయ్యారన్న విమర్శలున్నాయి. గతంలో పలుమార్లు బీపీ, షుగర్, ఇతర మందులు నాణ్యతలేవని ల్యాబొరేటరీలు నివేదికలు వచ్చాయి. ప్రస్తుతం వాటి సరసన ఇన్సులిన్ కూడా చేరింది. 35వేల వాయిల్స్ వృథా కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు 2018 ఏప్రిల్‌లో 9వేలు (బ్యాచ్ నెం.ఎస్ఏ1840016), ఈ ఏడాది జూన్‌లో 26వేల (బ్యాచ్ నెంబర్లు ఎస్ఏ1940035, ఎస్ఏ1940057) ఇన్సులిన్ ఇంజెక్షన్లను శ్రేయా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సరఫరా చేసింది. సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వచ్చిన వీటిని యధాలాపంగా నాణ్యత పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికలో ఇన్సులిన్‌లో నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేయకుండా స్టోర్‌లోనే ఉంచేశారు. షుగర్ రోగులకు ఇబ్బందులు ఒకేసారి 35వేల వాయిల్స్ ఇన్సులిన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో తీవ్ర కొరత ఏర్పడింది. దీనివల్ల షుగర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి షుగర్ రోగి ప్రతి నెలా వేసుకునే డోసును బట్టి 4 నుంచి 6 ఇన్సులిన్ వాయిల్స్ వాడాల్సి ఉంటుంది. వీటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తే రూ.600 నుంచి రూ.900 దాకా ఖర్చవుతుంది. చాలా మంది రోగులకు ఇన్సులిన్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మాత్రలకు లొంగకపోవడంతో అప్పు చేసి మరీ ఇన్సులిన్ కొనుగోలు చేసి వేసుకుంటున్నారు. -
ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్‌గా ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సొంత ఊరు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. న్యూరో ఫిజీషియన్‌గా మంచి గుర్తింపు ఉన్న ఆయన ఇటీవల ప్రభుత్వం ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. -
ఏపీఎంఎస్‌ఐడీసీకి కమీషన్ల జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో (ఏపీఎంఎస్ఐడీసీ) తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారాలు బయట పడుతున్నాయి. మందుల కొనుగోలు నుంచి సివిల్ నిర్మాణాల వరకూ ఆన్లైన్ టెండర్లకు వేదికైన ఈ సంస్థలో గత నాలుగున్నరేళ్లలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి, చికిత్స అందించేందుకు ఎనీమియా స్క్రీనింగ్ యంత్రాల (హిమోగ్లోబిన్ డిజిటల్ మెషీన్లు) కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్లకు కక్కుర్తి పడిన ఏపీఎంఎస్ఐడీసీ గత ఆరు నెలలుగా 164 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయలేదు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యంత్రాలను రాకుండా అడ్డుకున్నారంటే ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 3,150 యంత్రాల కొనుగోలుకు టెండర్లు రాష్ట్రంలో ఏటా 7.50 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో 60 శాతం మంది రక్తహీనత బాధితులే. పదేపదే సూదితో గుచ్చి రక్తం తీయడం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాథమికంగా 164 పీహెచ్‌సీలకు అత్యాధునిక హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మెషీన్లు ఉంటే గర్భిణులు, బాలింతలకు సూది గుచ్చాల్సిన అవసరం ఉండదు. కనురెప్పలు తెరిచి, ఆ మెషీన్‌తో చూస్తే శరీరంలో ఎంతమేరకు రక్త శాతం ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ మెషీన్‌కు బ్లూటూత్ పరికరం ఉంటుంది. వైద్యుడు సుదూర ప్రాంతంలో ఉన్నా అతడి సెల్‌ఫోన్‌కు ఈ హిమోగ్లోబిన్ సమాచారాన్ని పంపించి, సలహాలు సూచనలు పొందవచ్చు. మొత్తం 3,150 మెషీన్ల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడీసీ 2018 అక్టోబర్ 9న టెండర్లు పిలిచింది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల పరిశీలన తరువాత డెమో కూడా పూర్తయ్యింది. బయోసైన్స్ అనే సంస్థ ఒక్కో మెషీన్‌ను రూ.21 వేలకు కోట్ చేసి, టెండర్లలో ఎల్1గా నిలిచింది. ఎల్2గా నిలిచిన మాసిమో అనే సంస్థ ఒక్కో యంత్రానికి రూ.80 వేలు కోట్ చేసింది. దీంతో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు టెండర్ అప్పగించాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ ఆ పని చేయలేదు. కమీషన్ల బేరం కుదరకపోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అవినీతి వల్ల 2019 జనవరి నుంచి ఇప్పటివరకూ ఆ మెషీన్లు సరఫరా కాలేదు. బయోసైన్స్‌కు ప్రొడక్ట్ లైసెన్స్ లేదు ‘‘హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్ల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లలో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు ప్రొడక్ట్ లైసెన్స్ లేదని మాసిమో సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై వెరిఫికేషన్ చేశాం. ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించాం. ఈ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకున్నాం. టెండర్ రద్దయ్యింది’’ – సీహెచ్ గోపీనాథ్, ఎండీ, ఏపీఎంఎస్ఐడీసీ -
కొలిక్కిరాని పైసల పంచాయితీ
- ఏపీఎంఎస్‌ఐడీసీకి తెలంగాణ ఉద్యోగుల తాళం - సామగ్రి విజయవాడకు తరలిస్తుండగా నిరసన - టీఎస్ఎంఎస్ఐడీసీకి రూ.70 కోట్ల బాకీ సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో విభజన వివాదాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. తొమ్మిదో షెడ్యూల్లోని వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఎంఎస్ఐడీసీ)లో పైసల పంచాయితీ మరోసారి రగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) కార్యాలయంలోని సామగ్రిని విజయవాడకు తరలిస్తున్నారని తెలుసుకొని టీఎస్ ఎంఎస్ఐడీసీ ఉద్యోగులు బుధవారం అక్కడికి వెళ్లారు. విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణకు రావాల్సిన రూ.70 కోట్లను విడుదల చేయాలంటూ ఏపీ ఎంఎస్‌ఐడీసీకి తాళం వేశారు. ఈ సంస్థ ఆస్పత్రులకు అవసరమైన మందులను, సామగ్రిని కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. అభివృద్ధి పనులను చేయిస్తుంది. టెండర్ల ప్రక్రియ సమయంలో కాంట్రాక్టర్లు ఆయా పనులకు కేటాయించిన మొత్తంలో ఏడు శాతాన్ని ఈఎండీగా చెల్లిస్తారు. పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకునే సమయంలో ఈఎండీ మొత్తాన్ని సైతం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో పనులు పూర్తి చేసినవారికి చెల్లించాల్సిన మొత్తం ఏపీఎంఎస్ఐడీసీ బ్యాంకు ఖాతాలోనే ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియ సమయంలో ఏపీఎంఎస్ఐడీసీ ఆస్తులను, నిధులను చార్టర్డ్ అకౌంటెంట్లు లెక్కలు వేశారు. తెలంగాణకు రూ.70 కోట్లు ఇవ్వాలని సంస్థ మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇది జరిగి మూడేళ్లు అవుతున్నా టీఎస్ఎంఎస్ఐడీసీకి రావాల్సిన బాకీని ఏపీఎంఎస్ఐడీసీ చెల్లించడంలేదు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఈ నిధులను మూడు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తమకు రావాల్సిన నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు బ్యాంకులకు గతంలోనే పలుసార్లు లేఖలు రాశారు. దీనికి ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు ఏపీఎంఎస్ఐడీసీ కార్యాలయంలోని సామాన్లను విజయవాడకు తరలించాలని ఆ సంస్థ అధికారులు నిర్ణయించారు. రెండు రోజులుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న టీఎస్ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీరు, మరో ఇద్దరు అధికారులు మంగళవారం ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ వెంకటగోపినాథ్ వద్దకు వెళ్లారు. అయితే, ఆయన తెలంగాణ అధికారులను కలిసేందుకు ఇష్టపడలేదని తెలిసింది. దీంతో టీఎస్ఎంఎస్ఐడీసీ ఉద్యోగులు పలువురు ఏపీఎంఎస్ఐడీసీ కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగం గదికి తాళం వేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీకి రావాల్సిన రూ.70 కోట్లను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. -
ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ బదిలీ
‘సాక్షి’ వరుస కథనాలతో కదలిన సర్కారు టెండరు లేకుండా రూ.3 కోట్ల ఫర్నిచర్ కొనుగోలు వెంటిలేటర్ల టెండర్లపైనా విమర్శలు మందుల నాణ్యత డొల్లే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ)లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలతో ప్రభుత్వం స్పందించింది. మందులు, యంత్రాల కొనుగోలు, కాంట్రాక్టర్ల నుంచి నాసిరకం ఔషధాలు తీసుకోవడం, హెచ్ఐవీ కిట్లు, వెంటిలేటర్లు కొనుగోలులో అవకతవకలపై సర్కారు కదలింది. ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ ఎం.రవిచంద్రను బదిలీ చేశారు. అయితే ఎండీ ద్వారా అనూహ్యంగా మేనేజర్ స్థాయి పదవులు పొందిన లాజిస్టిక్ మేనేజర్‌ను బదిలీ చేస్తారా లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనే చర్చ జరుగుతోంది. లాజిస్టిక్ మేనేజర్‌పై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఏపీఎంఎస్ఐడీసీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాల కొనుగోలు తీరే దీనికి నిదర్శనం. హెచ్ఐవీ కిట్ల కొనుగోలుపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంస్థ అధికారులు, ఇరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఎలాంటి టెండరు లేకుండా ప్రభుత్వాసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేశారు. డ్రగ్స్ అండ్ డిస్పోజబుల్స్ పేరుతో నేరుగా కొన్నారు. టెండరు ద్వారా కొంటే కనీసం 50 శాతం రేటు తగ్గే అవకాశమున్నా తమకు అనుకూలమైన వ్యక్తికి కాంట్రాక్టు కట్టబెట్టారు. తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు ఏపీఎంఎస్ఐడీసీ అధికారులపై చాలామంది వైద్యులు తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైద్యుల కమిటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీతో పాటు మరో ఫార్మసిస్ట్ తమ నివేదికలను బుట్టదాఖలు చేస్తున్నారని, అలాంటప్పుడు కమిటీలు ఎందుకని ఫిర్యాదు చేశారు. ఓ ఫార్మసిస్ట్‌కు లాజిస్టిక్ మేనేజర్‌గా పదవులు కట్టబెట్టడంపై ఆ శాఖకు చెందిన అధికారులే ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.తమను ఇతర విభాగానికి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఎండీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకుఫిర్యాదులు రావటంతో బదిలీ వేటు పడినట్లు తెలిసింది. -
నేరుగా ఆస్పత్రులకే మందులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపడా మందులను ఇక నేరుగా ఆస్పత్రులకే సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డెరైక్టర్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. వైద్యాధికారులు పంపించే ఇండెంట్‌కు అనుగుణంగా ప్రతి మూడు నెలలకోసారి ఔషధాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, మలి దశ లో రాష్ట్రమంతా ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని స్ఫూర్తి భవన్లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందుల వినియోగానికి సంబంధించినగడువును పరిశీలించాల్సిన బాధ్యత సీనియర్ ప్రజారోగ్యాధికారు(ఎస్పీహెచ్ఓ) లదేనని స్ప ష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుపై ఈ నెల 31 న ఎంసీహెచ్ఆర్డీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. స్టోర్స్‌లలో మందుల నిల్వలను విధిగా డీఎంహెచ్ఓలు పరిశీలించాలని ఆదేశించారు. మల్కాజ్గిరి, సరూర్‌నగర్, పరిగి, కుల్కచర్ల తదితర పీహెచ్సీలలో అవసరానికి మించి మందులు తీసుకుంటున్నట్లు తమ దృష్టి కి వచ్చిందని, ఈ వ్యవహారంపై ఆరా తీయాలని అన్నారు. ఉపకేంద్రాల్లో వెంటిలేషన్ ఉం డేలా నమూనాలను తయారు చేసి సమర్పిం చాలన్నారు. ఆస్పత్రుల మరమ్మతులకు ఏటా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలి పారు. సమావేశంలో కలెక్టర్ బి. శ్రీధర్, జేసీ-2 ఎంవీరెడ్డి, డీఎంహెచ్‌వో సుభాష్‌చంద్రబోష్, డీసీహెచ్ఎస్ హన్మంతరావు పాల్గొన్నారు.