ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

Doctor Bhumi Reddy ChandraSekhar Reddy Take Charges As Chairman of APMSIDC - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక‍్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి సొంత ఊరు వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు. న్యూరో ఫిజీషియన్‌గా మంచి గుర్తింపు ఉన్న ఆయన ఇటీవల ప్రభుత్వం ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top