breaking news
Announced
-
ఇజ్రాయెల్ దెబ్బకు వెనక్కి తగ్గిన సిరియా.. ‘డ్రూజ్’తో కాల్పుల విరమణ
డమాస్కస్: సిరియా దక్షిణ ప్రాంతంలో గత కొంతకాలంగా జాతి ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతలో ఇజ్రాయెల్.. ఇరాన్ రాజధాని డమాస్కస్‌లోని సిరియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. డ్రూజ్ కమ్యూనిటీ, సిరియన్ అధికారుల మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరుణంలో ఈ దాడి జరిగింది. దీంతో ఇజ్రాయెల్- సిరియా మధ్య ఘర్షణలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరియాలో నివసిస్తున్న మైనారిటీ డ్రూజ్ కమ్యూనిటీని రక్షించేందుకే దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రభుత్వ దళాలు- సున్నీ బెడౌయిన్ తెగల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో డ్రూజ్ కమ్యూనిటీ విలవిలలాడుతోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారని సిరియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్.. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో.. డ్రూజ్ కమ్యూనిటీని విడిచిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.సిరియాలోని స్వీడా ప్రావిన్స్‌లోని డ్రూజ్ కమ్యూనిటీ, సున్నీ బెడౌయిన్ తెగల మధ్య గత కొంతకాలంగా జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 248 మందికి పైగా జనం మరణించారు. వారిలో 92 మంది డ్రూజ్ కమ్యూనిటీకి చెందినవారు కావడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే దక్షిణ సిరియా నుండి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్‌లోని గోలన్ హైట్స్ సరిహద్దులో అదనపు సైనిక మోహరింపును ప్రారంభించింది. ఈ పరిణామాల నేపధ్యంలో సిరియన్ ప్రభుత్వ అధికారులు వెనక్కి తగ్గి, డ్రూజ్ కమ్యూనిటీతో కాల్పుల విరమణ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర వార్తా సంస్థ ‘సనా, డ్రూజ్ నేత సంయుక్తంగా ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. -
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై యుద్ధం ప్రకటించిన మస్క్
-
సీన్లోకి సిగాచి.. ఎట్టకేలకు పరిహారం ప్రకటన
పాశమైలారం ఘటన తర్వాత సిగాచి కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ కంపెనీ నుంచి కనీస స్పందన కూడా కరువైందని తెలంగాణ ప్రభుత్వం కూడా సిగాచి తీరుపై సీరియస్‌గా ఉంది. ఈ తరుణంలో ఎట్టకేలకు ఆ సంస్థ స్పందించింది.సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పాశమైలారం ప్రమాదంలో ఎట్టకేలకు మేనేజ్మెంట్ అయిన సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పందించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెబుతూ బుధవారం ఒక ప్రకటన చేసింది. ‘‘మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇస్తాం. ప్రమాదంలో 40 మంది మరణించారు. మరో 33 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు పూర్తి వైద్య సాయం అందిస్తాం’’ అని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని.. కారణాలు తెలియరావాల్సి ఉందని అంటోంది. అలాగే ప్రమాద తీవ్ర దృష్ట్యా 90 రోజులపాటు కంపెనీ మూసివేతకు నిర్ణయించింది. ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్సేంజికి ఓ లేఖ ద్వారా సిగాచి సమాచారం అందించినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఇటు పటాన్చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఇవాళ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుల పరామర్శకు వెళ్లిన కంపెనీ వైస్ చైర్మన్ చిదంబర్తో కార్మికుల కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చిదంబర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘30 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమయంలో లోపల 60 మంది ఉన్నారు. ఘటన తర్వాత కార్మికుల యోగక్షేమాలను కంపెనీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిన్నటి సీఎం పర్యటనలో సంస్థ ప్రతినిధులు ఉన్నారు. మా పరిశ్రమవాళ్లు లేరని సీఎం ఎందుకు అన్నారో నాకు తెలియదు. నా అనారోగ్యం వల్ల రాలేకపోయాను. అయినా కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితర అధికారులతో టచ్‌లోనే ఉన్నారు’’ అని సిగాచి వైస్ చైర్మన్ చిదంబర్ అన్నారు. సిగాచి ప్రమాద స్థలిని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ సమయంలో అక్కడ నిర్వహించిన సమీక్షలోనూ సిగాచి ప్రతినిధులపై సీఎం రేవంత్ అరా తీశారు. ఫ్యాక్టరీ తరఫున ఎవరూ లేకపోవడంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు కూడా. ఇదిలా ఉంటే.. పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ.. కంపెనీ నుంచి వసూలు చేసి ఇప్పిస్తామని, ఇందుకు మంత్రులతో అవసరమైతే చర్చలు జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే.. తక్షణ సాయం కింద ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు లక్ష, గాయపడినవాళ్లకు రూ.50 వేలు ప్రకటించారాయన. అలాగే బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపడతామని, కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. -
జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..
న్యూఢిల్లీ: దేశంలోని జనాభాను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా ఈరోజు(జూన్ 16) జన గణనపై కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది(2026) అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. ఆదివారం జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తదనంతరం జనాభా లెక్కలను గణించే తేదీలను ఖరారు చేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని ఇదివరకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.భారతదేశంలో జనాభా గణన 12 ఏళ్ల తరువాత జరుగుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో జరుగుతున్న జనగనణ పలు కీలక అంశాలను వెల్లడించనుంది. 1948 జనాభా గణన చట్టం ప్రకారం దీనిని నిర్వహించనున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం జనగణన ప్రక్రియను చేపట్టనుంది.జనాభా గణన రెండు ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ జాబితా, గృహ గణన (2026) ఉంటుంది. దీనిలో జనాభాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డేటాను సేకరిస్తారు. ఈ దశ సమగ్ర చిరునామా రిజిస్టర్‌ను రూపొందించేందుకు సహాయపడుతుంది. రెండవ దశలో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస మొదలైనవి నమోదు చేస్తారు.దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్‌గా ఉండనుంది. ఇందుకోసం 16 భాషలలో కూడిన మొబైల్ యాప్‌లను వినియోగించనున్నారు. పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. 2027 జనాభా గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహా అన్ని కుల సమూహాలను కవర్ చేసేలా కులగణన కూడా ఉండనుంది. ప్రభుత్వ విధాన రూపకల్పన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వ్యాపార ప్రణాళికలకు జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం -
‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీరే.. ప్రకటించిన కేంద్రం
సాక్షి,ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. పద్మ విభూషణ్ వరించింది వీరికే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) - తెలంగాణ జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్ కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) - గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక ఎం.టి.వి.వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్ శారదా సిన్హా (కళలు) - బిహార్ ‘పద్మభూషణులు’ వీరే..నందమూరి బాలకృష్ణ (కళలు) - ఏపీఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక అనంత్ నాగ్ (కళలు) - కర్ణాటకబిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్సీటీ ఢిల్లీ జతిన్ గోస్వామి (కళలు) - అస్సాం జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్సీటీ ఢిల్లీ మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడుపీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్ పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్ప్రదేశ్సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్ ఎస్.అజిత్ కుమార్ (కళలు) - తమిళనాడుశేఖర్ కపూర్ (కళలు) - మహారాష్ట్ర శోభన చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్ వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికాపద్మశ్రీ అవార్డు గ్రహీతలు..అద్వైత చరణ్ గడనాయక్ (కళలు) - ఒడిషా అచ్యుత్ రామచంద్ర పలవ్ (కళలు) - మహారాష్ట్ర అజయ్ వి.భట్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా అనిల్ కుమార్ బోరో (సాహిత్యం, విద్య) - అస్సాం అరిజిత్ సింగ్ (కళలు) - బెంగాల్ అరుంధతి భట్టాచార్య (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ) - మహారాష్ట్ర అరుణోదయ్ సాహా (సాహిత్యం, విద్య) - త్రిపుర అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య) - కెనడా అశోక్‌కుమార్ మహాపాత్ర (వైద్యం) - ఒడిషా అశోక్ అక్ష్మణ్ షరఫ్ (కళలు) - మహారాష్ట్ర అశుతోష్ శర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఉత్తర్‌ప్రదేశ్ అశ్విని బిడే దేశ్‌పాండే (కళలు) - మహారాష్ట్ర బైజ్యనాథ్ మహారాజ్ (ఆధ్యాత్మికం) - రాజస్థాన్ బర్రే గాడ్ఫ్రే జాన్ (కళలు) - ఎన్సీటీ ఢిల్లీ బేగమ్ బతోల్ (కళలు) - రాజస్థాన్భరత్ గుప్త్ (కళలు) - ఎన్సీటీ ఢిల్లీ బేరు సింగ్ చౌహాన్ (కళలు) - మధ్యప్రదేశ్ భీమ్‌సింగ్ భవేశ్ (సామాజిక సేవ) - బిహార్ భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) - కర్ణాటక బుదేంద్ర కుమార్ జైన్ (వైద్యం) - మధ్యప్రదేశ్ సి.ఎస్.వైద్యనాథన్ (ప్రజా సంబంధాలు) - ఎన్సీటీ ఢిల్లీ చైత్రమ్ దియోచంద్ పవార్ (సామాజిక సేవ) - మహారాష్ట్ర చంద్రకాంత్ సేత్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - గుజరాత్ చంద్రకాంత్ సోంపుర (ఆర్కిటెక్చర్) - గుజరాత్ చేతన్ ఇ చిట్నిస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఫ్రాన్స్ డేవిడ్ ఆర్ సిమ్లీహ్ (సాహిత్యం, విద్య) - మేఘాలయ దుర్గాచరణ్ రణ్‌బీర్ (కళలు) - ఒడిశా ఫరూక్ అహ్మద్ మిర్ (కళలు) - జమ్ముకశ్మీర్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ (సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ప్రదేశ్ గీతా ఉపాధ్యాయ్ (సాహిత్యం, విద్య)- అస్సాం గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమబెంగాల్ గురువయూర్ దొరాయ్ (కళలు) - తమిళనాడు హర్చందన్ సింగ్ భాఠీ (కళలు) మధ్య ప్రదేశ్ హరిమన్ శర్మ (వ్యవసాయం) - హిమాచల్ ప్రదేశ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే (కళలు) - పంజాబ్ హర్వీందర్ సింగ్ ( క్రీడలు) -హరియాణా హస్సన్ రఘు ( కళలు) - కర్ణాటక హేమంత్ కుమార్ (వైద్యం) - బిహార్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ( సాహిత్యం, విద్య) - ఉత్తర్ ప్రదేశ్ హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (మరణానంతరం) (జర్నలిజం) - ఉత్తరాఖండ్ ఇనివలప్పి మని విజయన్ (క్రీడలు) - కేరళ జగదీశ్ జోషిల ( సాహిత్యం, విద్య) - మధ్య ప్రదేశ్ జస్పీందర్ నారుల (కళలు) - మహారాష్ట్ర జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం) - బ్రెజిల్ మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) - తెలంగాణ కె.ఎల్.కృష్ణ (సాహిత్యం, విద్య) - ఏపీ మాడుగుల నాగఫణిశర్మ (కళలు) - ఏపీ మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) - ఏపీ జోయ్‌నాంచారన్ బతారీ (కళలు) - అస్సాం జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక సేవ) - అరుణాచల్ ప్రదేశ్ కె.దామోదరన్ (పాకశాస్త్రం) - తమిళనాడు కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) - కేరళ కిశోర్ కునాల్ (మరణానంతరం) (పౌర సేవ) - బిహార్ ఎల్.హాంగ్‌థింగ్ (వ్యవసాయం) - నాగాలాండ్ లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - తమిళనాడు లలిత్ కుమార్ మంగోత్ర (సాహిత్యం, విద్య) - జమ్మూకశ్మీర్ లాలా లోబ్‌జంగ్ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) - లద్దాఖ్ లిబియా లోబో సర్దేశాయ్ (సామాజిక సేవ) - గోవా ఎం.డి.శ్రీనివాస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - తమిళనాడు మహాబీర్ నాయక్ (కళలు) - ఝార్ఖండ్ మమతా శంకర్ (కళలు) - పశ్చిమ బెంగాల్ మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) - మహారాష్ట్ర నాగేంద్ర నాథ్ రాయ్ (సాహిత్యం, విద్య) - పశ్చిమ బెంగాల్ నారాయణ్ (భులయ్ భాయ్) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - ఉత్తర్‌ప్రదేశ్ నరేన్ గురుంగ్ (కళలు) - సిక్కిం నీర్జా భాట్ల (వైద్యం) - ఎన్సీటీ ఢిల్లీ నిర్మలా దేవీ (కళలు) - బిహార్ నితిన్ నొహ్రియా (సాహిత్యం, విద్య) - అమెరికా ఓంకార్ సింగ్ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) - పంజాబ్ పి.దచనమూర్తి (కళలు) - పుదుచ్చేరి పాండీ రామ్ మందవీ (కళలు) - ఛత్తీస్‌గఢ్ పార్మర్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (కళలు) - గుజరాత్ పవన్ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) - పశ్చిమ బెంగాల్ ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక -
‘సైఫ్’పై దాడి ఘటన..మంత్రి కీలక ప్రకటన
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మీద దుండగుడి దాడి ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్(Yogesh Kadam) పుణెలో శుక్రవారం(జనవరి17) మీడియాతో మాట్లాడారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల ప్రమేయం ఏమీ లేదన్నారు. సైఫ్‌పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు ఉన్న ఈ యువకుడికి నేర చరిత్ర ఉందన్నారు.అయితే, సైఫ్‌పై దాడి ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించినట్లు చెప్పారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరో వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. దుండగుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని,సెక్యూరిటీ కూడా అడగలేదని చెప్పారు.ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. మరోవైపు సైఫ్ శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోనే అతడిపై దాడి జరిగింది. అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు.ఇదీ చదండి: ఫస్ట్ టార్గెట్ సైఫ్ కాదట.. -
చార్ధామ్ యాత్ర.. ముగింపు తేదీలివే
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్ధామ్ తలుపులు మూసివేయనున్నారు.సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడున మూసివేయనున్నామన్నారు. అలాగే తుంగనాథ్ ధామ్ తలుపులు నవంబర్ నాలుగున మూసివేయనున్నామని, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామన్నారు. ఈ నాలుగు ధామాలను సందర్శించాలనుకునే భక్తులు ఈ తేదీలలోపునే రావాలని సత్పాల్ మహరాజ్ కోరారు.ఈ ఏడాది మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ఇటీవల కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి.ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చార్ధామ్ దర్శనానికి 37 లక్షల 91 వేల 205 మంది యాత్రికులు రాగా, గత ఏడాది 56.13 లక్షల మంది యాత్రికులు దర్శనానికి వచ్చారు. ఈ సంఖ్య 2022లో 46.29 లక్షలు కాగా 2019లో 34.77 లక్షలు. 2020, 2021లలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చార్ధామ్ యాత్ర అంతంత మాత్రంగానే సాగింది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం