breaking news
Aliganj
-
లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!
అలీగంజ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్లో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ కారణంగా 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘోర విషాదం వెనుక నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నివాస గృహంగా అనుమతి పొందిన ఒక భవనాన్ని, ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేయడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.అనుమతి నివాసానికే.. వ్యాపారం మాత్రం కోట్లలోలక్నో డెవలప్మెంట్ అథారిటీ రికార్డుల ప్రకారం.. ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఈ అంతస్తుల భవనానికి 2014లో కేవలం ‘నివాస భవనం’గానే అనుమతి లభించింది. రామేశ్వరం గ్రూప్‌నకు చెందిన వీరేంద్ర ప్రసాద్ శుక్లా, సురేంద్ర ప్రతాప్ శుక్లా, ధీరేంద్ర ప్రతాప్ శుక్లాల పేరిట ఈ ప్లాన్ ఆమోదం పొందింది. ఆ తర్వాత కాలంలో ఈ ఆస్తి చేతులు మారింది. కాగితాల్లో ఇది నివాస ప్రాంతంగానే ఉన్నప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి ఇందులో ఆఫీసులు, యానిమేషన్ శిక్షణ కేంద్రాలు వంటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎలాంటి కమర్షియల్ అనుమతులు గానీ, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ (అగ్నిమాపక శాఖ అనుమతి) గానీ తీసుకోలేదని దర్యాప్తులో తేలింది.బయోమెట్రిక్ లాక్ మృత్యుపాశంఈ భవనంలో కనీస అత్యవసర నిష్క్రమణ మార్గం లేకపోవడం, పైకప్పు కు వెళ్లే దారిని మూసివేయడం పెద్ద తప్పిదాలని అధికారులు పేర్కొన్నారు. అన్నింటికంటే దారుణంగా, ఈ కోచింగ్ సెంటర్ ఎంట్రీ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్ మెకానిజం, ప్రమాదం జరిగిన సమయంలో కరెంట్ పోవడంతో పూర్తిగా జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక, దట్టమైన పొగలో ఊపిరాడక లోపలే చిక్కుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినప్పటికీ, ఈ లోపభూయిష్టమైన భవన నిర్మాణం వల్ల సహాయక చర్యలు అత్యంత కఠినంగా మారాయి.మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంఈ దందాలో స్థానిక మున్సిపల్ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ 2022 నుండి ఈ భవనం నుండి ‘కమర్షియల్ ప్రాపర్టీ టాక్స్’ వసూలు చేస్తోంది. అంటే, ఇక్కడ నివాస భవనంలో వ్యాపారం సాగుతోందనే విషయం అధికారులకు ముందే తెలుసు. అయినా వారు కళ్లు మూసుకున్నారు. ఈ ఘోరానికి కారణమైన నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ల్యాండ్ యూజ్ మార్పిడిని పట్టించుకోని మాజీ ఎల్డీఏ సిబ్బంది, ఇంజనీర్లతో సహా మొత్తం 16 మంది అధికారుల జాబితాను సిద్ధం చేసి, వారిపై కఠిన చర్యలకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.ఇది కూడా చదవండి: కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి -
ఆమ్లెట్లో ఉల్లిపాయలు లేవని.. కాల్చిపారేశాడు!!
ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి. పానీ పూరీ నుంచి దేంట్లోనూ ఒక్క ఉల్లిపాయ ముక్క కనపడితే ఒట్టు. ఇలాంటి సమయంలో, ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయడం సాధ్యమేనా? కానీ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం.. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదని ఓ వ్యక్తి ఓ చిరు వ్యాపారిని కాల్చి పారేశాడు!! ఈ సంఘటన ఇటా ప్రాంతంలోని అలీగంజ్ సమీపంలో జరిగింది. పూజారి అనేవ్యక్తి పాత నేరస్థుడు. అతడు తనతో పాటు నలుగురు స్నేహితులకు ఆమ్లెట్లు కావాలని ఓ చిరు వ్యాపారి వద్ద ఆర్డర్ చేశాడు. అతడు ఆమ్లెట్లయితే ఇచ్చాడు గానీ, వాటిలో ఉల్లిపాయలు వేలేదు. దీంతో వారందరికీ ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఉల్లిపాయలు కొనేంత స్థోమత తనకు లేదని, అందువల్లనే ఉత్త ఆమ్లెట్లు ఇస్తున్నానని దీపు కశ్యప్ అనే సదరు చిరు వ్యాపారి వారికి చెప్పాడు. వెంటనే పూజారి జేబులోంచి తుపాకి తీసి.. అతడిని కాల్చిపారేశాడు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని, వారి కోసం గాలిస్తున్నామని ఐజీపీ (ఆగ్రా) అశుతోష్ పాండే తెలిపారు.


