breaking news
Alarming
-
ఇలా చేస్తే వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం!
నగరం బరువెక్కుతోంది.. స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు డిప్రెషన్ దీనికి తోడు పోషకాహార లోపం ఇవన్నీ క్రమంగా నగరవాసులను రోగాలవైపు నెడుతున్నాయి. ఫలితంగా నగరవాసుల శరీరాకృతుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉంది. దీంతో అలసట, కీళ్ల నొప్పులు, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల నగరంలో నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వే వెల్లడిస్తోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ వంటి ఇతర రోగాలు చుట్టుముడుతున్నాయని, ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.. – సాక్షి, సిటీబ్యూరో చుట్టూ ఎత్తయిన భవనాలు.. అద్దాల మేడలు.. ఖరీదైన కార్లు.. అత్యాధునిక వసతులు. చూడ్డానికి విలాసవంతమైన జీవితం.. అంతా బానే ఉందిగా!.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.. వాస్తవానికి అవతలవైపు చూస్తే.. ఉరుకుల పరుగుల జీవనం, నిత్యం పని ఒత్తిడి, తీరికలేని జీవితం, ఆందోళన, డిప్రెషన్, ఉద్యోగ భద్రత గురించిన ఆలోచన, లోన్లు, ఈఎంఐల భయాలు, నెలవారీ ఖర్చులు, లక్షల్లో పిల్లల ఫీజులు, నెలాఖరుకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇది సగటున నగర జీవిని వేధిస్తోన్న ప్రధాన సమస్య.. ఫలితంగా ఒత్తిడికి లోనై కంటికి కనిపించని రోగాలైన బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సేవలందిస్తోంది. ఐటీ కారిడార్, చుట్టూ పరిసర ప్రాంతాలు పది కిలో మీటర్ల పరిధిలో కిమ్స్ ఆస్పత్రి నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు గల 6 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించగా అందులో ఉద్యోగుల్లో 45 శాతం మంది డిప్రెషన్లో ఉంటున్నారట. ఆందోళన, భయం, యాంగ్జైటీతో బాధపడుతున్నారని తేలింది. మరో వైపు ఇంటి పట్టునే ఉంటున్న వ్యక్తులు మధుమేహం, రక్త పోటుతో నిత్యం ఇబ్బంది పడుతున్నారట. ఆపై ఉబకాయం, డయాబెటిస్, రక్తపోటు, లివర్ సమ్యలు, థైరాయిడ్, పీసీఓడీ వంటి రోగాలతో నిత్యం సతమతమవుతున్నారని స్పష్టమవుతోంది. మహిళల్లో అత్యధికంగా ఉబకాయం, కీళ్ల నొప్పులు, ఇల్నెస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కల్లో ఎక్కువ మంది ఉపవాసం (ఫాస్టింగ్) చేస్తున్నారు. మరికొంత మంది సిక్స్‌ప్యాక్, జీరోప్యాక్, స్లిమ్ అంటూ ఎక్కువ సమయం జిమ్‌లో కాలం గడుపుతున్నారు. ఆహారానికి బదులుగా ప్రొటీన్, ఇతర సప్లిమెంట్స్ తీసుకుటున్నారు. దీంతో అనర్థాలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్వ్యాయామం అవసరం.. ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకు మాత్రమే వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం ఉంది. అయితే ఒకే సారి మొత్తం బరువు తగ్గిపోవాలని అనుకోవడం మంచిది కాదు. వెయిట్ లాస్ కోసం వ్యాయామంతో పాటే వివిధ రకాల శస్త్రచికిత్సలు, అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, ఇవి దీర్ఘకాలంలో సత్ఫలితాలను అందిస్తాయంటున్నారు. లైఫ్ స్టైల్లో మార్పులు.. టెక్ కంపెనీలు, అనుబంధంగా పనిచేస్తున్న రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు మిడ్ షిఫ్ట్, పూర్తిగా నైట్ షిఫ్ట్ పద్ధతుల్లో రాత్రి విధుల్లో ఉంటున్నారు. దీనికి తోడు నిత్యం టార్గెట్లతో విపరీతమైన ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్యాడ్జెట్స్‌కు అతుక్కుపోతున్నారు. కొంత మంది పగలు నిద్ర పోదామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు. కనీసం 7 గంటలు నిద్రపోవాల్సి ఉన్నా డీప్ స్లీప్ రెండు నుంచి మూడు గంటలే ఉంటుందని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. తీసుకునే ఆహారంలోనూ పాశ్చాత్య రుచులకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవు తున్నారు. చైనీస్, కొరియన్, అమెరికన్ స్టైల్ ఆహారానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పోషకాల లోటును భర్తీ చేయడం కోసం వివిధ రకాల ప్రొటీన్, ఇతర పౌడర్లను తీసుకుంటున్నారు. ఫలితంగా శరీరంలోని కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
చెడుకు చెక్.. పిల్లల్లో ఈ అయిదు ప్రమాద సంకేతాలు
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగులు జీవితాలు. పిల్లలను రెడీ చేసి స్కూళ్లకు పంపించి, తాము రెడీ అయి ఆఫీసులకు వెళుతుంటారు తల్లిదండ్రులు. ఎలాగూ స్కూల్‌కి పంపిస్తున్నాం కదా...అన్నీ అక్కడ టీచర్లే చూసుకుంటారులే అని పేరెంట్స్, పిల్లల ప్రవర్తనను సరిచేయాల్సింది వారి తల్లిదండ్రులే అని టీచర్లు అనుకోవడం సాధారణంగా జరిగిపోతుంటుంది. మార్కులు, ర్యాంకులు, గ్రేడులు చూసుకొని సంతృప్తి పడిపోతారు. ‘కానీ, పిల్లలు సరైన దారిలో ఉన్నారా, చెడు స్నేహాల్లో తమను దాటిపోతున్నారా అనేది చూసుకోవాల్సింది తల్లిదండ్రులే. బిడ్డ చెడు సహవాసంలో ఉందని చెప్పడానికి ఈ 5 హెచ్చరిక సంకేతాలు విస్మరించవద్దు’ అంటున్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు, నిపుణులు. ఈ విషయాల సాయంతో మీరు మీ పిల్లల ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు. సకాలంలో వాటిని సరిదిద్దడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడటం...: ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించినట్లయితే, అది మీ బిడ్డ తప్పుడు సహవాసంలో ఉన్నాడనడానికి సంకేతంగా గుర్తించాలి. స్నేహితుడి తప్పులకు వత్తాసు పలకడం: ఒక పిల్లవాడు తన స్నేహితుడి చెడు ప్రవర్తనకు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తే, అది ఆ పిల్లవాడు ఆ చెడ్డ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యా డనడానికి స్పష్టమైన సంకేతంగా గ్రహించాలి. దీనిని తల్లిదండ్రులు హెచ్చరికగా తీసుకోవడం మంచిది.తరచూ ప్రతికూల చర్చలు : మీ బిడ్డ అకస్మాత్తుగా తన గురించి తాను ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్నట్లు అనిపిస్తే, అది అతని తోటివారి ప్రతికూల ప్రభావాల వల్ల కావచ్చని గుర్తించాలి.రహస్యంగా మాట్లాడటం లేదా చాటింగ్...: ఒక పిల్లవాడు అకస్మాత్తుగా తన ఫోన్‌ను దాచి స్నేహితులతో మాట్లాడటం లేదా చాటింగ్ చేస్తున్నప్పుడు తన మొబైల్ స్క్రీన్‌ను దాచుకోవడం ప్రారంభిస్తే, తల్లిదండ్రులు అలెర్ట్‌గా ఉండాలి.చదువు నుండి పారిపోవడం...: మీ బిడ్డ ఉన్నట్టుండి స్కూల్‌కి వెళ్లనని మొరాయించడం లేదా హోంవర్క్ చేయకుండా మొండికి వేయడం, స్కూల్ ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్పడం లేదా చదువుపై ఆసక్తి చూపక΄ోవడం.. వంటివి గమనిస్తే అది సోమరితనం వల్ల మాత్రమే కాదు, చెడు సహవాసం వల్ల కూడా కావచ్చు అని గ్రహించాలి. పిల్లల ప్రవర్తనలో పై విధమైన మార్పులు గమనిస్తే సకాలంలో తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు స్కూల్ టీచర్ల సాయం తీసుకోవడం, నిపుణుల కౌన్సెలింగ్‌తో.. చెడు సావాసాలను గుర్తించి, పొరపాట్లను నివారించి, సమస్యను చక్కదిద్దవచ్చు.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! -
కనుగుడ్లకు పచ్చబొట్టు!
ఐ బాల్ టాటూ... ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫ్యాషన్ ప్రియుల నేస్తంగా మారింది. ఆందోళనకరమైన ఈ కొత్త పోకడను జనం ప్రేమగా ఆహ్వానించేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు వారి కనుగుడ్లకు పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. తెల్లగుడ్డుకు రంగులను ఇంజెక్ట్ చేయించుకుని... అందరికీ భిన్నంగా కనిపించేందుకు ఆరాటపడుతున్నారు. అమెరికన్ బాడీ మాడిఫికేషన్ ప్రతిపాదకుడు లూనా కోబ్రా స్థాపించిన ఈ ఐ బాల్ టాటూయింగ్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తోంది. అంధత్వానికి, క్యాన్సర్ కు కారణమౌతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫ్యాషన్ ప్రియులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వెర్రి వేయి విధాలు అన్నట్టుగా తయారైంది ఇప్పుడీ ఫ్యాషన్ల జోరు. వద్దన్నా వినకుండా అందం కోసం అర్రులు చాస్తూ... ప్రపంచాన్ని చూపించే కనుపాపకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. కనుపాపకు చుట్టూ ఉండే తెల్లని గుడ్డు ప్రాంతానికి రంగులతో టాటూ వేయించుకొని సంబరపడిపోతున్నారు. జనం ధోరణి మారుతోందని... వారు విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారని.. ఐ బాల్ టాటూయింగ్ ఓ కొత్త ట్రెండ్ మాత్రమేనని లూనా కోబ్రా అంటున్నారు. అయితే ఇది ఎవరికి వారు వేసుకునే ప్రయోగం చేస్తే ప్రమాదమౌతుందేమోనని వైద్యులు ఆందోళన చెందుతున్నారని కోబ్రా చెప్తున్నారు. జోయెల్ ట్రాన్, నేయీపయర్ దంపతులు వారి కనుగుడ్లకు టెన్నిస్ బాల్ రంగును, ద్రాక్ష రంగును వేయించుకున్నారని ఈ బాడీ మాడిఫికేషన్ ఆర్టిస్ట్ చెప్తున్నారు. అయితే ఇటీవల కనుగుడ్లకు లూనా కోబ్రా చేత నీలిరంగును వేయించుకుందన్న కైలీ గార్గ్ మాత్రం ఈ ఐబాల్ టాటూయింగ్ చేసేప్పుడు నొప్పిగా అనిపించకపోయినా... ఇదో భయానకమైన చర్య అని చెప్పడం విశేషం. -
వైఎస్ జగన్ ఆరోగ్యం విషమం