ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇలా వచ్చే మలయాళ థ్రిల్లర్స్‌కి తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే ప్రతివారం లేదంటే నెలకు ఈ జానర్ నుంచి మూడు నాలుగు మూవీస్ అయిన రిలీజ్ అవుతుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కొడుకు సినిమా.. డేట్ ఫిక్స్)తెలుగులోనూ చాలా సినిమాలు చేసిన ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆషా'. ఐశ్వర్య లక్ష్మి కూతురి పాత్ర చేయగా జోజూ జార్జ్ నెగిటివ్ టచ్ ఉన్న విలన్ పాత్రలో కనిపించాడు. గత నెల 11న థియేటర్లలో మలయాళంలోనే రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు వచ్చే శుక్రవారం(అక్టోబర్ 16) నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'ఆషా' విషయానికొస్తే.. ఓ చిన్న నర్సరీ నడుపుకునే ఆశా(ఊర్వశి) గతంలో జరిగిన ఒక సంఘటన వల్ల మానసికంగా కుంగిపోతుంది. ఐటీ జాబ్ చేసే కూతురు అనఘ(ఐశ్వర్య లక్ష్మి)తో కలిసి జీవిస్తుంటుంది. ఒకరోజు రాత్రి ఆశా-అనఘ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా జోమన్ (జోజు జార్జ్) కారుని ఢీకొడుతుంది. మాట్లాడుకుంటే ముగిసిపోయే సమస్య కాస్త పెరిగి పెద్దదై పోలీస్ కేసు వరకు వెళ్తుంది. ఈ నిర్ణయం వల్ల ఆశా,జోమన్ కుటుంబాలు ఎలాంటి మానసిక పరిణామాలు ఎదుర్కొన్నాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఏడాది తిరిగేసరికి మళ్లీ తల్లి కాబోతున్న 'టాక్సిక్' హీరోయిన్)(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు మిస్ కావొద్దు)