-
హీరోయిన్ ధన్సిక తొలిసారి డబుల్ రోల్
'మనోహరి' చిత్రం ద్వారా నటి ధన్సిక తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గీత రచయిత స్నేహాన్ భార్య కన్నిక స్నేహాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై మహేశ్వరన్ నందగోపాల్ నిర్మిస్తున్నారు. నవాజ్ మహ్మద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కేవీ మణి ఛాయాగ్రహణం, కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఉద్ఘర్ష మంచి అనుభూతిని కలిగిస్తుంది
కన్నడ పరిశ్రమలో వినూత్న సినిమాలతో పేరు పొందారు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఉద్ఘర్ష’. అనూప్ సింగ్ ఠాకూర్, తాన్యా హోప్, ధన్సిక, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవరాజ్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మర్డర్ మిస్టరీ ట్రైలర్ లాంచ్ బెంగళూర్‌లో జరిగింది. ‘కిచ్చ’ సుదీప్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ట్రైలర్‌ను కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి ప్రేమ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మోస్ట్ చాలెంజింగ్ పాత్ర ఇది. సినిమా చేయడంలో కొంచెం ఆలస్యం అయింది. అయినా ఎక్కడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకున్నారు దర్శకుడు దేశాయ్. ఆయన సినిమాలో పని చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. గొప్ప థ్రిల్లర్‌ను చూశారన్న అనుభూతిని పొందుతారు’’ అన్నారు. ‘‘సునీల్‌గారి సినిమా అనగానే ఓకే అన్నాను. సునీల్కుమార్గారితో ఆల్రెడీ ‘రే’ అనే సినిమా చేశాను. ఇందులో నా క్యారెక్టర్ ఏంటో చెప్పకూడదు. సస్పెన్స్. కానీ కచ్చితంగా షాక్ అవుతారు’’ అన్నారు హర్షిక పొన్నాడ ‘‘కన్నడ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు ఠాకూర్. తనని అభినందించి తీరాలి’’ అన్నారు దర్శన్. ‘‘వాయిస్ ఓవర్ అందించిన సుదీప్‌కు థ్యాంక్స్. టీమ్ అందరూ కష్టపడ్డాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సునీల్‌కుమార్ దేశాయ్. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి తెలుగులో వాలు జడ సినిమాతో పాటు తమిళ్లో యోగి డా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ధన్సికకు గాయాలయ్యాయి. బార్లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది రౌడీలు ధన్సిక పైకి బీర్ బాటిళ్లను విసిరే సన్నివేశం షూట్ చేస్తుండగా పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమె దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ధన్సిక ట్రీట్మెంట్ పూర్తి అయిన వెంటనే గాయంతోనే తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. -
కబాలి కూతురి కర్రసాము
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం వాలుజడ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబాలి సినిమాలో యాక్షన్ సీన్స్‌లో కనిపించిన ధన్సిక తాజాగా కర్రసాము చేస్తూ అలరించారు. ఈ వీడియోను ధన్సిక పర్సనల్ పీఆర్వో ప్రియా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న ధన్సిక.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
ఒక హీరో.. నాలుగు కథలు
దుల్కర్ సల్మాన్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేసి, డాక్టర్ గౌతమ్ కశ్యప్, నిర్మాత వెంకటేశ్‌కు అందించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్‌లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగ్ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. మాటల రచయిత గౌతమ్ కశ్యప్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement