ఆయన మాటల వల్ల వారం నిద్రపోలేదు | Dhansika responds on T Rajender issue | Sakshi
Sakshi News home page

ఆయన మాటల వల్ల వారం నిద్రపోలేదు

Nov 16 2017 9:16 AM | Updated on Nov 16 2017 10:19 AM

Dhansika responds on T Rajender issue - Sakshi

ఇటీవల తమిళనాట సీనియర్ నటుడు దర్శకుడు టీ రాజేందర్, హీరోయిన్ ధన్సికల మధ్య జరిగిన వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా వేడుకలతో తన పేరు ప్రస్తావించలేదంటూ రాజేందర్, ధన్సికను ఉద్దేశించి స్టేజ్ మీదే అవమానకరంగా మాట్లాడటం, ఆమె కన్నీరు పెట్టుకోవటంతో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో పలువురు తమిళ సినీ నటులు ధన్సికకు మద్ధతు తెలిపారు.

తాజాగా ఈ సంఘటనపై ఓ మీడియా సమావేశంలో స్పందించిన ధన్సిక, ఆ సంఘటన గురించి వివరించారు. రాజేందర్ మాటలు తనను తీవ్రంగా బాధించాయని, ఆ సంఘటన తరువాత తనకు వారం రోజుల పాటు నిద్రపట్టలేదని తెలిపింది. అంతేకాదు టి రాజేందర్ ఆధ్యాత్మిక వేత్త అని చెపుతుంటారన్న ధన్సిక ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి అలా మాట్లాడరని, అందరి ముందూ అలా కేకలు వేయరని తెలిపింది. తాను గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని, మహిళలకు ఏ రంగంలో అయినా ఈ బాధలు తప్పవని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement