హత్య చేసిందెవరు? | Mela Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

హత్య చేసిందెవరు?

Apr 22 2018 12:43 AM | Updated on Apr 22 2018 12:43 AM

Mela Movie Teaser Launch - Sakshi

సూర్యతేజ్, సిమ్రాన్

సూర్యతేజ్, ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘మేళా’. కిరణ్‌ శ్రీపురం దర్శకత్వంలో మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో సంతోష్‌ కుమార్‌ కొంకా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హాస్య నటుడు అలీ, కెమెరామెన్‌ ఎస్‌.గోపాల్‌ రెడ్డి విడుదల చేశారు. 

కిరణ్‌ శ్రీపురం మాట్లాడుతూ– ‘‘మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి మా సినిమానే నిదర్శనం. మూడు వేరియేషన్స్‌లో సాగుతుంది’’ అన్నారు. ‘‘మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు సూర్యతేజ్‌. సిమ్రాన్, సోని చరిష్టా,  మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement