ఇద్దరు సెలబ్రిటీలు కలిసి కనిపించారంటే గాసిప్స్ మొదలవడం ఖాయం అందునా భిన్నరంగాలకు చెందిన వారు కలిస్తే ఇంకేమైనా ఉందా!
క్రికెట్ స్టార్.. హర్యానా హరికేన్ కపిల్‌దేవ్.., ఫిల్మ్‌స్టార్.. బాలీవుడ్ బ్యూటీ సారిక గురించే ఈ కథనం.
వీళ్లిద్దరిని ఓ పార్టీలో పరస్పరం పరిచయం చేసింది వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ సతీమణి.
అలా మొదలైన స్నేహ బంధం.. విరామ సమయాల్లో కలుసుకునేవరకు వెళ్లింది.
ముదిరిపాకాన పడి ప్రేమగా మారి.. ఆపై పెళ్లి వరకు వెళ్లింది.. కానీ..
కపిల్ దేవ్ అనూహ్యంగా సారికతో బంధాన్ని బ్రేక్ చేసుకున్నాడు
రోమీ భాటియా అతడి జీవితంలో తిరిగి రావడమే ఇందుకు కారణం
సారిక కపిల్ జీవితంలోకి రాకముందే రోమీతో అతడు ప్రేమలో పడ్డాడు
అయితే, అభిప్రాయ భేదాల వల్ల కాస్త దూరమయ్యారు
అందుకు సారికే ఒక కారణం అయి ఉండవచ్చని బీ-టౌన్‌లో అప్పట్లోవార్తలు వచ్చాయి
ఏదేమైనా.. రోమితో మళ్లీ మాటలు కలవగానే... సారికకు గుడ్‌బై చెప్పేశాడు
దీంతో షాక్‌కు గురైన సారికకు.. అదే సమయంలో కమల్ హాసన్‌తో పరిచయం ఏర్పడింది
ఆ తర్వాత కమల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగింది
వారి ప్రేమకు గుర్తుగా శృతి హాసన్ కడుపులో పడగా.. ఆతర్వాత కమల్- సారిక వివాహం జరిగింది
ఈ జంట రెండో కూతురు అక్షర్ హాసన్. అయితే, తర్వాత సారిక- కమల్ విడిపోయారు మరోవైపు.. రోమిని పెళ్లిని చేసుకున్నాడు కపిల్ దేవ్ వీరికి అమియా దేవ్ అనే కూతురు ఉంది అలా కపిల్ దేవ్, సారికల ప్రేమాయణం పెళ్లి పీటల వరకు రాకుండానే ముగిసిపోయింది


