కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్‌పాయ్‌గురి వద్ద ఓ గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొట్టింది.
ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఇప్పటిదాకా 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
మరో 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండడం.. క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.


