
సుడిగాలి సుధీర్ (సుధీర్ ఆనంద్) హీరోగా ‘హైలెస్సో’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుధీర్, అతని సరసన హీరోయిన్లుగా నటిస్తున్న నటాషా సింగ్, నక్ష శరణ్, కీలక పాత్ర పోషిస్తున్న అక్షర గౌడలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకులు మెహర్ రమేశ్, చందు మొండేటి, వశిష్ఠ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు.

హీరో నిఖిల్ టైటిల్‌ను లాంచ్ చేశారు. నిర్మాత బన్నీ వాసు స్క్రిప్ట్‌ను అందజేశారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.










