
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు.

సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్‌ని ఖరారు చేశారు

నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రామ్ చరణ్ విడుదల చేశారు
































