
ఖుషి చిత్రం విజయోత్సవ సభను సోమవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు

తన సంపాదన నుంచి అభిమానులకు రూ.కోటి విరాళం అందిస్తానని హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు

ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో నన్ను అభిమానించే కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

ఇందుకోసం ఓ ఫారం విడుదల చేస్తానని, డబ్బులు అవసరం అనుకున్న వారు ఈ ఫారం నింపి పంపించాలని సూచించారు.

వచ్చిన దరఖాస్తుల్లో వంద మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేస్తానని చెప్పారు.

అభిమానులు ఇచ్చే ప్రేమ చాలా గట్టిగా తగులుతుందన్నారు

ఫేక్ రేటింగ్‌లు, ఫేక్ రివ్యూలు దాటుకుని ఖుషి సినిమా విజయం సాధించడానికి అభిమానులే కారణమన్నారు

మూడు రోజులుగా అభిమానుల ముఖంలో చిరునవ్వులతో నేను చాలా ఖుషీగా ఉన్నానని చెప్పారు

ఇప్పటి వరకు డబ్బు, కుటుంబం కోసం పని చేశానని, ఇక నుంచి అభిమానుల సంతోషం కోసం పనిచేస్తానన్నారు

‘నాకు ఖుషి మీరు కనబడితే.. నాకు ఖుషి మీ అరుపులు వినబడితే’అంటూ పాట పాడి అభిమానుల్లో హుషారెత్తించారు

































