
తమిళ హీరో ధనుష్, అతడి మాజీ భార్య ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కాబోతున్నారా?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే జరిగేలా కనిపిస్తుంది.

ఎందుకంటే 2004లో ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. 18 ఏళ్ల పాటు కలిసే ఉన్నారు.

విడాకులు తీసుకోబోతున్నామని చెప్పి ధనుష్-ఐశ్వర్య 2022లో అందరికీ షాకిచ్చారు.

అప్పటినుంచి ధనుష్, ఐశ్వర్య ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు.

కొన్నాళ్ల క్రితం వీళ్లిద్దరూ తిరిగి కలిసిపోనున్నారనే రూమర్స్ వచ్చాయి. కానీ వాటిపై క్లారిటీ లేదు.

ఇకపోతే అక్టోబర్ 6న చెన్నై కోర్టులో విడాకుల విచారణ జరిగింది. దీనికి ధనుష్-ఐశ్వర్య రావాలి కానీ రాలేదు.

అక్టోబర్ 19కి వాయిదా పడితే, తాజాగా ఈ తేదీన కూడా కోర్టుకు ధనుష్-ఐశ్వర్య హాజరవలేదు.

దీంతో ధనుష్-ఐశ్వర్య.. మళ్లీ ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం ఏమంత బాగుండటం లేదు. మొన్నీమధ్యే ఆస్పత్రిలో కొన్నిరోజుల పాటు రజినీ ఉండొచ్చారు.

అయితే కూతురు జీవితం ఇలా అవడం వల్లే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందనే టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే తండ్రిని చూసి ఐశ్వర్య, మామని చూసి ధనుష్.. విడాకుల విషయంలో మెట్టు దిగినట్లు తెలుస్తోంది.

అందుకే కోర్టులో విడాకుల విచారణకు హాజరు కావడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ విషయమై క్లారిటీ వస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవ్.







