పై ఫోటోలో బాబును ఎత్తుకున్న బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది.
స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది. హిందీ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
ఆవిడే.. హీరోయిన్ సనా ఖాన్. యేహి హై సొసైటీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
కళ్యాణ్ రామ్ కత్తి చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. గగనం, మిస్టర్ నూకయ్య సినిమాలు చేసింది.
2019లో అయోగ్య సినిమాలో ఓ పాటలో మెరిసింది.
తర్వాత వెండితెరపై కనిపించనేలేదు.
2020లో అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లాడింది.
వీరికి గతేడాది బాబు పుట్టాడు. భర్త, కొడుకుతో కలిసి ఆ మధ్య మక్కాకు కూడా వెళ్లొచ్చింది.
తాజాగా బాబు ఫేస్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
ఇది చూసిన అభిమానులు బుడ్డోడు క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.


