హీరోయిన్ కరీనా కపూర్ కజిన్, బాలీవుడ్ నటుడు ఆదార్ జైన్ పెళ్లి ఘడియలు మొదలయ్యాయి.
ప్రియురాలు అలేఖ అద్వానీతో అతడు ఏడడుగులు వేయనున్నాడు.
ఇటీవలే వీరి మెహందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు రణ్‌బీర్ కపూర్-ఆలియా, కరిష్మా కపూర్, కరీనా కపూర్.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఈ వేడుకలో ఆదార్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ తనను ప్రేమించాను.
తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను.
తనను కలవడానికి ముందు 20 ఏళ్లపాటు టైంపాస్ చేశాను.
కానీ ఆ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం దక్కింది.
అందమైన అమ్మాయితో నా పెళ్లి జరగబోతోంది.
అంతకంటే ముందు నాలుగేళ్లపాటు టైంపాస్ చేశాను.
చివరకి నీ చెంత చేరాను బేబీ అని స్పీచ్ ఇచ్చాడు. రాజ్ కపూర్- కృష్ణ కపూర్‌ల మనవడే ఆదార్ జైన్.


