సిటీలో బతుకమ్మ సందడి రెండు రోజుల ముందే ఆరంభమైంది. సోమవారం సంప్రదాయం ప్రకారం కూకట్‌పల్లిలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకొన్నారు
అమావాస్యకు ముందురోజే బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించటం కూకట్‌పల్లి ప్రజల ఆనవాయితీ
ఈసారి అమావాస్యకు ముందు రోజు మంగళవారం రావటంతో సోమవారం రోజే బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు
మొదటి రోజు మహిళలు భారీ ఎత్తున బతుకమ్మలతో హనుమాన్ చౌరస్తాకు తరలివచ్చారు. అక్కడే ఆటపాటలతో బతుకమ్మను పూజించారు
అనంతరం రంగధాముని చెరువు వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు


