మానేరు తీరం భక్తజన సంద్రమైంది. సిరిసిల్ల కార్మికక్షేత్రం బుధవారం భక్తకోటితో పరవశించి పోయింది. మాఘ అమావాస్య పుణ్యదినాన ఇసుకేస్తే రాలనంత జన సందోహం మధ్య మూడు జాత ర్లు వైభవంగా జరిగాయి
సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల జనాలు తరలివచ్చి స్వామి వార్ల కల్యాణోత్సవాలను తిలకించారు
మానేరు తీరన గంగపుత్రుల ఆధ్వర్యంలో గంగాభవానీ, నాయీబ్రహ్మణుల ఆధ్వర్యంలో రామలింగేశ్వరస్వామి, రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వరస్వామి కల్యాణోత్సవం, జాతర వైభవంగా జరిగింది


