చేతబడి చేస్తున్నాడని... | old man attacked by villagers | Sakshi
Sakshi News home page

చేతబడి చేస్తున్నాడని...

Jan 2 2018 11:32 AM | Updated on Jul 6 2019 12:36 PM

సాక్షి, యాదాద్రి భువనగిరి: మంత్రతంత్ర విద‍్యలతో చేతబడి చేస్తున్నాడన్న కారణంగా ఓ వృద్ధుడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన చౌటుప్పల్‌ మండలం తంగడిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. చిత్రాల కిష్టయ్య(80) అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడని గ్రామస్తుల నమ్మకం.

అయితే... ఇటీవల గ్రామంలో పలువురు జబ్బుపడ్డారు. కిష్టయ్యే మంత్ర తంత్ర విద‍్యలతో వారిని అనారోగ్యానికి గురిచేశాడన‍్న అనుమానంతో గ్రామస్తులు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ‍్వడంతో వారు వెంటనే స‍్పందించి గ్రామాన్ని సందర్శించారు. అలాగే కిష్టయ్యపై దాడికి పాల్పడ్డ పలువురిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement