వడగళ్ల వాన.. అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం

Tianjin Airlines aircraft made an emergency landing in Central China - Sakshi

బీజింగ్‌ : భారీ వడగళ్ల వాన దాటికి చైనాలో ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. టియాన్‌జిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం టియాన్‌జిన్‌ నుంచి హైనాన్‌కు గురువారం బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే భారీగా వడగాళ్ల వర్షం కురిసింది. దీంతో విమానం ముందు భాగం, అద్దాలు పాక్షికంగా పాడయ్యాయి.

పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి, సమీపంలోని సెంట్రల్‌ చైనాలోని వుహాన్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించడంతో  పెనుప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top