బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

Dam collapse in Brazil - Sakshi

బ్రసిలియా : ఆగ్నేయ బ్రెజిల్‌లో భారతకాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  బెలో హారిజాంటే ప్రాంతంలో మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థ పదార్థాలను వేరు చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోయింది. ఈ క్రమంలో భారీ స్థాయిలో బురద వరదలా పొంగి సమీపంలో ఉన్న ఓ భవన సముదాయాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది గాయపడ్డారు. సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. మినాస్ గెరాయిస్‌లోనే ఓ పట్టణంలో డ్యామ్ కూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top